మెదక్

గంగపుత్రులకు అండగా కెసిఆర్‌ సర్కార్‌

మత్స్యకారులకు ఉచితంగా చేపవిత్తనాల పంపిణీ: హరీష్‌ రావు సిద్ధిపేట,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): గత పాలకులు తెలంగాణ ప్రాంత గంగపుత్రుల సమస్యలు పట్టించుకోలేదని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు తెలిపారు. చేప పిల్లల పెంపకం కోసం బడ్జెట్‌ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఉపాధి పొందడంలో గతంలో మత్స్యకారులు తీవ్ర యాతన పడ్డారని అన్నారు. అయితే నేడు వారి స్థితిగతులు … వివరాలు

తూప్రాన్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం

మెదక్(జ‌నం సాక్షి): జిల్లాలోని తూప్రాన్ బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు నార్సింగ్ మండలం చిన్న శివనూర్ గ్రామానికి చెందిన బోళ్ల సురేశ్, సింగరబోయిన సంతు, అందె రాజుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు … వివరాలు

విద్యుత్‌ సమస్య లేకుండా చేసిన ఘనత కెసిఆర్‌దే

సిద్దిపేట,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యలు లేకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ఇళ్లకు,వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ ఇవ్వాలని సిఎం నిర్ణయించాక నిరంతరంగా దానిని కొసాగిస్తున్నారని అన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణ కావాలని ప్రాజెక్టులను నిర్మిస్తుంటే … వివరాలు

తాగిన గొడవలో వ్యక్తి హత్య

సిద్దిపేట,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): గజ్వెల్‌ నియోజకవర్గం మర్కూర్‌ మండల కేంద్రంలో దారుణం జరిగింది. సవిూపంలోని మామిడి తోటలో దారుణ హత్య జరిగింది. పక్కపక్కనే తోటలలో పని చేసే ప్రభాకర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ అనే వ్యక్తులు మద్యం సేవిస్తూ ఒకరినొకరు దూషించుకున్నారు. గొడవ తీవ్రస్థాయికి చేరడంతో.. కోపంలో ప్రభాకర్‌ రెడ్డి గొడ్డలితో శ్రీనివాస్‌పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. దాడిలో … వివరాలు

సిఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన హరీష్‌ రావు

మెదక్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): మల్కాపూర్‌ గ్రామానికి చేరుకున్న మంత్రి హరీశ్‌రావు అక్కడ సిఎం పర్యటన ఏర్పట్లను పరిశీలించారు. ఆగస్టు 15న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి గ్రామానికి వచ్చారు. సభస్థలి, హెలిప్యాడ్‌ ఏర్పాటు పనులతో పాటు గ్రామంలో జరుగుతున్న హారితహారం మొక్కలు నాటే కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. ఉదయం మల్కాపూర్‌లో జిల్లాస్థాయి … వివరాలు

రైతు సంక్షేమ ప్రభుత్వమిది: రామలింగారెడ్డి

సిద్దిపేట,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): రైతులు బాగుంటేనే దేశం బాగుంటుందని, వారిని ఆదుకునేందుకు సిఎం కెసిఆర్‌ ప్రాజెక్టులను కొత్త సుంతలు తొక్కిస్తున్నారని టీఆర్‌ఎస్‌ దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. కాళేశ్వరం నీటి తరలింపు పథకం ఓ అద్భుతమైన విజన్‌ అన్నారు. ఎస్సారెస్పీని నింపసడం అన్నది ముందు చూపుతో తీసుకున్న నిర్ణయమన్నారు. ఎస్సారెస్పీ 365 రోజులు నీళ్లు ఉంటయి కాబట్టి … వివరాలు

రైతుబీమాతో మరింత భరోసా

సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం మెదక్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): రైతులను అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌ నాయకులు రాజకీయం చేస్తున్నారన్నారని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అండగా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బీమా … వివరాలు

పేదలపక్షపాతి సిఎం కెసిఆర్‌

గోదావరి జలాలతో తీరనున్న ఆలేరు ఆకాంక్షలు: ఎమ్మెల్యే యాదాద్రి,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ అన్నివర్గాల ప్రజల కోసం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో ప్రతిపక్షాల విమర్శలకు ప్రాధాన్యం లేకుండా పోతోందని ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత అన్నారు. నిరుపేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు వరమని అన్నారు. గతంలో పేద కుటుంబాలకు … వివరాలు

ఆ రెండు పథకాలతో రైతుకు భరోసా

కెసిఆర్‌ నిర్ణయంతో అన్నదాతల్లో ఆనందం ఇర్కోడ్‌లో రైతుబీమా పత్రాలు అందచేసిన మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు బీమా పథకంతో తెలంగాణ రైతుల్లో ఆత్మస్థైర్యం, ఆత్మ విశ్వాసం నింపామని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు స్పష్టం చేశారు. ఇర్కోడలోరైతుబీమా ధృవీకరణ పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా … వివరాలు

కంటివెలుగు కోసం భారీగా ఏర్పాట్లు

సిఎం రాకతో కట్టుదిట్టంగా అమలుకు చర్యలు మెదక్‌,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): పేదలకు ఉద్దేశించిన కంటివెలుగు కార్యక్రమం అమలుకు సకల చర్యలు తీసుకున్నామని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. ఈ నెల 15న కంటి వెలుగు కార్యక్రమాన్ని తూప్రాన్‌ మండలం మల్కాపూర్‌ గ్రామంలో సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నట్లు తెలిపారు. సీఎం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఇటీవలే అన్ని … వివరాలు