ఆదిలాబాద్

కాసేపట్లో ఆదిలాబాద్‌ జిల్లా జైలు నుంచి అక్బరుద్దీన్‌ విడుదల

ఆదిలాబాద్‌: కాసేపట్లో ఆదిలాబాద్‌ జిల్లా జైలునుంచి అక్బరుద్దీన్‌ విడుదల కానున్నారు. దీంతో జైలు వద్దకు ఎంఐఎం కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.

అక్బరుద్దీన్‌ విడుదలకు నిర్మల్‌ మున్సిఫ్‌ కోర్టు ఉత్తర్వులు

ఆదిలాబాద్‌: అక్బరుద్దీన్‌ పాస్‌పోర్టును న్యాయవాదులు పోలీసులకు అప్పగించారు. దీంతో ఆయన విడుదలకు నిర్మల్‌ మున్సిఫ్‌ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

అక్బర్‌ విడుదలపై వెలువడని ఉత్తర్వులు

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో బెయిల్‌ మంజూరు కావడంతో నిర్మల్‌ కోర్టులో రూ. 25 వేల చొప్పున రెండు వూచీకత్తులను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ తరపు …

పట్టాలపై కూలిన చెట్లు.. పలు రైళ్ల నిలిపివేత

ఆదిలాబాద్‌: ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలకు రెబ్బెన మండలం రాళ్ల పేట రైల్వేస్టేషన్‌ వద్ద పట్టాలపై చెట్లు కూలిపడ్డాయి. దీంతో కాగజ్‌నగర్‌లో భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌, సంపర్క్‌ క్రాంతి …

బాసరలో భక్తుల ఇక్కట్లు

ఆదిలాబాద్‌: వసంత పంచమి వేడుకలు బాసరలో వైభవంగా జరుగుతున్నాయి. నేడు సరస్వతి అమ్మవారి పుట్టినరోజు కావడంతో చిన్నారులకు అక్షరాభ్యాసాలను చేయించేందుకు భారీసంఖ్యలో భక్తులు బారులు తీరారు. మరోవైపు …

కుంభమేళాలో ఆదిలాబాద్‌ జిల్లా వాసి గల్లంతు

ఆదిలాబాద్‌: మహాకుంభమేళాలో పుణ్యస్నానానికి వెళ్లిన ఆదిలాబాద్‌ జిల్లా వాసి ఒకరు గల్లంతైనట్లుసమాచారం. నేరడిగొండ మండలం వగ్దరికి చెందిన మహారాజ్‌ మోతీరామ్‌ ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది.

పదివేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ

ఆదిలాబాద్‌: పదివేల రూపాయలు లంచం తీసుకుంటూ ఆదిలాబాద్‌ జిల్లా వాంఖిడి సీఐ లచ్ఛన్న అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు, సోనాపూర్‌కు చెందిన ఒక మహిళ వద్ద …

ఆదిలాబాద్‌లో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లా సారంగాపూర్‌ మండలం వాంఖిడి వద్ద ఆర్టీసీ బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో అదుపు తప్పింది. డ్రైవరు బస్సును అదుపు చేసే ప్రయత్నంలో ఉండగానే …

నేడు నిజామాబాద్‌ కోర్టుకు అక్బరుద్దీన్‌

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టయి ఆదిలాబాద్‌ జిల్లా జైలులో రిమాండ్‌లో ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను పోలీసులు నేడు నిజామాబాద్‌ కోర్టులో హాజరుపరచనున్నారు. అక్బరుద్దీన్‌ రిమాండ్‌ …

ఏసీబీ వలలో అవినీతి వీఆర్వో

ఆదిలాబాద్‌: ఓ అవినీతి వీఆర్వో ఏసీబీ అధికారుల చేతికి చిక్కాడు. లక్సెట్టిపేట మండలం మోదెలలో గుళ్లకోట వీఆర్వో రత్నయ ఓ వ్యక్తి నుంచి నాలుగు వేల రూపాయల …