Main

(టీఎస్‌పీఎస్సీపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్షా సమావేశం)

హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రగతి భవన్‌ లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సవిూక్ష నిర్వహించారు. ఈ సవిూక్షా సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఐటీ, పురపాలక వాఖ మంత్రి కేటీఆర్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్ధన్‌ రెడ్డి తో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. పేపర్‌ లీకేజీ, పరీక్షల నిర్వహణ, … వివరాలు

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభించిన మంత్రి హరీష్ రావ్- పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.

  కోహిర్ మండలం దిగ్వాల్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు సర్టిఫికెట్లు అందజేసిన రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు, ఈకార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బీబీ పాటిల్,ఎమ్మెల్యే మాణిక్ రావు, చేనేత కార్పొరేషన్ చైర్మన్ చింత ప్రభాకర్. అనంతరం ఈ సందర్భంగా మంత్రి హరీష్  మాట్లాడుతూ హైద్రాబాద్  లోని  … వివరాలు

సంగారెడ్డి జిల్లా కోత్లాపూర్ లో 250 ఎకరాల కబ్జా.

— రోడ్డున పడ్డా బాధితులు. — పట్టించుకోని అధికారులు, నాయకులు. సంగారెడ్డి ప్రతినిధి డిసెంబర్ 27:(జనం సాక్షి): సంగారెడ్డి మండలం కొత్లాపూర్ గ్రామంలోని 146 సర్వే నంబర్ లోని దాదాపు 250 ఎకరాల అసైన్డ్ భూమిని దాదాపు 50 సంవత్సరాల పైగా కబ్జాలో ఉన్న హక్కుదారులను మోసం చేసి, తమ భూములలో కార్ల కంపెనీ పెడతారని, … వివరాలు

రెడ్డి సంఘం తరపున ఆర్థిక సాయం

నంగునూరు మండలం ఖాతా గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం రెడ్డి కులానికి చెందిన దారం కృష్ణారెడ్డి మృతి చెందగా ఆ సంఘం తరపున శనివారం రోజున రెడ్డి కులస్థులు సంఘం అధ్యక్షుని ఆధ్వర్యంలో మృతుని కుటుంబీకులకు దహన కార్యక్రమాల నిమిత్తం రూ. 5000 అందించారు. ఈ కార్యక్రమంలో సంఘం చైర్మన్ దారం జగన్మోహన్ రెడ్డి, … వివరాలు

నిరుపేదలకు అండగా బిఆర్ఎస్ యువనేత MNR

)సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం గుమ్మడిదల గ్రామానికి చెందిన కార్మికుడైన బక్కులు కీర్తి రావు కుమారుడు రాజు మరియు కొత్తపల్లి పోచమ్మ అనారోగ్యంతో చనిపోయిన సమాచారం తెలుసుకున్న బిఆర్ఎస్ జిల్లా యువ నేత మరియు మాజీ ఉపసర్పంచ్ నరేందర్ రెడ్డి మృతుల కుటుంబాన్ని పరామర్శించి నేనున్నానని భరోసా ఇచ్చి ఆర్థిక సాయం అందజేశారు!! ఈ కార్యక్రమంలో … వివరాలు

పాలిథిన్ నివారణ అందరి బాధ్యత: మున్సిపల్ చైర్మన్

పర్యావరణానికి హాని కలిగించే పాలిథిన్ నివారణ అందరి బాధ్యత అని మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్య నగర్ లో డాక్టర్ వీరా బ్రహ్మం పర్యావరణహితమైన కవర్ల తయారీ కేంద్రాన్ని ( బయో డిగ్రేడేబుల్) ఆదివారం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ .ప్రారంభించారు. తదనంతరం పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.  పాలిథిన్ … వివరాలు

సదాశివపేట గుంతల్లో కొరుక్కుపోయిన డీసీఎం వాహనం.

సదాశివపేట్ పట్టణంలో భగీరథ పనులు చేపడుతుండడంతో పట్టణంలో భారీగా గుంతలు ఏర్పడ్డాయి. కావున శుక్రవారం సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలో మిషన్ భగీరథ పనుల కోసం తీసిన గుంతల్లో డీసీఎం వాహనం దిగబడిపోయింది. వెంటనే అధికారులు స్పందించి గుంతలను త్వరలో పూర్తి రోడ్లన్నీ బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

పుట్టగొడుగుల అక్రమ వెంచర్లు.

మామూలు మత్తులో అధికారులు..?? జనం సాక్షి /కొల్చారం   మండలం రంగంపేటలో అక్రమ వెంచర్లు పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయి. వాటిని అరికట్టాల్సిన గ్రామపంచాయతీ పాలకవర్గం, పంచాయతీ అధికారులు మామూలు మత్తులో నిబంధనలకు తిరోధకాలిస్తున్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం వెంచర్లు ఏర్పాటు చేయాలంటే కనీసం 10 శాతం స్థలాన్ని గ్రామపంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్ చేసి కనీస సౌకర్యాలైన … వివరాలు

ఎమ్మెల్సీ వర్గానికి భారీ షాక్

బషీరాబాద్ డిసెంబర్ 15,(జనం సాక్షి) బషీరాబాద్ మండలం పరిధిలో గురువారం రోజున మంతట్టి గ్రామంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వర్గం నుండి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వర్గంలోకి భారీ ఎత్తున పెద్ద సంఖ్యలో చేరడం జరిగింది.ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాము నాయక్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ … వివరాలు

ఎవరో చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్న బంధువులు

మండలం చిన్నగన్పూర్ శివారులో బుధవారం రాత్రి ఓ జోగిని మహిళ బైండ్ల గౌరీ గౌరమ్మ (47) అనుమానాస్పరస్థితిలో మృతి చెందింది. గురువారం తెల్లవారుజామున జాగింగ్ చేయడానికి వెళ్లిన పిల్లలకు  చిన్నాగన్పూర్ నుంచి జోగిపేట వెళ్లే రూట్లో రోడ్డు కింది భాగంలో ఒక మహిళ మృతదేహం కనిపించింది. వారు సర్పంచ్ భర్త సందీప్ కు సమాచారం ఇవ్వగా, … వివరాలు