జాతీయం

నేపాల్ కు ఒడిశా సర్కార్ ఐదు కోట్ల సాయం..

ఒడిశా : భూకంపంతో అతాలకుతలమైన నేపాల్ కు వివిధ దేశాలు, రాష్ట్రాలు సహాయాన్ని ప్రకటిస్తున్నాయి. ఒడిశా ప్రభుత్వం రూ.5 కోట్ల సహాయాన్ని ప్రకటించింది.

ముగిసిన నీతి ఆయోగ్ సమావేశం..

ఢిల్లీ : నీతి ఆయోగ్ సమావేశం ముగిసింది. పారిశుధ్యంపై అంతర్జాతీయంగా ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.

వెస్ట్ బెంగాల్ లో బంద్..

పశ్చిమ బెంగాల్ : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జరిగిన హింసను నిరసిస్తూ లెఫ్ట్ పార్టీలు 12 గంటలు, బీజేపీ 10 గంటల పాటు బంద్ కు …

నేపాల్ కు సహకారం అందిస్తాం – వరల్డ్ బ్యాంకు అధ్యక్షుడు..

ఢిల్లీ: భూకంపంతో విలవిలలాడిన నేపాల్ పునర్‌నిర్మాణానికి పూర్తి సహాకారం అందిస్తామని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్‌యాండ్‌కిమ్ ప్రకటించా

లారీని ఢీకొన్న పెళ్లి బృందం వ్యాన్… 11 మంది మృతి

ఛత్తీస్ ఘడ్: బాలోద్ జిల్లాలో లారీని పెళ్లి బృందం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. 20 మందికి గాయాలయ్యాయి.

విదర్భలో పర్యటించనున్న రాహుల్..

ఢిల్లీ : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విదర్భలో పర్యటించనున్నారు. అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను కలువనున్నారు.

అస్సాంలో కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి..

అస్సాం : కల్తీ మద్యం తాగి ముగ్గురు మృతి చెందిన సంఘటన అస్సాంలోని జోర్హాత్ జిల్లాలో చోటు చేసుకుంది.

పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం..

న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి.

జోధ్ పూర్ కోర్టులో సల్మాన్…

రాజస్థాన్ : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ జోధ్ పూర్ కోర్టుకు హాజరయ్యాడు. అక్రమ ఆయుధాల కేసులో సల్మాన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

కేంద్ర కేబినెట్ ప్రారంభం..

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ అధ్యక్షతనలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీలపై తుది నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది.