నల్లగొండ

యాదగిరిగుట్ట చేరిన సీఎం కేసీఆర్

నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాలోని యాదగిరిగుట్టకు చేరుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.

నేడు యాదగిరిగుట్టలో సీఎం కేసీఆర్ పర్యటన

నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు యాదగిరిగుట్టలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. గవర్నర్ నరసింహన్, చినజీయర్ స్వామి హాజరుకానున్నారు.

నల్గొండ జిల్లాలో విషాదం

నల్గొండ: జిల్లాలో విషాదం నెలకొంది. రైలు కిందపడి నాలుగేళ్ల చిన్నారితో సహా తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

నార్కెట్ పల్లిలో ఇద్దరు బైక్ దొంగల అరెస్టు

నల్లగొండ : నార్కెట్‌పల్లిలో ఇద్దరు బైక్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. దొంగల నుంచి 28 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పోలీసులు విచారిస్తున్నారు.

ఆలేరులో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..

నల్గొండ : ఆలేరు శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్ ను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

పేలిన డైనమేట్ :ఒకరి మృతి

నల్గొండ:చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గుట్టపై డైనమేట్‌ బాంబ్‌ పేలి ఒకరు మృతి చెందారు. గుట్టలోని బండరాళ్లను పగలకొట్టేందుకు అమర్చిన డైనమేట్ వల్లనే వ్యక్తి చనిపోయాడని పోలీసులు భావిస్తున్నారు. …

భువనగిరిలో అగ్ని ప్రమాదం

 భువనగిరి (నల్లగొండ) : నల్లగొండ జిల్లా భువనగిరిలో మంగళవారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో గంజి మార్కెట్ సమీపంలోని శ్రీ సోమేశ్వర స్వామి పెయింటింగ్ …

ఏసీబీ వలలో సస్పెండ్ అయిన తహసీల్దార్

నల్గొండ:లంచం తీసుకుంటూ సస్పెండైన యాదగిరిగుట్ట తహశీల్దార్ ఏసీబీకి రెడ్‌హాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా భువనగిరిలో చోటుచేసుకుంది. ఓ రైతు వద్ద నుంచి రూ. 15 …

నల్గొండలో సీపీఐ కార్యకర్త దారుణ హత్య

నల్లగొండ: సీపీఐ కార్యకర్త యాదయ్య ఆదివారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు యాదయ్యను గొడ్డలితో నరికారు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయారు. …

తండ్రిని చంపిన కొడుకు…

నల్గొండ:మర్రిగూడ మండలం అంతంపేటలో తాగిన మైకంలో కొడుకు తండ్రిని హతమార్చాడు. తండ్రిని చంపిన కొడుకు నిర్వాకంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.