వరంగల్

మిరప రైతులను ఆదుకోవాలి

వరంగల్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):మిరప రైతుకు క్వింటాకు రూ.15వేలు మద్దతు ధర కల్పించాలని అఖిలపక్షనేతలు డిమాండ్‌ చేశారు. మిర్చి ధరలు పడిపోతున్నా పట్టించుకోక పోవడం సరికాదని కాంగ్రెస్‌, టిడిపి, కమ్యూనిస్ట్‌ నేతలు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందన్నారు. అలాగే పంటదిగుబడి పేరుతో రైతులను దగా చేయవద్దన్నారు. మిరప రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్‌ … వివరాలు

పత్తిరైతు ఆత్మహత్య

జయశంకర్‌ భూపాలపల్లి,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): మహాముత్తారం మండలం గాజరాంపల్లికి చెందిన గుంటి సతీష్‌(26)అనే పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సతీష్‌ తనకున్న మూడెకరాల భూమిలో పత్తి పంట సాగు చేశాడు. అయితే  పత్తి పంట దిగుబడి తక్కువగా వచ్చింది. దీంతో పత్తి సాగు కోసం చేసిన  రూ.2లక్షల అప్పును తీర్చే మార్గం కనిపించలేదు. ఈ క్రమంలో సతీష్‌ పురుగుల … వివరాలు

ప్రియాంక రాకతో బిజెపిలో వణుకు: జంగా

జనగామ,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ప్రియాంకా గాంధీ రాకతో అధికార బిజెపికి వణుకు పుట్టిందని జనగామ డిసిసి అధ్యక్షుడిగా నియమితులైన జంగా రాఘవరెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. డిసిసి అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. రాహుల్‌ సోదరి ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సందర్భంగా … వివరాలు

ప్రజావాణి సమస్యలపై నిర్లక్ష్యం

సకాలంలో పరిష్కారం కావడం లేదన్న ఆందోళన జయశంకర్‌ భూపాలపల్లి, ఫిబ్రవరి6 (జ‌నంసాక్షి): భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి గాడితప్పుతోంది. అధికారులు ప్రజలకు భరోసా కల్పించలేక పోతున్నారు. దరఖాస్తులను సత్వరం పరిష్కరించడంలో విఫలమవుతున్నారు. నిబంధనల ప్రకారం దరఖాస్తు అందిన నెలరోజుల్లో సమస్యను పరిష్కరించాలి.. ఆ విషయాన్ని దరఖాస్తుదారుడికి తెలియజేయాలి. కానీ నెలలు … వివరాలు

ఎనుమాముల మార్కెట్‌ ఎదుట మిర్చి రైతుల ఆందోళన

వరంగల్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): వరంగల్‌ ఎనుమాముల మార్కెట్‌ ఎదుట గురువారం మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. మిర్చి రేటు పడిపోవడంతో ప్రధాన కార్యాలయం ముందు రైతులు ధర్నా చేపట్టారు. క్వింటాలుకు రూ.12వేల మద్దుత ధర ఇవ్వాలని వారు డిమాండ్‌ చేసారు. ప్రస్తుతం క్వింటాల్‌కు రూ.8400 ధరను మార్కెట్‌ అధికారులు నిర్ణయించారు. ధరలను తగ్గించి కొనుగోలు చేయడంపై తీవ్ర ఆగ్రహం … వివరాలు

షాట్‌వాల్‌ విధానంతో అధిక బొగ్గు ఉత్పత్తి

వ్యవయం కూడా తగ్గుతుందన్న అధికారులు జయశంకర్‌ భూపాల్‌పల్లి, ఫిబ్రవరి7 (జ‌నంసాక్షి): భూగర్భ గనిలో అధిక లోతులో ఉన్న బొగ్గును వెలికి తీసేందుకు షాట్‌వాల్‌ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు. నిర్ధేశిత లక్ష్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాటిని అధిగమించేందుకు అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించ నున్నట్లు వెల్లడించారు. సింగరేణిలో శ్రీరాంపూర్‌ ఏరియాలోని ఆర్కెన్యూటెక్‌ గనిలో ప్రస్తుతం ఈ విధానంతో బొగ్గు ఉత్పత్తి … వివరాలు

కులవృత్తులకు పెద్దపీట: ఎమ్మెల్యే

వరంగల్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): అన్ని కులవృత్తులకు ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు కేటాయించి సహకారం అందిస్తోందని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. కాంగ్రెస్‌, టీడీపీలు తెలంగాణ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశాయని గుర్తుచేశారు. తెలంగాణలో ఈ పార్టీలు పూర్తి మనుగడ కోల్పోయాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం గొర్రెలు, మేకల పెంపకందారులకు … వివరాలు

ప్రైవేట్‌ వ్యాపారులతో అధికారుల కుమ్మక్కు

రైతులకు కుచ్చు టోపీ పెడుతున్న వైనం వరంగల్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): కంది రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, ఎఫ్‌సీఐని రంగంలోకి దింపి మార్క్‌ఫెడ్‌ ద్వారా కందుల కొనుగోళ్లను చేపట్టింది. అయితే వ్యాపారులతో చేతులు కలపడంతో అన్నదాత మోసానికి గురవుతున్నాడు. రైతులకు వ్యాపారులకు మధ్య సమన్వయకర్తలుగా ఉండాల్సిన అధికారులే వ్యాపారులతో … వివరాలు

ధర్మసాగర్‌కు తోడు మల్కాపూర్‌ రిజర్వాయర్‌

మారనున్న పూర్వ ఓరుగల్లు ముఖచిత్రం నీటి కొరత తీరి పెరగనున్న భూగర్భజలాలు జనగామ,ఫిబ్రవరి5(జ‌నంసాక్షి): మల్కాపూర్‌ గ్రామంలో రిజర్వాయర్‌ ఏర్పాటుతో వరంగల్‌ టౌన్‌ తోపాటు జనగామ ప్రాంతానికి కూడా నీటి కరువు తీరనుంది. ఇప్పటికే నీరు అందిస్తున్న ధర్మసాగర్‌కు తోడు మల్కాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణం జరిగితే పూర్వ వరంగల్‌ జిల్లాలో తాగునీటికి కొరత ఉండదని అంటున్నారు. దేవాదుల … వివరాలు

నాణ్యత ఉంటేనే మద్దతు ధరలు

జనగామ,ఫిబ్రవరి3(జ‌నంసాక్షి): నాణ్యతా ప్రమాణాలు పాటించి తీసుకువచ్చే ధాన్యానికి మార్కెట్‌లో మద్దతు, గిట్టుబాటు ధర లభిస్తుందని జనగామ వ్యవసాయ మార్కెట్‌ యార్డు చైర్‌పర్సన్‌ బండ పద్మ యాదగిరిరెడ్డి స్పష్టం చేశారు. ఈ-నామ్‌, హాకా ఆధ్వర్యంలో కందులు, వేరుశనగ కొనుగోళ్లను సక్రమం/-గా చేపడుతున్నామని అన్నారు. రైతులతో మాట్లాడి యార్డులో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ధర ఎంత మేరకు లభిస్తుందని అడిగి … వివరాలు