కరీంనగర్

బీజేపీ రాస్తారోకో

కరీంనగర్‌: తెలంగాణ కోసం ఢిల్లీలో చేపట్టిన దీక్షా శిబిరంలో పాల్గొన్న పెద్దపల్లి కార్యకర్తలపై ఢిల్లీ పోలీసులు దాడి చేయాటాన్ని నిరసిస్తూ పెద్దపల్లిలో రాస్తారోకో నిర్వహించారు

బతికపల్లిలో ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య

కరీంనగర్‌:పెగడపల్లి మండలంలోని బతికపల్లి గ్రామంలో నల్ల లక్ష్మీనారాయణ(40)ఈరోజు ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేత కార్మికుడైన ఈయన 3సం. వరకు సిరిసిల్లలో కార్మికునిగా పనిచేసి ఆనారోగ్యానికి …

పాఠశాలో మొక్కలునాటే కార్యక్రమం

కరీంనగర్‌:జూలపల్లి మండలంలోని పెద్దపూర్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో తశీల్దారు వెంకటమాధరావు 50మొక్కలు నాటారు. విద్యార్థులు చిన్ననాటినుండే పర్యావరణంపై అవగాహ కల్పించాలన్నారు. విద్యార్థికొక మొక్కను పెంచే బాధ్యతను అప్పగించాలన్నారు.

రహదారిని ఆక్రమించారని ఎడ్లబండ్లతో గ్రామస్తుల రాస్తారోకో

కరీంనగర్‌:జూలపల్లి మండలంలోని తేలుకుంట గ్రామాస్థులు రహదారి సౌకర్యం కల్పించాలంటూ ఎడ్లబవడ్లతో ఆందోళన చేపట్టారు. సర్వే నెంబర్‌ 1597గుండా రహదారి ఉండగా ఆ స్థలాన్ని ఆక్రమించారన్నారు. రెవెన్యూ అధికారులు …

కొడిమ్యాల ప్రభుత్వ పాఠశాలలో బస్సుపాసులు పంపిణీ చేసిన ఆర్టీసీ

కొడిమ్యాల: స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుతున్న 100మంది విద్యార్థులకు వేములవాడ ఆర్టీసీ అధికారులు ఉచితంగా బస్సు పాసులు అందజేశారు.

విధులు బహిష్కరించిన న్యాయవాదులు

మెట్‌పల్లి: తెలంగాణకోసం ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్‌కి చెందిన సుమన్‌కు సంతాపంగా మెట్‌పల్లిలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు.

మెట్‌పల్లిలో రాస్తారోకో

మెట్‌పల్లి: ఢిల్లీలో బీజేపీ నాయకులు ప్రధాని నివాస ముట్టడిని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మెట్‌పల్లిలో బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.

మెట్‌పల్లిలో పోషకాహరంపై గర్భిణులకు అవగాహన సదస్సు

మెట్‌పల్లి: మండలంలోని ఆరిపేట గ్రామంలో బాలింతలకు, గర్భిణులకు పోషకాహరంపై అవగాహన కల్పించారు. పోషకాహరంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకురుతుందని నిర్వహకులన్నారు.

ఢిల్లీలో బీజేపీ నాయకులపై లాఠీచార్జీకి నిరసనగా ఖనిలో నాయకుల ధర్నా

గోదావరిఖని: ఢిల్లీలో బీజేపీ నాయకులపై లాఠీచార్జీకి నిరసనగా గోదావరిఖనిలో బీజేపీ నాయకులు పట్టణంలోని రాజీవ్‌రహదారిపై రాస్తా రోకో చేశారు

యువతి ఆత్మహత్య

కొడిమ్యాల: మండలంలోని నాచుపల్లి గ్రామానికి చెందిన మమత(20) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు …