Main

ముందంజలో కోమటిరెడ్డి!

   ఉదయం 8:30 : పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముందంజలో ఉన్నారు. మరోవైపు కారు వేగంగా దూసుకుపోతోంది. వేగం పెంచేసి 15 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకుపోతోంది. అలాగే కూటమిలో భాగంగా కాంగ్రెస్‌ 10 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇకముందు ఎవరు ఆధిక్యంలో ఉండనున్నారు..ఎవరు గెలవనున్నారో తెలుస్తుంది. నల్గొండ జిల్లాలో 9218 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు వచ్చాయి.

కాంగ్రెస్‌ కూటమికి ఓటేస్తే తెలంగాణ ఎడారే

నిరంతర కరెంట్‌కు గండిపడడం ఖాయం ప్రచారంలో హెచ్చరించిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి సూర్యాపేట,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ కూటమికి ఓటేస్తే తెలంగాణ ఎడారి  అవుతుందని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఓటు వేసే ముందు ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. గత పాలన ఎట్లా ఉండే? నాలుగేళ్ల టీ ఆర్‌ ఎస్‌ పాలన ఎలా ఉంది? అని ప్రశ్నించుకోని ఓటేయాలన్నారు.  … వివరాలు

అఘాయిత్యానికి పాల్పడ్డ తండ్రీకొడుకులు

తిరుమలగిరిలో బాలిక ఆత్మహత్య ఆందోళనకు దిగిన బంధువులు నల్లగొండ,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): జిల్లాలోని నాంపల్లి మండలం తిరుమలగిరిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి ఓ బాలిక పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలిని ఏడు నెలల గర్భవతిగా గుర్తించారు. బాలిక మృతిని నిరసిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాలిక మృతికి గ్రామానికి చెందిన ఇద్దరు … వివరాలు

కెసిఆర్‌ పథకాలపై ప్రజల్లో చర్చ

ప్రధానంగా 24 గంటల కరెంట్‌పై ప్రజల్లో ఆసక్తి రైతుబంధు,రైతు బీమాతో తిరుగులేని అభిమానం సానుకూల ధోరణికి నిదర్శనమన్న గుత్తా సుఖేందర్‌ రెడ్డి నల్లగొండ,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉండాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని నల్లగొండ ఎంపి, రైతు సమన్వయ సమితి రాష్ట్రా అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా 24 … వివరాలు

ప్రజావ్యతిరేక ప్రభుత్వాన్ని దింపాలి : జూలకంటి

నల్లగొండ,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సిపిఎం నాయకుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుపోయి వారిని ఉద్యమాలకు సమాయత్తం చేయడమే సిపిఎం లక్ష్యమని తెలిపారు ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకిచ్చిన వాగ్ధానాలు అమలు కావడం లేదని రంగారెడ్డి అన్నారు. ధాన్యం … వివరాలు

భవిష్యత్‌ బిజెపిదే 

నల్లొండ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఎంతసేపూ మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న అధికార టిఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టారో చూపాలని బిజెపి అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వర రావు డిమాండ్‌ చేశారు. మాటలు తప్ప చేతలు మాత్రం అడుగు దాటడం లేదని తెరాస ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇతర పార్టీల నేతల … వివరాలు

సంక్షేమ పథకాలను బలంగా ప్రచారం చేయాలి: గుత్తా

నల్లగొండ,అక్టోబర్‌16(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ ప్రతిష్టను పెంచాలని ఎంపి గుత్తా సుఖేందర్‌ రెడ్డి  అన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, రైతుబంధు, కల్యాణలక్ష్మి, ఆసరా పెన్షన్లు తదితర పథకాలను ప్రజల ముంగిటకు తీసుకువెళ్లి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ చేపట్టిన … వివరాలు

టీఆర్‌ఎస్‌ మంత్రులు..  మా సర్పంచ్‌తో సమానం

– తెలంగాణ ఇచ్చిన సోనియాను అమ్మ, బొమ్మ అంటారా? – ప్రజలు టీఆర్‌ఎస్‌ను తరిమికొట్టేందుకు సిద్ధంకావాలి – అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తాం – కాంగ్రెస్‌ నేత రాజగోపాల్‌రెడ్డి నల్గొండ, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌లోని ప్రతి మంత్రి, ఎమ్మెల్యేలు తమ పార్టీలోని సర్పంచ్‌తో సమానమని కాంగ్రెస్‌ నేత కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి … వివరాలు

బిజెపిలో పెరిగిన పోటీ

ఉమ్మడి జిల్లాలో అత్యధికుల ఆసక్తి నల్లగొండ,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పన్నెండు నియోజకవర్గాల్లో పోటీకి బిజెపిలో ఆశావహులు పెరుగుతున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంనుంచి తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పార్టీ సీనియర్‌ నాయకుడు రామోజు షణ్ముఖా చారి ఒక్కరే దరఖాస్తు చేసుకున్నారని అంటున్నారు. అయితే, పార్టీ జిల్లా అధ్యక్షుడు నూకల నర్సింహారెడ్డిని పోటీకి పెట్టాలని … వివరాలు

కూటమి నేతలను నిలదీయండి: గాదరి

నల్లగొండ,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): నాలుగేండ్ల తమ పాలతనలో సీఎం కేసీఆర్‌ చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆదరించాలని టీఆర్‌ఎస్‌ తుంగతుర్తి నియోజకవర్గం అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ అన్నారు. ఎన్నికల్లోనే గ్రామాలకు వచ్చే మహాకూటమి నేతలను ప్రజలు నిలదీయాలన్నారు.  ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన … వివరాలు