Saturday, 14 November 2026

హైదరాబాద్

రోజుకు 200 ఎన్‌ఎంఎస్‌లే : ఢిల్లీ హైకోర్టు

ఢిల్లీ: రోజుకు వ్యక్తిగతంగా కేవలం 200 సంక్షిప్త సందేశాలకు పరిమితం చేస్తూ ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువరించింది. వ్యాపార బ్యాంకింగ్‌ రంగాల గంపగుత్త సందేశాల పై తీర్పును వాయిదా వేసింది.

శనివారం నుంచి భువనేశ్వర్‌-తిరుపతి వారాంతపు రైలు

హైదరాబాద్‌: శనవారం నుంచి తిరుపతి-భువనేశ్వర్‌ వీక్లి ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభం కానుంది. రేపు మధ్యాహ్నం 12గంటలకు భువనేశ్వర్‌ నుంచి బయల్దేరి విశాఖ, విజయయవాడ, నెల్లూరు మీదుగా తిరుపతి చేరుతుంది. తిరిగి ఆదివారం మధ్యాహ్నం 1గంటకు తిరుపతి నుంచి భువనేశ్వర్‌కు తిరుగు…

హుక్కా సెంటర్లపై పోలీసుల దాడి

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని హుక్కా సెంటర్లపై పోలీసులు దాడి చేశారు ఖార్జానాలోని మయూరి పాన్‌మసాలా హుక్కా సెంటర్‌లో తనిఖీలు నిర్వహించారు. హుక్కా సెంటర్‌ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న లారీ పట్టివేత

కుబీరు: అదిలాబాద్‌ జిల్లా భైంసా పట్టణం నుంచి కుబీరు మీదుగా మహారాష్ట్రలోని హిమాయత్‌నగర్‌ జిల్లా సోన్‌ పట్టణానికి అక్రమంగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. స్వాధీన పరచుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ సుమారు రూ.3లక్షలు ఉంటుందని…

రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి

భువనగిరి(నల్గొండ): భువనగిరి పట్టణంలోని మొయిన్‌రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తులసి(35) అనే వివాహిత మృతి చెందింది. ఇలిగొండ మండలం దాసిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన బందారపు నరసింహ, అతని భార్య తులసి ఆలేరు నుంచి స్వగ్రామం వెళ్తుండగా ఎదురుగా…

అంతుబట్టని వ్యాధితో ముగ్గురు చిన్నారుల మృతి

ఉట్నూరు: అదిలాబాద్‌ జిలల్లా ఎజెన్సీలో అంతుబట్టని వ్యాధితో ముగ్గురు చిన్నారులు ఒకే రోజు మృతి చెందారు. నీలాగొంది గ్రామానికి చెందిన లక్ష్మణ్‌(6), సోనాదేవి(10), జయనూరు మండలం జాడుగూడకు చెందిన శాంతాబాయి(6) అకస్మాత్తుగా ఈరోజు చనిపోయారు. ఇందులో లక్ష్మణ్‌, సోనాదేవిలు…

యాత్రకు బయల్దేరేముందు వైద్య పరీక్షలు

శ్రీనగర్‌:అమరనాథ్‌ యాత్రకు బయల్దేరే ముందు యాత్రికులు వైద్య పరీక్షలు చేయించుకోవాలని జమ్మూకాశ్మీర్‌ ప్రభుత్వ శుక్రవారం విజ్ఞప్తి చేసింది.బాల్తాల్‌ పహల్‌గావ్‌ బేస్‌క్యాంపుల వద్ద వైద్య పరీక్షలు చేయించుకుని బయల్దేరవసిందిగా ప్రభుత్వం యాత్రికులను కోరింది.శుక్రవారం నాటికి ఈ యాత్రలో మరణించిన వారి…

‘టీ’ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది: జానా

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా జరుగుతోందని మంత్రి జానారెడ్డి అన్నారు. తెలంగాణపై కాంగ్రుస్‌ హైకమాండ్‌ స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నదని ఆయన తెలియజేశారు.

సీఏం కిరణ్‌కు టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ లేఖ

హైదరాబాద్‌: సింగరేణిలో మెడికల్‌ కళాశాల ఏర్పాటు విషయానికి సంబంధించి  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ బహిరంగ లేఖ రాశారు. మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు అవసరమైన అర్హతలు, 300పడకల సామర్థ్యం, 3ఎకరాల భూమిని సింగరేణి మేనేజమెంట్‌కు కల్పించాలని డిమాండ్‌…