Main

అసౌకర్యాలతో రెడ్యాల ఆశ్రమ పాఠశాల 

 సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు  పట్టించుకోని జిల్లా అధికారులు మహబూబాబాద్ బ్యూరో ఆగస్టు20 (జనంసాక్షి):మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు విద్యను అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఐటిడిఎ ద్వారా  చేపడుతున్న ఆశ్రమ పాఠశాలల నిర్వహణ జిల్లా అధికారుల నిర్లక్ష్యం మూలంగా అసౌకర్యాలతో కొట్టుమిట్టాడుతోంది.మహబూబాబాద్ మండలంలోని రెడ్యాల గ్రామంలో ఏర్పాటు చేసిన గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో … వివరాలు

జూరాలతో తీరనున్న నీటి సమస్యలు

పంటలకు ఢోకా లేదంటున్న అధికారులు మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి)  : ఉమ్మడి పాలమూరు జిల్లా తాగునీటి అవసరాలను తీర్చుతున్న జూరాల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ఈసారి తుంగభద్రకు వరద నీరు రావడంతో తొలిసారిగా 750 క్యూసెక్కుల వరద నీటిని మొదటి పంపు ద్వారా వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. మూడు రోజులుగా కాల్వల్లోకి నీరు తుమిళ్ల వెలుతుంది. … వివరాలు

యురేనియం తవ్వకాల ఆలోచన విరమించాలి

నల్లమల అడవులను రక్షించాలి పాలమూరు అధ్యయన వేదిక డిమాండ్‌ మహబూబ్‌నగర్‌,జూలై30 (జనం సాక్షి) : నల్లమల అడవుల్లో యురేనియం విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్‌ రాఘవాచారి అన్నారు. ఇక్కడ యురేనియం తవ్వకాల వల్ల జనజీవనం చిద్రం అవుతుందని అన్నారు. అమెరికా లాంటి దేశాలే యురేనియంపై నిషేదం విధించాయన్నారు. అయినా … వివరాలు

మినీ ఎయిర్‌పోర్ట్‌పై మళ్లీ కదలిక

భూములకు ధరలు వస్తాయన్న ఆశలో రైతులు మహబూబ్‌నగర్‌,జూలై30 (జనం సాక్షి) :  జిల్లా ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎయిర్‌పోర్టు ఆశలకు మరోసారి ప్రయత్నాలు మొదలయ్యాయి. భూమలు సర్వేతో మళ్లీ అధికారులు రానున్నట్లు సమాచారంతో ఇక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ బూములకు రేట్లు పలుకుతాయన్న ధోరణిలో ఉన్నారు. రెండేళ్లక్రితం గుడిబండ వద్ద మినీ … వివరాలు

లక్ష్యం మేరకు మొక్కల పెంపకం

మహబూబ్‌నగర్‌,జూలై22(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని డీఎఫ్‌వో తెలిపారు.  జిల్లాలకు కేటాయించిన హరితహారం లక్ష్యానికి తక్కువ కాకుండా మొక్కలు నాటాలని సంబంధిత అధికారులకు సూచించారు.  మొక్కలు నాటే కార్యక్రమం బాధ్యతగా ఉండాలన్నారు. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సిబ్బంది ప్రభుత్వ దవాఖానల్లో మొక్కలు నాటాలని, పంచాయతీరాజ్‌ వారు గ్రామాల రోడ్ల వెంబడి మొక్కలు … వివరాలు

సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేయాలి: బిజెపి 

మహబూబ్‌నగర్‌,జూన్‌7(జ‌నంసాక్షి):  అవినీతి, ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించాలనే ఉద్దేశ్యంతోనే ప్రధాన మంత్రి మోడీ అనేక విప్లవాత్మక చర్యలు తీసుకుంటున్నారని బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆచారి అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థాను సరిదిద్దేందుకు సహాకరించాల్సిన ప్రతిపక్షాలు అనేక విధాలుగా ఆరోపణలు చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను కార్యకర్తలు ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్లి వాటి పూర్తిస్థాయి ప్రయోజనాలను … వివరాలు

పాలమూరులో గెలుస్తున్నాం: ఆచారి

మహబూబ్‌నగర్‌,మే22(జ‌నంసాక్షి): పాలమూరు ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌లో తమకు గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆచారి అభిప్రాయపడ్డారు. ఇక్కడి నుంచి డికె అరుణ గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో నాలుగైదు సీట్లు గెలుస్తామని అన్నారు. ఇదిలావుంటే ఓటమి భయంతో ఉన్న  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అతిగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత … వివరాలు

కొనసాగుతున్న  భూ నిర్వాసితుల ఆందోళన

14వరోజుకు చేరుకున్న నిరసనలు మహబూబ్‌నగర్‌,మే20(జ‌నంసాక్షి): తమకు సత్వర న్యాయం చేయాలని కోరుతూ  పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. పక్షం రోజులుగా ఆందోలన చేస్తున్నాపట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వీరు దీక్షలు చేపట్టి సోమవారం నాటికి 14 రోజులకు చేరింది. కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన తెలిపారు. ఆదివారం ఉదయం పోతిరెడ్డిపల్లి … వివరాలు

రైతులకు అందుబాటులో శుద్దిచేసిన విత్తనాలు 

ప్రైవేట్‌ వ్యాపారుల మోసాలకు చెక్‌ పెట్టే యోచన మహబూబ్‌నగర్‌,మే15(జ‌నంసాక్షి): జిల్లాలో ఎక్కువగా వరి విత్తనాలనే రైతుల నుంచి పండిస్తున్నారు. తరవాత కందులను ఇస్తున్నారు. మిగతావి తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. మిగతా వంగడాల విత్తనాలను డిమాండును బట్టి సంస్థ ఇతర యూనిట్ల నుంచి తెప్పించి పంపిణీ చేస్తున్నారు.ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో  ఖరీఫ్‌ సీజనులో రైతులకు వివిధ రకాల … వివరాలు

ఉల్లి రైతుల నష్టాల సాగు

మార్కెట్లో ధరలు ఉన్నా గిట్టుబాటు కష్టమే వికారాబాద్‌,మే4(జ‌నంసాక్షి): ఉల్లి రైతులకు నిల్వ గోదాములు లేకపోవడంతో నష్టపోతున్నారు. మార్కెట్లో ఉల్లి ధరలు పెరుఉతూనే ఉన్నా రైతులకు మాత్రం ఆ మేరకు ధరనలు అందడం లేదు. నిల్వ చేసుకునేందుకు అనువైన స్థలం లేకపోవడంతో ధర రాకున్నా తక్కువకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. కొందరు రైతులు గడ్డను పంట పొలాల వద్దనే … వివరాలు