మహబూబ్ నగర్

దోపిడీ దొంగల అరెస్ట్‌

మహబూబ్‌నగర్‌,నవంబర్‌7(జ‌నంసాక్షి): జడ్చర్ల జాతీయ రహదారిపై సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు దారి దోపిడీకి పాల్పడ్డారు. హైదరాబాద్‌ నుంచి కారులో వస్తున్న వ్యాపారిని బెదిరించి కారు, రూ.3.84 లక్షల నగదును అపహరించారు. ఈకేసులో అత్యంత చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు దుండగులను పట్టుకున్నారు. హైదరాబాద్‌ రామకోటీలో సైకిళ్ల వ్యాపారం చేసే రాంఅవతార్‌ వ్యాపారం నిమిత్తం హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ … వివరాలు

శరవేగంగా యాదాద్రి ఆలయ నిర్మాణ పనులు

ప్రత్యక్ష పర్యవేక్షణలో శిల్పు కళాకృతులు యాదాద్రి భువనగిరి,నవంబర్‌2(జ‌నంసాక్షి): తిరుమలకు దీటుగా శ్రీలక్ష్మీనరసింహుడికి యాదాద్రి ఉండాలని సంకల్పించారు. యాదాద్రి ఆలయం ఓ అద్భుత క్షేత్రంగా వెలుగొందేలా ఇక్కడ నిర్మాణాలకు శ్రీకరాం చుట్టగా పనులు శరవేగంగా సాగుతున్నాయి. యాడా ప్రత్యేకాధికారి కిషన్‌ రావు ప్రత్యక్ష పర్యవేక్షణలో పక్కాగా పనులు సాగుతున్నాయి. భవిష్యత్తులో పెరుగనున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని … వివరాలు

కొడంగల్‌పై టిఆర్‌ఎస్‌ వ్యూహాత్మక అడుగులు

రేవంత్‌ అనుచరులను చేర్చుకోవడం ద్వారా దెబ్బకొట్టే యత్నం ఉప ఎన్నిక వస్తే విజయమే లక్ష్యంగా కార్యక్రమాలు మహబూబ్‌నగర్‌,నవంబర్‌2(జ‌నంసాక్షి): కొడంగల్‌ నియోజకవర్గం నుంచే గులాబీ జెండా జైత్రయాత్ర ప్రారంభమ వుతుందని మంత్రి కెటిఆర్‌ చేసిన ప్రకటన చూస్తుంటే రేవంత్‌కు చెక్‌ పెట్టడానికి టిఆర్‌ఎస్‌ గట్టిగా ప్రయత్నాలు చేపట్టిందని అర్థం అవుతోంది. ఒకవైపు రేవంత్‌ను విమర్శిస్తూనే, మరోవైపు కాంగ్రెస్‌ … వివరాలు

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

మహబూబ్‌నగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): రైతన్నలు పండించే ధాన్యానికి నష్టం కలగకుండా ఉండేందుకు మార్కెట్‌ కమిటీ ద్వారా, మహిళా సంఘాలు, సింగిల్‌విండో ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేశ్వర్‌ వివరించారు. మరింత ధర వచ్చే వరకు రైతులు తమ ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు వీలుగా గిడ్డంగులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామని దగా … వివరాలు

పక్కాగా ధాన్యం సేకరణ

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): గతంలో కంటే ఈ ఏడాది ఎక్కువ ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి సేకరించడానికి అన్నిరకాల ఏర్పాట్లు చేశామని డీఆర్‌డీఏ మార్కెటింగ్‌ అధికారులు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో అవసరమై మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. జూరాల ప్రాజెక్టు కింద, నీటి వనరులు లభించిన ప్రాంతాల్లో వరి పంటను రైతులు అధికంగా వేశారని ఆ ప్రాంతంలో … వివరాలు

కులవృత్తులకు పెద్దపీట: ఎమ్మెల్యే

యాదాద్రి,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం కులవృత్తులకు అన్ని విధాల చేయూత నిస్తుందని, కులవృత్తుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే గొగిడి సునీత స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌ సమర్థవంతమైన పాలన అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. చేతి, కులవృత్తుల ను ప్రోత్స హించేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందన్నారు. గ్రామాల్లోని మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి … వివరాలు

మాటలతో ఎంతోకాలం మభ్యపెట్టలేరు: కాంగ్రెస్‌

మహబూబాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): ఎంతసేపూ మిషన్‌ భగీరథ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్లంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న అధికార టిఆర్‌ఎస్‌ నేతలు ఎక్కడ డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు కట్టారో చూపాలని మహబూబా బాద్‌ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చంద్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మాటలు తప్ప చేతలు మాత్రం అడుగు దాటడం లేదని తెరాస ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. ఇతర పార్టీల … వివరాలు

పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేస్తాం: నిరంజన్‌

వనపర్తి,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): పాలమూరు జిల్లా నుంచి విడిపోయిన అన్ని జిల్లాల్లోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. కల్వకుర్తి పూర్తయి నీళ్లురాగానే కాంగ్రెస్‌ నేతలు ఉలిక్కి పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్‌, టిడిపిలు పనీపాట లేకుండా రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని అన్నారు. వనపర్తి నియోజక వర్గాన్ని ,పాలమూరు జిల్లాలను అన్ని … వివరాలు

జురాలకు జలకళ

– 13 గేట్ల ఎత్తివేత మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌ 16,(జనంసాక్షి):జూరాలకు వరద పోటెత్తింది. ఎగువప్రాంతాల నుంచి లక్షా పన్నెండు వేల నాలుగొందల క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 13 గేట్లు ఎత్తేశారు. అప్పర్‌ జూరాలలో ఐదు యూనిట్లు, లోయర్‌ జూరాల లో ఆరు యూనిట్ల ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నారు. వచ్చిననీరు వచ్చినట్లు కిందకు వదిలేస్తున్నారు. … వివరాలు

కోటి ఎకరాల మాగాణమే లక్ష్యం

మహబూబ్‌నగర్‌,సెప్టెంబర్‌8(జ‌నంసాక్షి): తెలంగాణలో కోటి ఎకరాల మాగాణను సృష్టించడమే సిఎం కెసిఆర్‌ లక్ష్యమని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి అన్నారు. వెనకబడ్డ పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసి ఇచ్చిన హావిూ మేరకునీరు అందిస్తామని అన్నారు. గత ప్రభుత్వాలు పాలమూరును విస్మరించగా, కెసిఆర్‌ అక్కున చేర్చుకుని వాటిని పూర్తి చేస్తున్నారని అన్నారు. తెలంగాణపై బిజెపి కల్లబొల్లి కబులర్లు … వివరాలు