Main

పోడు సమస్యల పరిష్కారానికి చర్యలు

జడ్పీ సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్‌ హావిూ ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌23 (జనంసాక్షి)  : గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూముల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. గురువారం ఆదిలాబాద్‌ జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. అటవీ భూముల సమస్య పరిష్కారం కోసం మంత్రుల సబ్‌ … వివరాలు

నిర్మల్‌లో అతిపెద్ద అంబేడ్కర్‌ భవన్‌: మంత్రి

నిర్మల్‌,అగస్టు26(జనంసాక్షి): తెలంగాణలోనే అతి పెద్ద అంబేద్కర్‌ భవన్‌ మన నిర్మల్‌ లోనే రాబోతుందని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి తెలిపారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ భవన్‌ అభివృద్ధి పనులను గురువారం న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంబేద్కర్‌ భవన్‌ నిర్మాణ పనులకు గతంలో రూ.2 కోట్లు నిధులు … వివరాలు

జిల్లాలో అధికారుల ఉరుకులు పరుగులు

పాఠశాలలను సన్నద్దం చేసే పనిలో విద్యాశాఖ నిర్మల్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): సెప్టెంబరు 1 నుండి అన్ని పాఠశాలలు ప్రారం భించనున్నందున స్పెషల్‌డ్రైవ్‌ నిర్వహించి అన్ని పాఠశాలల్లో పారిశుద్ధ్య పనులు పూర్తి చేసి సిద్ధంగా ఉంచాలని విద్యాశాఖ నిర్ణయించింది. కొవిడ్‌ కారణంగా పాఠశాలలు తిరిగి 16 నెలల తర్వాత సెప్టెంబరు 1 నుండి ప్రారంభించనున్నారు. విద్యార్థు లకు ఎలాంటి ఇబ్బందులు … వివరాలు

గురుకులాల్లో 2న స్పాట్‌ అడ్మిషన్లు

నిర్మల్‌,ఆగస్ట్‌26(జనంసాక్షి): తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకులం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిగ్రీ కళాశాలల్లో 2021`22 విద్యాసంవత్సరంలో మొదటి సంవత్సరం డిగ్రీ తరగతుల్లో చేరడానికి సెప్టెంబరు 2న స్పాట్‌ అడ్మిషన్‌లు నిర్వహిస్తున్నామని తెలంగాణ గురుకులాల ఉమ్మడి జిల్లా కోఆర్డీనేటర్‌ వి. గంగాధర్‌ తెలిపారు. ఉమ్మడి జిల్లాలో బాలురకు ఆదిలాబాద్‌లో, బాలికలకు ఉట్నూర్‌, ఆసిఫాబాద్‌లలో డిగ్రీ కళాశాలలు ఉన్నాయని, ఆదిలాబాద్‌ … వివరాలు

సీజనల్‌ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలి

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌24(జనంసాక్షి): సీజనల్‌ వ్యాధుల పట్ల వైద్యఆరోగ్య సిబ్బంది, అంగ న్‌వాడీ టీచర్లు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. ఆరోగ్యకేంద్రం సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఏఎన్‌ఎంలతో సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గర్భిణులకు సీజనల్‌ వ్యాధులపట్ల అవగాహన కల్పించాలని, అలాగే సమతుల్య ఆహారం అందించాలన్నారు. జిల్లాలో డెంగ్యూ, మలేరియా తదితర సీజనల్‌ … వివరాలు

గిరిజనబంధు అమలు చేయండి

గిరజనుల ఆందోళన ఆదిలాబాద్‌,అగస్టు23(జనంసాక్షి): గిరిజన బంధు ఇవ్వడంతో పాటు ఆదివాసీ సమస్యలను పరిష్కరించాలని జిల్లా కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. భారీగా ఆదివాసులు ధర్నాకు తరలివచ్చారు. రూ.10 లక్షల గిరిజన బంధు, జీవో 3 అమలు, మూడెకరాల భూమి, పోడు భూములకు పట్టాలివ్వాలని, లంబాడా లను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని వారు డిమాండ్‌ … వివరాలు

మలేషియాలో నిర్మల్‌ వాసి మృత్యువాత

నిర్మల్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): జిల్లాలోని ముధోల్‌ మండలం ఆష్టానికి చెందిన రాజన్న(42) అనే వ్యక్తి మలేషియాలో జరిగిన ఓ ప్రమాదంలో మృతి చెందాడు. రాజన్న జీవనోపాధి కోసం మలేషియా వెళ్లాడు. కాగా రాజన్న మృతితో కుటుంబసభ్యులు విషాదంలో మునిగిపోయారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.

కొకస్ మన్నూర్ లో ప్రాథమిక సెకండరీ పాఠశాలలను సందర్శించిన సెక్టోరల్ అధికారి

ఇచ్చోడ ఆగస్ట్21(జనంసాక్షి) ఇచ్చోడ మండలంలోని కొకస్ మన్నూర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాల మరియు సెకండరీ పాఠశాలను సందర్శించిన సెక్టోరల్ అధికారి కంటే నర్సయ్య పాఠశాలల యందు ప్రధాన తరగతులకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు అనంతరం విద్యార్థుల ఇంటికి వెళ్లి ప్రధాన తరగతులు 5వ  నుండి 10వ తరగతి విద్యార్థులను ఆన్లైన్ క్లాసుల గురించి అడిగి తెలుసుకున్నారు … వివరాలు

ఆదిలాబాద్‌ను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుతాం

ఆదిలాబాద్‌ జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్‌ ఆదిలాబాద్‌ ,ఆగస్ట్‌18(జనంసాక్షి): ఆదిలాబాద్‌ను స్వచ్ఛ పట్టణంగా తీర్చిదిద్దుతున్నామని, పారిశుద్ధ్య చర్యలను మరింత మెరుగుపరుస్తున్నామని జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్‌ పేర్కొన్నారు. మంగళవారం 4వ వార్డు పరిధిలోని బంగారుగూడలో రూ.3.50 కోట్లతో నిర్మించిన పారిశుద్ధ్య వనరుల ఉద్యానవనాన్ని ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి ఆమె ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆమె … వివరాలు

విస్తారంగా వర్షాలతో ప్రాజక్టులకు జలకళ

స్వర్ణ ప్రాజెక్టును సందర్శించిన మంత్రి నిర్మల్‌,ఆగస్ట్‌18(జనంసాక్షి): విస్తృతంగా వర్షాలు కురుస్తుండటంతో తెలంగాణలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలా మారయని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. బుధవారం సారంగాపూర్‌ మండలంలోని స్వర్ణ జలాశయాన్ని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలించారు. నదీమాతల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఇన్‌ ఫ్లో, అవుట్‌ ఫ్లో వివరాలను అధికారులను … వివరాలు