నల్లగొండ

అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనాలను పట్టుకున్న రెవెన్యూ అధికారులు

నల్గొండ: వేములపల్లి మండలం లక్ష్మిదేవిగూడెంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక తరలిస్తున్న 8లారీలు, 3ట్రాక్టర్‌లను రెవెన్యూ అధికారులు పట్టుకుని వీటిని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

ఈ నెల 9న వైకాపా తీర్థం పుచ్చుకోనున్న ఉప్పునూతల

నల్గొండ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కొద్ది రోజులుగా కాంగ్రెస్‌ పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. అయితే ఉప్పునూతల కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పనున్నారు. …

ఎన్జీ కళాశాలో మైక్రోబయాలజీలో 28సీట్లు కాళీ:ప్రిన్సిపాల్‌

నల్గొండ: ఎన్జీ కళాశాలలో మైక్రోబయాలజీలో 28సీట్లు కాళీగా ఉన్నాయని ప్రిన్సిపాల్‌ తెలిపారు. ఈ నెల 4న జరిగే కౌన్సిలింగ్‌కు హాజరు కావాలని కోరారు.

బీసీల హక్కుల సాధనకు ఈ నెల3న పార్లమెంట్‌ ముట్టడి

నల్గొండ: బీసీల హక్కుల సాధనకు సెప్టెంబర్‌ 3న పార్లమెంట్‌ ఎదుట జరిగే ధర్నారు జయప్రదం చేయాలని బీసీ యువజన సంఘం పిలుపునిచ్చింది.

నల్గొండ జిల్లాలో గవర్నర్‌ పర్యటన-ఫ్లోరైడ్‌ రహిత నీటిని అందించేందుకు కృషి

నల్గొండ:అల్లాపురం గ్రామంలో స్వచ్చంధసంస్థ ఏర్పాటు చేసిన మంచినీటి ప్లాంట్‌ను పరిశీలించారు. ఫ్లోరైడ్‌ రహిత నీటిని అందించే ఈ ప్లాంట్‌ను అందరు వినియోగించాలని సూచించారు. అక్కడినుంచి మందోళ్లగూడెం వెళ్తుండగా …

సబ్‌ కలెక్టర్‌గా దివ్యను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

నల్గొండ: భూవనగిరి సబ్‌ కలెక్టర్‌గా దివ్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డీవోగా పనిచేస్తున్న ముత్యంరెడ్డికి పోస్టింగ్‌ ఇవ్వకుండా ప్రభుత్వానికి రిపోర్ట్‌ చేయాల్సిందిగా అందులో పేర్కొంది. …

ఈనెల 3న మరమగ్గాల కార్మికుల నిరసనగా

నల్గొండ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారుల దాడులు విద్యుత్‌ కోతలకు నిరసనగా మరమగ్గాల కార్మికులు ఈనెల 3న కలెక్టరెట్‌ ముందు నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని సంఘం పిలుపునిచ్చింది.

డీఎస్సీ పరీక్షా రాస్తున్న అభ్యర్థి గుండెపోటుతో మృతి

నల్గొండ: భువనగిరి డీఎస్సీ పరీక్షా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పరీక్ష రాస్తున్న ఓ అభ్యర్థి గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు యాదగిరిగుట్టకు చెందిన సంతోష్‌గా గుర్తించారు.

విషజ్వరాలతో 40మందికి అస్వస్థత-గ్రామంలోనే వైద్యశిభిరం

నల్గొండ: దామచర్ల మండలంలో రాజగుట్ట గ్రామంలో విషజ్వరాలు ప్రభలినావి 40మందికి విషజ్వరాలు సోకాయి. దీంతో గ్రామంలోనే వైద్యశిభిరం ఏర్పాటు చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ బలంగా ఉంది: నారాయణ

నల్గొండ: ప్రత్యేక తెలంగాణ నినాదం కారణంగా సీపీఐ బలహీనపడిపోయిందన్న వాదనలో పసలేదని. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలంగా ఉందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ అన్నారు. తెలంగాణతోపాటు …