ఖమ్మం

ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలపై సర్వత్రా చర్చ

టిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం ఖమ్మం, మే 20 (జ‌నంసాక్షి) : పార్లమెంట్‌ ఎన్నికల ఫలితాలపై అభ్యర్థుల అనుచరగణంలో టెన్షన్‌ మొదలైంది. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉండగా ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్‌ వ్రేణుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఈ ఫలితాలునిజమవుతాయా అన్న రీతిలో ప్రశ్నలు సంధిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి రేణుకాచౌదరి పోటీ పడగా, టిఆర్‌ఎస్‌ నుంచినామా … వివరాలు

భూసమస్యల పరిష్కారానికి గ్రామసభలు: జెసి

భద్రాద్రి కొత్తగూడెం,మే20(జ‌నంసాక్షి):  జిల్లాలో చాలా ప్రాంతాల్లో రైతుల సంఖ్య భూముల విస్తీర్ణంలో వ్యత్యాసాలు ఉన్నాయని, వాటన్నింటినీ సర్వేయర్ల ద్వారా సర్వే చేసి సరి చేస్తానమని జాయింట్‌ కలెక్టర్‌ కే.వెంకటేశ్వర్లు చెప్పారు. నేరుగా గ్రామాల్లో రెవెన్యూ గ్రామసభలు నిర్వహించి అక్కడిక్కడే రైతుల సమస్యలు పరిష్కరించేందుకు గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన రైతులందరికీ రెవెన్యూ గ్రామసభల ద్వారా జూన్‌ … వివరాలు

ప్రజాసేవలోనే ఉంటా: వసంత

భద్రాద్రి కొత్తగూడెం,మే20(జ‌నంసాక్షి):  తాను గెలిచినా ఓడినా ప్రజా సేవలోనే ఉంటానని ,జెడ్పీటీసీ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రభుత్వం నుంచి వచ్చే గౌరవ వేతనాన్ని ప్రజల అవసరాలకు వినియోగిస్తానని లక్ష్మీదేవిపల్లి మండల జెడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి మేరెడ్డి వసంత అన్నారు. చిన్నతనం నుంచే ప్రజల సమస్యలపై పోరాటాలు చేసి అనేక ఉద్యమాల్లో పాల్గొని ప్రజల అవసరాల కోసం … వివరాలు

సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

కొత్తగూడెం,మే4(జ‌నంసాక్షి): ఉపాధిహావిూ పథకం ద్వారా గ్రామాల్లో  పండ్ల తోటలను పెంచుకోవచ్చని మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.  మిషన్‌కాకతీయతో చెరువుల పునరుద్దరణ జరిగిందన్నారు. నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇస్తామన్న సీఎం కేసీఆర్‌ హావిూని నెరవేర్చడంలో భాగంగా ఇండ్ల నిర్మాణం స్పీడందుకున్నాయన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. … వివరాలు

ఎమ్మెల్యే హరిప్రియ..  ఎన్నికల ప్రచారంపై రాళ్లదాడి

– పార్టీ మారడంపై ఆగ్రహం వ్యక్తంచేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలు – కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య వాగ్వాదం – ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు – గాయపడ్డ పలువురి కార్యకర్తలను ఆస్పత్రికి తరలింపు ఖమ్మం, మే4(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌ గూటికి చేరిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియపై కాంగ్రెస్‌ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. ఇల్లెందు … వివరాలు

అకాల వర్షంతో అన్నదాతల ఆందోళన 

తడిసిన ధాన్యంతో నష్టాలు తప్పవన్న వేదన భద్రాద్రి కొత్తగూడెం,మే3(జ‌నంసాక్షి): అకాల వర్షాలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా మిర్చి రైతులు తమ పంటను తీసుకుని మార్కెట్ల చుట్టూ తిరుగుతున్న వారు మరింత ఆందోళనలో ఉన్నారు. వరిధాన్యం చేతికొచ్చే వేళ కావడంతో వారు మరింత భయంలో ఉన్నారు. ఇటీవల  కురిసిన అకాల వర్షానికి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉభయ … వివరాలు

రణరంగంగా మారిన రావికంపాడు

– భూవివాదం విషయంలో కర్రలతో కొట్టుకున్న ఇరువర్గాలు – పలువురికి గాయాలు – ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు భద్రాద్రికొత్తగూడెం, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని రవికంపాడులో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. భూవివాదం కారణంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, రాళ్లతో ఇరువర్గాలు పరస్పర దాడులు చేసుకున్నారు. దీంతో పలువురు గాయపడ్డారు. 1969లో … వివరాలు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సత్తా చాటుతాం

ప్రాదేశిక ఎన్నికల్లో పోటీ చేస్తాం: టిడిపి ఎమ్మెల్యే ఖమ్మం,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలంగా ఉన్నచోట్ల ప్రాదేశిక ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను రంగంలోకి దింపుతామని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్రావు తెలిపారు. టిడిపిని వీడి కొందరు వెల్లినా పోటీ ఆగదన్నారు. అలాగే పార్టీ బలహీనపడదన్నారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి జడ్‌పీటీసీ స్థానాల్లో టీడీపీ … వివరాలు

నేటినుంచి ఓపెన్‌ స్కూల్‌ పరీక్షలు 

ఖమ్మం,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఓపెన్‌ స్కూల్‌ పరిధిలో ఈ నెల 24వ తేదీ నుంచి నిర్వహించే టెన్త్‌, ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని డీఆర్‌ఓ శిరీష తెలిపారు. పరీక్షల నిర్వహణకు జిల్లా కేంద్రంలో పదవ తరగతికి ఆరు కేంద్రాలు, ఇంటర్‌కు 5 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ నెల 24వ … వివరాలు

మొక్కజొన్నలకు మద్దతు ధర

ఖమ్మం,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన మొక్కజొన్న పంటను మార్క్‌ఫెడ్‌ ద్వారా సహకార సంఘాలతో కొనుగోళ్లు కార్యక్రమాన్ని చేపట్టిందని రైతుసమన్వయ సమితి జిల్లా కన్వీనర్‌ నల్లమల వెంకటేశ్వరరావు అన్నారు. మొక్కజొన్న పంటకు కనీస మద్దతుధర ప్రభుత్వం చెల్లించడం కోసం చర్యలు తీసుకుందన్నారు. రైతుల శ్రేయస్సు కోసం మొక్కజొన్న కొనుగోలు కేంద్రంతో పాటు, ధాన్యం కొనుగోలు … వివరాలు