బీఆర్ఎస్ కార్యాలయాన్ని కూల్చేయండి : హైకోర్టు

హైదరాబాద్ : నల్గొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూలగొట్టాలని హైకోర్టు ఆదేశించింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్టీ కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా సూటిగా ప్రశ్నించింది. కట్టకముందు అనుమతి తీసుకోవాలి కానీ కట్టిన తర్వాత ఎలా అనుమతి తీసుకుంటారని పిటిషనర్ను అడిగింది. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టాలని హైకోర్టు ఆదేశించింది. లక్ష రూపాయల నష్ట పరిహారం బీఆర్ఎస్ పార్టీకి చెల్లించాలని హైకోర్టు ఆదేశించింది.

తాజావార్తలు