జాతీయం

నిమజ్జన ఘటనలో విషాదం

రాజస్థాన్‌ నదిలో పదిమంది మునక జయపుర,అక్టోబర్‌9 (జనం సాక్షి):  రాజస్థాన్‌ రాష్ట్రంలోని ధోల్‌పూర్‌ దుర్గాదేవి నిమజ్జనంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పర్బతి నదిలో విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా నీటిలో మునిగి 10 మంది గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఏడుగురి మృతదేహాలు బయటపడినట్లు ధోల్‌పూర్‌ జిల్లా కలెక్టర్‌ రాకేశ్‌ జైశ్వల్‌ తెలిపారు. మృతల కుంటుంబాలకు సీఎం … వివరాలు

రైతులను పట్టించుకోని యోగి ప్రభుత్వం

తీవ్రంగా మండిపడ్డ ప్రియాంక వాధ్రా కాంగ్రెస్‌ తీరుపై ఆందోళన వ్యక్తం చేసిన సల్మాన్‌ ఖుర్షీద్‌ లక్నో,అక్టోబర్‌9 (జనం సాక్షి):  ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి రైతులు కేవలం ప్రకటనల్లోనే కనిపిస్తారని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ వాద్రా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యోగీ ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించారు. రైతుల ఓట్లు అవసరమే కానీ వారి … వివరాలు

అమ్మను పూజించే గడ్డమనది

– రావణ దహన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ, అక్టోబర్‌9 (జనం సాక్షి):  అమ్మను పూజించడం మన సంప్రదాయమనీ.. దేశంలోని ప్రతి ఆడబిడ్డను గౌరవించడం మనందరి బాధ్యత అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని ద్వారకలో డీడీఏ మైదానం వేదికగా జరిగిన రావణ దహనం కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఇదే వేదికగా ఆయన దేశ … వివరాలు

మహారాష్ట్రలో దారుణం

కుటుంబ సభ్యులతో సహా బిజెపి నేత కాల్చివేత ముంబయి,అక్టోబర్‌7   మహారాష్ట్రలోని జల్‌ గావ్‌ ప్రాంతంలో బిజెపి నేత రవీంద్ర ఖారత్‌ (55)తో పాటు అతడి నలుగురు కుటుంబ సభ్యులను దుండగులు కాల్చి చంపారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.  స్థానిక బిజెపి కార్పొరేటర్‌ రవీంద్ర ఖారత్‌ (55), ఆయన కుటుంబ … వివరాలు

బ్లాక్‌లో ఒదిగిపోతున్న 2వేల నోట్లు

ఇకపై ఏటీఎం లో రూ.2వేల నోటుకు స్థానం లేనట్లే? న్యూఢిల్లీ,అక్టోబర్‌7 : రెండు వేల రూపాయల నోటు కోసం ఎదురుచూసే పరిస్తితి దాపురించవచ్చని ఎస్‌బిఐ హెచ్చరిస్తోంది. కొందరు అదేపనిగా ఈ నోట్లను బ్లాక్‌ చేస్తున్నారని అనుమానం వ్యక్తంచేసింది. దేశంలో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెండువేల రూపాయల నోట్లను  ఇలా విడుదల చేసిన వెంటనే కొందరు  … వివరాలు

ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ, అక్టోబర్‌7 ( జనం సాక్షి ) :  కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మూడు రోజుల పర్యటన నిమిత్తం శనివారం మధ్యాహ్నం ఫ్రాన్స్‌ బయలుదేరారు. ఫ్రాన్స్‌ నుంచి భారత వాయుసేన కొనుగోలు చేస్తున్న 36 రాఫెల్‌ యుద్ధ విమానాల్లో తొలి విమానాన్ని స్వీకరించడానికి ఆయన ఈ పర్యటన చేపట్టారు. భారత వాయుసేన ఆవిర్భావ దినోత్సవమైన … వివరాలు

అధికారం కోసమే బీజేపీతో కలిశాం 

– ఏదోఒక రోజు శివసైనికుడే మహారాష్ట్ర సీఎం అవుతాడు – శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే ముంబయి, అక్టోబర్‌7 ( జనం సాక్షి ) :  మరోసారి అధికారంలోకి వచ్చేందుకు మేం బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ, శివసేన పార్టీలు కలిసి పోటీ చేస్తున్న … వివరాలు

ఆరే కాలనీలో చెట్లు నరకొద్దు

– మహారాష్ట్ర సర్కార్‌కు సుప్రీం ఆదేశం – విచారణ 21కి వాయిదా ముంబయి, అక్టోబర్‌7  జనం సాక్షి : ముంబై మెట్రో రైలు ప్రాజెక్టు  నిర్మాణంలో పర్యావరణ ఆందోళన కారులకు సుప్రీంకోర్టుభారీ ఊరటనిచ్చింది. సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ప్రజలకు అనుకూలంగా తీర్పిచ్చి బాంబే హైకోర్టుకు గట్టి షాకిచ్చింది. ఆరేకాలనీ లో ఇకపై చెట్లను నరకడానికి వీల్లేదని … వివరాలు

భద్రతాదళాల అదుపులో.. జేఈఎం ఉగ్రవాది

– బురాముల్లా పాతబస్తీకి చెందిన మొహ్సీన్‌ సల్హెన్‌గా గుర్తింపు న్యూఢిల్లీ, అక్టోబర్‌7( జనం సాక్షి ) : పాక్‌ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మహ్మద్‌ (జేఈఎం) చెందిన ఓ ఉగ్రవాదిని భద్రతా దళాలు సజీవంగా పట్టుకున్నాయి. కశ్మీర్‌లోయలో ఉగ్రవాదుల వేట కొనసాగిస్తున్న భారత భద్రతా దళాలకు సోమవారం ఉగ్రవాది చిక్కాడు. బారాముల్లా జిల్లాలో పట్టుబడిన ఉగ్రవాదిని బారాముల్లా … వివరాలు

జైశ్రీరాం అనలేదని..  భార్యాభర్తలను చితకబాదారు!

– హర్యానాలోదారుణ ఘటన – దాడికిపాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చంఢీఘర్‌, అక్టోబర్‌7( జనం సాక్షి ) : రామ్‌ రామ్‌ అనలేదని దంపతులను ఓ వర్గానికి చెందిన వారు చితకబాదడం కలకలం రేపింది. అల్వార్‌ బస్టాండు దగ్గర ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు.. ఆ దండగులను పట్టుకున్నారు. పూర్తి వివరాల్లో … వివరాలు