Main

జిల్లాలో పెరుగుతున్న ఎండలతో ఆందోళన

నల్లగొండ,మార్చి27(జ‌నంసాక్షి): జిల్లాలో గడిచిన వారం రోజులుగా ఎండల తీవ్రత పెరుగుతోంది. వాతావరణం మార్పుల నేపథ్యంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఉదయం నుంచే ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు చేరువగా ఉంటున్నాయి. తీవ్రత  పెరుగడంతో ప్రజలు బయటకు రావాలంటేనే జంకుతున్నారు. మార్చి రెండోవారం వరకు పెద్దగా ఎండ తీవ్రత కనిపించలేదు. ఆపై వాతావరణంలో … వివరాలు

పక్కాగా ఎన్నికల కోడ్‌ అమలు

కోడ్‌ అమలు కోసం 33 బృందాల ఏర్పాటు 15వరకు ఓటర్ల నమోదుకు అవకాశం నల్లగొండ,మార్చి13(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ ఎన్నికకు సైతం షెడ్యూల్‌ వెలువడి నేపథ్యంలో.. నల్లగొండ ఎంపీ స్థానం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల కోడ్‌ అమలులో ఉంటుందని రిటర్నింగ్‌ అధికారి గౌరవ్‌ ఉప్పల్‌ తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసే విధంగా ఉన్న ప్రతి … వివరాలు

రహదారి విస్తరణకు భూసేకరణ

అధికారుల పరిశీలనలో సవిూప గ్రామాలు నల్లగొండ,మార్చి8(ఆర్‌ఎన్‌ఎ): నార్కట్‌పల్లి-అద్దంకి రాష్ట్ర రహదారి త్వరలో జాతీయ రహదారిగా మారనుండడంతో అధికారులు భూసేకరణపై దృష్టి సారించారు. ఎక్కెడక్కడ ఎంతెంత భూమి అవసరమో లెక్కలు తీస్తున్నారు.  దీనిని జాతీయ రహదారిగా గుర్తించాలని కోరుతూ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతున్నట్లు రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మలనాగేశ్వరరావు వెల్లడించడంతో సిక్స్‌ లేన్‌ రోడ్డుగా … వివరాలు

రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి 

నల్గొండ, మార్చి5(జ‌నంసాక్షి) : పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షల కోసం విధుల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఓ ఎస్సై వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో  గాయపడిన ఎస్సై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషాధ సంఘటన నల్గొండ జిల్లా నార్కట్‌పల్లిలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి … వివరాలు

ఎస్‌ఐ మధుసూధన్‌కి పోలీసుల నివాళి

నల్లగొండ,మార్చి5(జ‌నంసాక్షి):  రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పోచంపల్లి ఎస్సై మధుసూదర్‌ మృతదేహానికి ఉన్నతాధికారులు నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో నివాళులర్పించారు. రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌, జిల్లా ఎస్పీ రంగనాథ్‌, సీఐలు, డీఎస్పీలు, ఇతరు అధికారులు పాల్గొన్నారు. ఎస్సై కుటుంబ సభ్యులను అధికారులు పరామర్శించారు. ఆయన సేవలను కొనియాడారు. ఆయన మృతి శాఖకు తీరని నష్టమని అన్నారు.

పూల రవీందర్‌కు అంత ఈజీ కాదనంటున్న నేతలు

సొంత యూనియన్‌లోనే ఎదురుగాలి నల్లగొండ,మార్చి4(జ‌నంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికపై ఆయా ఉపాధ్యాయ సంఘాలు దృష్టి పెట్టాయి. 2013నాటి ఎన్నికల్లో ఈ స్థానాన్ని గెలుచుకున్న పీఆర్టీయూ ఈసారి మాత్రం  ఇంటి పోరుతో సతమతమవుతోంది. మరో ప్రధాన ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్‌ గెలుపు ధీమాతో ఉంది. పీఆర్టీయూకు రెబెల్స్‌ బెడద ఉండడం తమకు కలిసొస్తుందన్న అంచనాలో ఆ సంఘ నాయకత్వం … వివరాలు

అభివృద్ది పనులపై ఎన్నికల కోడ్‌

నల్లగొండ,మార్చి1(జ‌నంసాక్షి): వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిందని కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించేలా ఇంజినీరింగ్‌ శాఖలు ఎటువంటి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయొద్దని సూచించారు. ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పలు సూచనలు చేశారు. ఈ ఎన్నికలకు … వివరాలు

సాగు లెక్కలు సేకరణలో వ్యవసాయశాఖ

పంటకాలనీల కోసం వివరాల నమోదు నల్లగొండ,మార్చి1(జ‌నంసాక్షి): నల్గొండ జిల్లాలో వ్యవసాయ భూములు, సాగు లెక్కలను వ్యవసాయ విస్తరణాధికారులు చేపట్టారు. క్షేత్రస్థాయిలో రైతుల వారీగా భూములు, పంటల సాగు, నీటి వసతి, బీడు భూముల తదితర వివరాలతో కూడిన నమునాలో వివరాలను సేకరించారు. పంటకాలనీలు ఏర్పాటు చేసే కార్యక్రమంలో భాగంగా వీటిని సేకరించారు. దీంతో ఏ భూమిలో … వివరాలు

ప్రియుడి మోసం: యువతి ఆందోళన

నల్గొండ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): ప్రేమించిన వ్యక్తిని మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని రామన్నపేట మండలం కొమ్మాయిగూడెంలో ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. ప్రియుడు గణెళిశ్‌, తానూ 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడని యువతి ఆరోపిస్తున్నారు. పెళ్లి చేసుకోమని గట్టిగా నిలదీయడంతో ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడని చెబుతున్నారు. అంతేకాదు పెళ్లికి … వివరాలు

మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాసరెడ్డి మృతి

సంతాపం తెలిపిన సిఎం కెసిఆర్‌, మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి నల్లగొండ,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి(101) మృతిచెందారు. అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారు. నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి భౌతికకాయాన్ని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. శ్రీనివాసరెడ్డి 1962లో సీపీఎం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 900 ఎకరాల భూస్వామి ఇంట్లో పుట్టిన … వివరాలు