మహబూబ్ నగర్

తెలంగాణ పథకాలపై ఢిల్లీలో ఆరా

కంటివెలుగులో విపక్షాలకు చూపు తెప్పించాలి ఎంపి జితేందర్‌ రెడ్డి మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో జరగనంతా.. అభివృద్ధి తెలంగాణలోజరిగిందని ఎంపీ జితేందర్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఢిల్లీలో అడిగి తెలుసుకుంటున్నారని తెలిపారు. మహబూబ్‌ నగర్‌ జిల్లా నారాయణ పేటలో పర్యటించిన ఎంపీ జితేందర్‌ రెడ్డి.. పలు అభివృద్ధి … వివరాలు

కెసిఆర్‌ ఆదేశాల మేరకు స్వఛ్చ కార్యక్రమాలు

15న రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో శ్రమదానాలు: జూపల్లి నాగర్‌కర్నూల్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలకు అనుగుణంగా ఈ నెల 15 న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో శ్రమదాన కార్యక్రమం ప్రారంభిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ పట్టణంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో … వివరాలు

కల్వకుర్తిలో కార్డన్‌ సెర్చ్‌

నాగర్‌కర్నూల్‌,ఆగస్ట్‌11(): జిల్లాలోని కల్వకుర్తి పట్టణంలోని బలరాం నగర్‌ కాలనీలో పోలీసులు కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌, ఏఎస్పీ చెన్నయ్య, డీఎస్పీలు లక్ష్మీ నారాయణ, రవికుమార్‌తో పాటు 150 మంది పోలీసులు తనిఖీల్లో పాల్గొన్నారు. నిర్బంధ తనిఖీల్లో భాగంగా సరైనధృవపత్రాలు లేని 72 బైక్‌లు, 6 ఆటోలు, ఒక కారును పోలీసులు సీజ్‌ చేశారు.  

కాంగ్రెస్‌ను విమర్శించడం మానుకోవాలి

తెలంగాణ ఇవ్వకుంటే ఎక్కడుండేవారో చెప్పాలి: డికె మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌11(జ‌నం సాక్షి): ప్రాజెక్టులను కాంగ్రెస్‌ అడ్డుకుంటున్నదని రాజకీయంగా లబ్ది పొందాలని, సానుభూతి పొందాలని సిఎం కెసిఆర్‌ చూస్తున్నారని గద్వాల ఎమ్మెల్యే మాజీమంత్రి డికె అరుణ అన్నారు. అలాంటి దుస్థితి రాకుండా పనులు చేస్తే ప్రజలు హర్షిస్తారని గుర్తుంచుకోవాలన్నారు.60 ఏళ్లలో కాంగ్రెస్‌ వాళ్లు ఏం చేశారని ప్రశ్నిస్తున్నారని, కాంగ్రెస్‌ ముందుకు … వివరాలు

కంటివెలుగు పథకం విజయవంతం కోసం ఏర్పాట్లు

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో ఆరంభించనున్న కంటి వెలుగు కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లన్ని సిద్ధం చేశామని కంటి వెలుగు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ వినోద్‌కుమార్‌ తెలిపారు. వైద్య పరీక్షలను నిర్వహించేందుకు అవసరమైన సిబ్బందిని ఎంపికచేసి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందన్నారు. ఇందుకు అవసరమైన వారికి ఆపరేషన్లను చేయడంతో పాటు కంటి అద్దాలను … వివరాలు

ఫూలే విదేశీ విద్యానిధి పథకం కింద ఆర్థిక సాయం

మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): జ్యోతిబాఫూలే విదేశీ విద్యానిధి పథకం కింద ఉన్నత విద్యాభ్యాసానికి సాయం కావాల్సిన బీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ అధికారి యన్‌.విద్యాసాగర్‌రావు ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్‌సైట్‌లో ఈనెల 31వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాలలోపు ఉండి, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు … వివరాలు

ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ కుట్ర రాజకీయాలు

పుట్టగతులుండవనే కేసులతో అడ్డుకునే యత్నం మహబూబ్‌నగర్‌,ఆగస్ట్‌6(జ‌నం సాక్షి): పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిధిలో నిర్మించే జలాశయాల నిర్మాణం జరిగితే పుట్టగతులు ఉండవనే కాంగ్రెస్‌ పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రాజెక్టులు పూర్తయితే పుట్టగతులు ఉండవనే భయం కాంగ్రెస్‌కు పట్టుకుందన్నారు. పదేళ్ల ఉమ్మడి పాలనలో తెలంగాణకు తీరనిఅన్యాయం … వివరాలు

బుద్దారం చెరువులో చేపలు వదిలిన మంత్రి

సంక్షేమంలో ముందున్నామన్న తలసాని వనపర్తి,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): గత నాలుగు సంవత్సరాల టీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందున్నదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. మూడవ విడత చేపపిల్లల పంపిణీలో భాగంగా వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండలం బుద్దారం పెద్దచెరువులో శుక్రవారం చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక సంఘం … వివరాలు

కుక్కల స్వైర విహారం

ఆరుగురికి గాయాలు మహాబుబ్‌నగర్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): జిల్లా లోని నారాయణపేట పట్టణంలో పిచ్చి కుక్కలు దాడి చేశాయి. 6 మందిపై దాడి చేసి కాటు వేయగా,ఒక చిన్నారి చెవిని పూర్తిగా కొరికేసాయి. ప్రస్తుతం క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ రెండు రోజుల్లో దాదాపు 15 మంది చిన్నారుల పై కుక్కలు దాడి చేశాయి. నారాయణపేట లోని … వివరాలు

కల్వల గ్రామంలో అంతుచిక్కని కాళ్ళవాపు 

చికిత్స చేయిస్తున్నా తగ్గని వ్యాధి ఆందోళనలో గ్రామ ప్రజలు మహబూబాబాద్‌,జూల30(జ‌నం సాక్షి): కేసముద్రం మండలం కల్వల  గ్రామంలో కాళ్ళ వాపు వ్యాధి కలకలం రేపుతోంది. అకస్మాత్తుగా  కాళ్లలో వాపు వచ్చి  విపరీతమైన మంట నొప్పి ఉంటుంది. దీంతో బాధితులు నొప్పికి తాళలేక ఆస్పత్రులకు వెళ్తే, వాపు ప్రాంతాన్ని ఆపరేషన్‌ ద్వారా తొలగిస్తున్నారు. ఇలా గ్రామంలో రెండు నెలల … వివరాలు