Friday, 6 November 2026

దుబాయిలో జిల్లా వాసి ఆత్మహత్య

గంగాధర: దుబాయిలో ఉంటున్న కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని వెంకటయపల్లి గ్రామానికి చెందిన ఆదిపల్లి శ్రీనివాస్‌(43) ఈ నెల 2న ఉరి వేసుకుని ఈత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులకు ఈ రోజు సమాచారమందినది. ఉపాధికోసం అప్పులు చేసి రెండళ్ల క్రితం దుబాయి వెళ్లిన శ్రీనివాస్‌ ఆత్మహత్య చేసుకోవటంతో భార్య జ్యోతి, కొడుకులు చరణ్‌, కరణ్‌లు కన్నీరు మున్నీరవుతున్నారు. శ్రీనివాస్‌ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. అతని మృత దేహం స్వదేశానికి తెప్పించటానికి ప్రభుత్వం సహకరించాలని కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *