Main

ప్రగతిభవన్‌ ముట్టడికి నిరుద్యోగుల యత్నం

హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి):  గ్రూప్‌-2 నియామక పక్రియలో కొనసాగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ నిరుద్యోగ యువకులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకొవాలని డిమాండ్‌ చేస్తూ గ్రూప్‌-2 సెలెక్టెడ్‌ అభ్యర్థులు శనివారం ఉదయం ప్రగతిభవన్‌ ముట్టడికి ప్రయత్నించారు. అక్కడికి చేరుకున్న అభ్యర్థులను పోలీసులు అరెస్ట్‌ చేసి గోషామహల్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గ్రూప్‌-2 పరీక్షా నిర్వహణలో ఎలాంటి … వివరాలు

నగరం చుట్టూ ఉద్యానవనాలు

ట్విట్టర్‌లో కెటిఆర్‌ వీడియో పోస్ట్‌ హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి):   మహానగరం చుట్టూ అర్బన్‌ లంగ్‌ స్పేస్‌ను ఏర్పాటు చేయనున్నామని మంత్రి కేటీ.రామారావు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. భారీగా వనాలను, ఉద్యావనాలను అభివృద్ది చేయడం ద్వారా వాతావరణాన్ని రక్షించాల్సి ఉందన్నారు. రాష్ట్ర అటవీ శాఖ, పట్టణాభివృద్ధి శాఖలు సంయుక్తంగా నగరం చుట్టూ 180 ప్రాంతాల్లో అటవీ ప్రాంతాలను అభివృద్ధి చేసేలా ప్రణాళికలు … వివరాలు

హైదరాబాద్‌లో మేయర్‌ అర్ధరాత్రి పర్యటన

హైదరాబాద్‌ : జీహెచ్ఎంసీ పరిధిలో నిర్మాణంలో ఉన్న రహదారులను మేయర్ బొంతు రామ్మోహన్‌, పురపాలక శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్ శుక్రవారం అర్ధరాత్రి పరిశీలించారు. జూబ్లీహిల్స్, నల్గొండ ఫ్లైఓవర్, మజీద్ బండ ప్రాంతాల్లో జరుగుతున్న రహదారి నిర్మాణ పనుల్లో నాణ్యతను పరిశీలించారు. సకాలంలో పనులను పూర్తి చేయడంతో పాటు… నాణ్యత విషయంలో రాజీపడొద్దని గుత్తేదారులకు సూచించారు. … వివరాలు

ఎయిమ్స్‌ రాకతో మారనున్న తెలంగాణ వైద్యరంగం

బీబీ నగర్‌ నిమ్స్‌ లేదా మరో చోట ఏర్పాటుకు కార్యాచరణ సిఎంతో చర్చించిన తరవాతనే తుది నిర్ణయం హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): ఆలస్యంగా అయినా తెలంగాణకు న్యాయం  జరిగిందని భావించాలి. సుదీర్ఘ పోరాటంతో ఎయిమ్స్‌ను మంజూరు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం తెలంగాణకు ఊరట నిచ్చేదిగా ఉంది. దీంతో ఎయిమ్స్‌ను గతంలో ప్రస్తుత బీబీనగర్‌లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం … వివరాలు

రోహిణికి ముందే ఎండల తీవ్రత

హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): రోళ్లు పగిలేలా భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. రోహిణికి ముందే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. గతంతో పోలిస్తే 3 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. దీంతో నగరం అగ్నిగోళంలా మారింది. నిప్పుల కుంపటిని ఇంట్లో పెట్టుకున్న మాదిరి భగభగలు నిలువనీయడం లేదు. సూర్యతాపం దెబ్బకు 44 ఏళ్ల రికార్డుకు ఎండలు చేరువయ్యాయి. … వివరాలు

శబ్ద కాలుష్యంపై నగర పోలీసుల నజర్‌

మోతమోగితే కేసులు తప్పవు హైదరాబాద్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): నగరంలో శబ్ద కాలుష్య నిబంధనలు ఉల్లంఘించిన వారిపై నగర్‌  పోలీస్‌ చట్టం ప్రయోగించి కేసులు నమోదు చేస్తున్నారు. బాజాబజంత్రీలు వ్యవక్తిగత జీవనానికి ప్రతిబందకం కాకుండా చర్యలు చేపట్టారు. పెళ్లిళ్లు, ఊరేగింపులు, జన్మదిన వేడుకలు, సంగీతకచేరీల వంటివి ధ్వని కాలుష్యంతో స్థానికంగా నివాసముంటున్న వారిని తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. పోలీసులకు సమాచారం … వివరాలు

లారీఢీకొని ముగ్గురు మృతి

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): కరీంనగర్‌  జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు  దుర్మరణం చెందారు.  తిమ్మాపూర్‌ మండలం మహాత్మానగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురు తీవ్రగాయాల పాలయ్యారు. తిమ్మాపూర్‌ నుంచి కరీంనగర్‌ వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతిచెందిన వారిలో ఇద్దరు తిమ్మాపూర్‌ … వివరాలు

కార్డెన్‌సెర్చ్‌లో రౌడీషీటర్ల అరెస్ట్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): సైబరాబాద్‌ పరిధిలోని మాదాపూర్‌లో పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. పకడ్బందీగా జరిగిన ఈ తనిఖీలు కూకట్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సర్దార్‌ నగర్‌ ప్రాంతంలో జరిగాయి. మాదాపూర్‌ డిసిపి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పోలీసులు ఇరవై బృందాలుగా విడిపోయి నిర్బంధ తనిఖీలు … వివరాలు

కీలక మలుపు తిరుగుతున్న శ్రీరెడ్డి వ్యవహారం

తనతల్లిని దూషించిన తీరుపై  పవన్‌ సీరియస్‌ న్యాయపోరాటం దిశగా అడుగులు అదే సందర్భంలో వర్మతో అవిూతువిూకి సిద్దం ఫిల్మ్‌ ఛాంబర్‌కు తరలివచ్చిన మెగా ఫ్యామిలీ పవన్‌కు మద్దతుగా కదలి వచ్చిన మా సభ్యులు హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): శ్రీరెడ్డి వ్యవహారం కీలక మలుపులు తిరుగుతున్న వేళ రామ్‌గోపాల్‌ వర్మ కామెంట్‌..వాటిని తీవ్రంగా అల్లు అరవంద్‌ ఖండించడం.. ఓ ఎత్తయితే … వివరాలు

షిర్డీసాయినాధుని సేవలో కెసిఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి షిర్డీకి చేరుకున్నారు. షిర్డీ సాయిబాబాను సీఎం కేసీఆర్‌ కుటుంబ సభ్యులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. శుక్రవరాం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్‌ షిర్డీకి బయల్దేరిన విషయం విదితమే. షిర్డీ ఎయిర్‌పోర్టులో మహారాష్ట్రలో నివాసముంటున్న తెలంగాణవాసులు సీఎంకు … వివరాలు