Main

గిట్టుబాటు ధరలు కావాలంటే మార్కెట్‌లోనే అమ్ముకోవాలి

సంగారెడ్డి,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధరను అందించేందుకు గాను మద్దతు ధరలను నిర్ణయించారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు 48 గంటల్లోగా డబ్బులను వారి ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని అధికారులు సూచించారు. జోగిపేట వ్యవసాయ మార్కెట్‌ … వివరాలు

కేసీఆర్‌ నాగాడ్‌ ఫాదర్‌ అనుకున్నా

– కానీ నాకు అన్యాయం చేశాడు – కంట తడిపెట్టిన బాబూమోహన్‌ సంగారెడ్డి, అక్టోబర్‌11(జ‌నంసాక్షి) : కేసీఆర్‌ నాగాడ్‌ ఫాదర్‌ అనుకున్నా.. కానీ తనకు అన్యాయం చేశాడంటూ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బాబూమోహన్‌ కంట తడి పెట్టుకున్నాడు. టీఆర్‌ఎస్‌ టికెట్‌ దక్కకపోవడంతో బాబూమోహన్‌ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన విషయం విధితమే.  … వివరాలు

బ్రహ్మాచారి అలంకరణలో అమ్మవారు

బాసరలో పెరిగిన భక్తుల రద్దీ బాసర,అక్టోబర్‌11(జ‌నంసాక్షి):  ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మహాలక్ష్మి, మహాకాళి, మహా సరస్వతి ముగ్గురమ్మలు కొలువుతీరిన మహాక్షేత్రంలో రెండో రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం జ్ఞాన సరస్వతి అమ్మవారు బ్రహ్మచారి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ముందుగా గోదావరిలో … వివరాలు

కూటమినేతలను నమ్మవద్దు: మాజీ ఎమ్మెల్యే

సిద్దిపేట,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థులకు గట్టి గుణపాఠం చెప్పాలని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రజలను కోరారు. తెలంగాణ ప్రజలు ఈ కూటమి నేతలకు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.  అది మహాకూటమి కాదని ఓ మాయాకూటమి అని  విమర్శించారు. తెలంగాణ ప్రగతిని అడ్డుకునే కూటమి నేతలను దగ్గరకు రానీయవద్దని ఆయన తన ప్రచారంలో చెబుతున్నారు.ఏజెండా … వివరాలు

వచ్చే ఆరు నెలల్లో.. సాగుకు గోదావరి జలాలు

– బతుకమ్మ చీరలను అడ్డుకున్న కాంగ్రెస్‌కు ఓటుతో బుద్దిచెప్పాలి – టీడీపీ, కాంగ్రెస్‌ కుట్రలను తరిమికొట్టండి – ఆపద్ధర్మ మంత్రి హరీశ్‌రావు సిద్ధిపేట, అక్టోబర్‌10(జ‌నంసాక్షి) : వచ్చే ఆరు నెలల్లో సాగుకు గోదావరి జలాలు అందుతాయని తెలంగాణ ఆపద్ధర్మ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. సిద్ధిపేట జిల్లాలోని జగదేవపూర్‌ మండలంలో మంత్రి హరీశ్‌రావు బుధవారం ఎన్నికల … వివరాలు

గద్వాలలో అరుణమ్మకు ఓటమి తప్పదు

కెసిఆర్‌ మాత్రమే అభివృద్ది చేయగల నాయకుడు:టిఆర్‌ఎస్‌ గద్వాల,అక్టోబర్‌10(జ‌నంసాక్షి): గద్వాలలో ఈ సారి డికె అరుణకు ఓటమి తప్పదని టిఆర్‌ఎస్‌ అభ్యర్థి కృష్ణమోహన్‌ రెడ్డి అన్నారు. నిరంతరం విూ మధ్య ఉండి, విూ సేవకే అంకితమైన వారికి పట్టం కట్టాలని ప్రజలను కోరారు. బుధవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ..పథకాల అమలులో నాలుగేళ్లలో సీఎం కేసిఆర్‌ … వివరాలు

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

మార్పు కోసం బిజెపిని గెలిపించాలి: రఘునందన్‌ సిద్దిపేట,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే బిజెపి కూడా మార్పు కోసం బిజెపి అంటూ ప్రచారం చేయబోతున్నదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు అన్నారు. అధికార టిఆర్‌ఎస్‌ ఇచ్చిన హావిూలు నిలుపుకోలేదని, తెలంగాణ ఆకాంవక్షలను తుంగలో తొక్కిందని అన్నారు. అందుకే అమిత్‌షా సభకోసం భారీగా జనం … వివరాలు

గాంధీజీ బాటలో కెసిఆర్‌ తెలంగాణ ఉద్యమం

సిద్దిపేటలో బాపూ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీష్‌ రావు సిద్దిపేట,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): తన జీవితాన్ని దేశం కోసం త్యాగం చేసిన మహాత్మాగాంధీజి బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని మంత్రి హరీష్‌ రావు అన్నారు. ఆయన చూపిన మార్గం నేటికీ అనుసరణీయమని అన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం రావాలని సీఎం కేసీఆర్‌ ఆలోచిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. … వివరాలు

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలి

సిద్దిపేట,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): వ్యవసాయాన్ని వ్యాపారంగా మార్చుకుంటేనే అధిక లాభాలను పొందడానికి అవకాశం ఉంటుందని టిఆర్‌ఎస్‌ నాయకుడు ఎలక్షన్‌ రెడ్డి సూచించారు. సిఎం కెసిఆర్‌ వ్యవసాయానికి భారీ ప్రోత్సాహకాలు ఇస్తున్నారని, వాటిని ఉపయోగించుకుని రైతులు లాభాలు పండించ వచ్చన్నారు. రైతులు సమష్టిగా కృషిచేయడానికి ప్రయత్నించాలని కోరారు. దేశానికి వెన్నుముక రైతేనని ఆయన బాగుంటే దేశం బాగుంటుందన్నారు. రైతులు ఆధునిక … వివరాలు

నిండా ముంచిన పార్టీలను నమ్మొద్దు

సిద్దిపేట,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): ఏన్నో ఏళ్లుగా ఆధికారంలో ఉండి తెలంగాణ ప్రాంతాన్ని నిండా ముంచిన కాంగ్రెస్‌ పార్టీ నాయకుల మాయ మాటలు నమ్మవద్దని మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. ప్రజలంతా టిఆర్‌ఎస్‌కే ఓటని అంటూ తీర్మానాలు చేస్తున్నారని అన్నారు. గతంలో ఏనాటూ ఇలాంటి ప్రచారాం చూడలేదన్నారు. ఈ సందర్బంగా పలువురు కాంగ్రెస్‌ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. వీరికి … వివరాలు