Cover Story

24 గంటల్లో కేరళను తాకనున్న రుతుపవనాలు

దిల్లీ: రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అధికారులు శుక్రవారం వెల్లడించారు. రుతుపవనాల రాకకు అనువైన వాతావరణం ఏర్పడిందని, దీంతో వచ్చే 24 గంటల్లో కేరళను తాకే అవకాశాలున్నాయని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. జూన్‌ 9న కొల్లాం, అలప్పుళా జిల్లాలు, జూన్‌ 10న తిరువనంతపురం, ఎర్నాకుళం జిల్లాల్లో … వివరాలు

తీరం దాటిన ‘ఫొని’

– ఉత్తరాంధ్రకు తప్పిన ముప్పు – ఒడిశాలోని పూరీపై తుఫాన్‌ బీభత్సం – 200 నుంచి 240 కిలోవిూటర్ల వేగంతో ఈదురు గాలులు – పలు ప్రాంతాల్లో నేలమట్టమైన ఇండ్లు – తుపాను ప్రభావిత ప్రాంతాల్లో 900 శిబిరాలు ఏర్పాటు – సహాయక చర్యల్లో నిమగ్నమైన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు భువనేశ్వర్‌, మే3(జ‌నంసాక్షి) :  బంగాళాఖాతంలో ఏర్పడిన … వివరాలు

శ్రీలంక దాడుల్లో 290కి చేరిన మృతుల సంఖ్య

వివిధ ఆస్పత్రుల్లో మరో 500 మంది క్షతగాత్రులు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటి వరకు 24మంది అనుమానితుల అరెస్ట్‌ కొలంబో,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): శ్రీలంకలో ఆదివారం జరిగిన వరుస పేలుళ్లపై ఆ దేశ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మూడు ¬టళ్లు, మూడు చర్చిలతో సహ మొత్తం 8 ప్రాంతాల్లో జరిగిన పేలుళ్లలో సుమారు 300 మంది … వివరాలు

మోగిన ‘పరిషత్‌’ నగారా!

– ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఈసీ – మే6,10, 14 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు – 27న ఓట్ల లెక్కింపు.. అదేరోజు ఫలితాలు – మొత్తం 538 జడ్పీటీసీలు, 5,817 ఎంపీటీసీలకు ఎన్నికలు – జడ్పీటీసీలకు రూ. 4లక్షలు, ఎంపీటీసీలకు రూ.1.50 లక్షలు వ్యయపరిమితి – తొలిసారిగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తుల స్వీకరణ … వివరాలు

రోహిణికి ముందే ఎండల తీవ్రత

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): అడపాదడపా వడగళ్లు పడుతున్న ఉదయం లేస్తూనే భానుడు సుర్రుమనిపిస్తున్నాడు. ఎండలు ఏ మాత్రం తగ్గడం లేదు. రోళ్లు పగిలేలా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణికి ముందే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గతంతో పోలిస్తే 3 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో నగరం అగ్నిగోళంలా మారింది. నిప్పుల కుంపటిని ఇంట్లో పెట్టుకున్న మాదిరి భగభగలు … వివరాలు

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ పరీక్ష ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్ రెడ్డి విడుదల చేశారు. ప్రథమ సంవత్సరంలో 59.8 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా.. ద్వితీయ సంవత్సరంలో 65శాతం ఉత్తీర్ణత నమెదైనట్టు చెప్పారు. ఈ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. 76శాతంతో మేడ్చల్‌ జిల్లా అగ్రస్థానంలో నిలవగా.. రంగారెడ్డి జిల్లా … వివరాలు

టీఎస్‌లో‘స్థానిక’పోరు:ఈసీకి తేదీల ప్రతిపాదన

హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలోనే జిల్లా, మండల ప్రజా పరిషత్‌  ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది. ఎన్నికల నిర్వహణకు గత కొన్నాళ్లుగా ఈసీ కసరత్తు చేస్తోంది.  ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది. … వివరాలు

తొలిదశ ఎన్నికలకు ప్రచారం పరిసమాప్తం

– 11న ఎపి, తెలంగాణల్లో ఒకే దశలో పోలింగ్‌ – ఎపిలో అసెంబ్లీ పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు – తెలంగాణలో 17 ఎంపి స్థానాలకు పోలింగ్‌ – నిజామాబాద్‌లో అత్యధికంగా 185మంది బరిలో – అత్యల్పంగా మెదక్‌లో 10మంది హైదరాబాద్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి):నెలరోజులుగా ఊరూవాడా ¬రెత్తిన ఎన్నికల ప్రచారం ముగిసింది. తెలంగాఉ రాష్ట్రాల్లో సాయంత్రం ఐదింటికి ప్రచారం … వివరాలు

ఏపీ ప్రత్యేకహోదాకు మద్దతిస్తాం: కేసీఆర్‌

 హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న విమర్శలపై కేసీఆర్ ఘాటుగా స్పదించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో కేసీఆర్ మద్దతునిస్తా అని … వివరాలు

కారులో చెలరేగిన మంటలు

హైదరాబాద్: హయత్‌నగర్ వద్ద కారులో మంటలు చెలరేగాయి. జాతీయ రహదారిపై వెళుతున్న ఫోర్డు కారులో అకస్మాత్తుగా మంటలు లేచాయి. రోడ్డు పక్కకు కారును ఆపిన యజమాని సురక్షితంగా బయటపడ్డాడు. కాలిపోతున్న కారు నుంచి దట్టమైన పొగలు రావడంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.