వరంగల్

పంచాయితీల్లో కొరవడుతున్న స్వచ్ఛత

వాడిపడేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలతో అనర్థాలు వరంగల్‌,నవంబరు18  (జనం సాక్షి) : పట్టణీకరణ కారణంగా స్వచ్ఛమైన గాలి కూడా పీల్చడానికి వీలు లేకుండా పోఓతంది. రోజువారీ వొత్తిళ్లనుంచి కాస్తంత దూరంగా జరిగి విశ్రాంతి తీసుకునే చోటు మిగలలేదు. సమాజ శ్వాసకోశాలుగా పేరుపడ్డ ఉద్యావనాలను పట్టించుకోవడం లేదు. వాటి దుస్థితి తొలగించి తమ ఆయు రారోగ్యాలు కాపాడుకోవడానికి ఎవరూ … వివరాలు

వరంగల్‌లో డిపోల ముందు కార్మికుల బైఠాయింపు

వరంగల్‌,నవంబర్‌14 (జనంసాక్షి) : వరంగల్‌ పట్టణంలో ఆర్టీసీ 41వరోజు ఉధృతంగా సాగుతోంది. హన్మకొండ డిపో ఎదుట కార్మికులు నిరసనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. వరంగల్‌ గ్రావిూణ జిల్లా పరకాలలో నాలుగు గంటలపాటు డిపో ఎదుట బైఠాయించారు. తాత్కాలిక సిబ్బంది విధులు నిర్వహించవద్దంటూ నినాదాలు చేశారు. సిద్దిపేట బస్‌డిపో ఆవరణలో డ్రైవర్లు కండక్టర్లు యూనిఫారం … వివరాలు

ధాన్యం కొనుగోళ్లపై నిఘా

రైతుకు నష్టం జరక్కుండా చర్యలు జనగామ,నవంబర్‌14 (జనంసాక్షి)  : ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరుగకుండా జిల్లా యంత్రాంగం నిఘా ముమ్మరం చేసింది. కలెక్టర్‌, జేసీ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు కొనుగోలు కేంద్రాలను పరిశీలించి కొనుగోళ్లపై ఆరా తీస్తున్నారు. రైతుల ధాన్యం తప్ప, వ్యాపారుల పేర బస్తా కొనుగోలు చేసినా చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. … వివరాలు

పత్తిరైతుకు బోనస్‌ ఇచ్చి ఆదుకోవాలి: సీతక్క

వరంగల్‌,నవంబర్‌14 (జనంసాక్షి)  : పత్తి రైతులకు ఎక్కడా న్యాయం జరగడం లేదని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. పత్తి మార్కెట్లను సందర్శించి వివరాలు తెలుసుకున్నామని అన్నారు. ఎక్కడా గిట్టుబాటు ధరలు అమలు కావడం లేదన్నారు. వ్యవసాయ మార్కెట్లలో రైతుల పంటలకు కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పత్తి రైతులకు బోనస్‌ … వివరాలు

ఆర్టీసీ కార్మికుల సమ్మెతోనే కేసీఆర్‌ పతనం ప్రారంభం: పొన్నాల

వరంగల్‌,నవంబర్‌9(జనం సాక్షి): ఆర్టీసీ కార్మికులది న్యాయమైన డిమాండ్‌ అని… ఆర్టీసీ  సమ్మెతోనే కేసీఆర్‌ పతనం మొదలైందని కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ఛలో ట్యాంక్‌ బండ్‌ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసమే అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేపట్టారని విమర్శించారు. నాయకులను, కార్మికులను, విద్యార్థి సంఘాలను అడ్డుకుంటే ఉద్యమం ఆగదన్నారు. కోర్టులు మొట్టికాయలు వేసినా సీఎం … వివరాలు

మాతాశిశు సంరక్షణకు చర్యలు

క్షేత్రస్థాయిలో శిక్షణా కార్యక్రమాలు వరంగల్‌,నవంబర్‌9 (జనం సాక్షి):  మాతా శిశు మరణాలను తగ్గించి మానవ అభివృద్ధి సూచికను పెంపొందించ డానికి సెర్ప్‌ నడుం బిగించింది. ఐసీడీఎస్‌, మెడికల్‌ డిపార్ట్‌మెంట్‌ సహకారంతో ఎస్‌హెచ్‌జీ సభ్యులకు పౌష్టికాహారం, పరిశుభ్రత, మంచినీరు, విద్య వంటి అంశాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో పైలట్‌గా తీసుకున్న ఏడు మండలాల సంఘాల … వివరాలు

ఆర్థిక ఇబ్బందులతో  వృద్ధ దంపతుల ఆత్మహత్య

జయశంకర్‌ భూపాలపల్లి,నవంబర్‌ 8 (జనం సాక్షి) : మహాదేవ్‌పూర్‌ మండలం ఎలికేశ్వరంలో శుక్రవారం ఉదయం విషాద ఘటన జరిగింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో వృద్ధ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను రాళ్లబండి తాలయ్య(65), రాధమ్మ(60)గా గుర్తించారు. వీరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. శవ పరీక్ష కోసం తాలయ్య, … వివరాలు

ఎంజిఎం కార్డియాలజీలో అసౌకర్యాలు

గుండెపోటుతో వస్తే అంతే సంగతులు వరంగల్‌,నవంబర్‌8 (జనం సాక్షి) : మానవుడి జీవనశైలి గుండెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఆహారపు అలవాట్లు, వ్యాయామం చేయక పోవడం, మానసికి ఒత్తిడితో గుండె ప్రమాద స్థితికి చేరుకుంటోంది. మానవుడి శరీరంలో గుండె అత్యంత ముఖ్యమైన అవయవం. ఇక్కడి నుంచే అన్ని భాగాలకు రక్తం సరఫరా అవుతుంది. అంతేగాకుండా గుండె అన్ని … వివరాలు

వరంగల్‌ సమగ్రాభివృద్దికి యత్నాలు

మాస్టర్‌ ప్లాన్‌ ద్వారా ప్రణాళికలు ఇప్పటికే పలుదఫాలుగా చర్చలు వరంగల్‌,అక్టోబర్‌29(జనం సాక్షి ): తెలంగాణలో హైదరాబాద్‌ తర్వాత పెద్దదైన వరంగల్‌ నగర సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఇటీవల వరంగల్‌ మాస్టర్‌ ప్లాన్‌పై పలుదఫాలుగా చర్చలు సాగాయి. కెటిఆర్‌ కూడా వరంగల్‌ విస్తరణకు … వివరాలు

సొంతూళ్లో పర్యటించిన మంత్రి ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌,అక్టోబర్‌7 ( జనం సాక్షి ) :  పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తన స్వగ్రామమైన పర్వతగిరిలో పర్యటించారు. మంత్రి ఎర్రబెల్లి గల్లిగల్లీలో గడప గడపకూ తిరిగి వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వాకబు చేశారు. కాలి నడకన కలియతిరుగుతూ ప్రతీ ఒక్కరినీ పేరు పేరున పలుకరించి వారి మంచి చెడును … వివరాలు