Main

ప్రజావాణి ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలి -సి.పి.ఓ. వెంకటరమణ

ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులను జాప్యం లేకుండా పరిష్కరించాలని సీనియర్ జిల్లా అధికారి, సి.పి.ఓ. వెంకటరమణ, జిల్లా అధికారులకు సూచించారు.  సోమవారం ఐ.డి. ఓ.సి. ప్రజావాణి …

నేడు చేర్యాలకు మంత్రి హరీష్ రావు రాక..

చేర్యాల (జనంసాక్షి) జూన్ 06 : సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని ముస్త్యాల, కొమురవేల్లి మండలం మర్రిముచ్చాల గ్రామాలలో నేడు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ …

ఈనెల 6 ,13 తేదీలలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడదు లింగాల ఘణపురం, జూన్04(జనంసాక్షి):

ఈనెల 6, 13తేదీ లలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య తెలియజేశారు.మూడో తేదీ నుండి 18వ తేదీ వరకు ఐదో విడత …

42 వ డివిజన్లో 2వ రోజు పట్టణ ప్రగతి

వరంగల్ ఈస్ట్, జూన్ 4 (జనం సాక్షి)               పట్టణప్రగతి 4వ విడత కార్యక్రమంలో భాగంగా శనివారం రోజున …

66 వ డివిజన్ లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేయర్, కమిషనర్ కు విజ్ఞప్తి చేసిన కార్పోరేటర్ గురుమూర్తి శివకుమార్

హసన్ పర్తి (జనంసాక్షి) 2/6/2022: హసన్ పర్తి  66 వ డివిజన్ లో నాలుగో విడత పట్టణ ప్రగతి లో భాగంగా గ్రామంలోని పలు సమస్యలు తెలుసుకొని …

వరంగల్ డిక్లరేషన్ తో ప్రత్యర్థి పార్టీలకు గుబులు .పొన్నాల హాట్ కామెంట్స్

జనగామ (జనం సాక్షి ) మే3: జనగామ నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమంలో భాగంగా జనగామ మండలలోని వడ్లకొండ అడవికేశపురం వెంకీర్యాల గానుపహాడ్ పెద్దపహాడ్ గోపిరాజుపల్లి గ్రామంలో జనగామ …

ఉత్తమ అవార్డు పొందిన ఉద్యోగి…. 

మహిళా, పిల్లల, దివ్యాoగుల మరియు వయో వృద్దుల సంక్షేమ శాఖ, వరంగల్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లోని విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ ఆర్. ఇంద్ర సేనా రెడ్డికి …

*ఈరోజు తెలంగాణ 8 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎల్కతుర్తి మండల కేంద్రం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు పతాక ఆవిష్కరణ చేసిన ఎంపీపీ మేకల …

వరంగల్ బ్యూరో: జూన్ 2 (జనం సాక్షి) రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరులకు నివాళులర్పించి, వరంగల్ కోట లో జాతీయ జెండాను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. గురువారం వరంగల్ జిల్లాలోని ఖిలా వరంగల్ ని ఖుష్ మహల్ లో పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలనుద్దేశించి మాట్లాడారు.రాష్ట్ర అవతరణ వేడుకలకు విచ్చేసిన అమర వీరుల‌ కుటుంబాలకు, స్వాంతంత్య్ర సమరయోధులకు, తెలంగాణ పోరాట యోధులకు, ప్రజా ప్రతినిధులకు, పుర ప్రముఖులకు, అధికారులకు, పాత్రికేయులకు, జిల్లా ప్రజలకు మరియు విద్యార్థినీ విద్యార్థులకు నా హృద‌య పూర్వక శుభాకాంక్షలు తెలిపిన నారు.రాష్ట్ర అవ‌త‌ర‌ణ కోసం ప్రాణాలు అర్పించిన అమ‌రుల‌కు పుష్పాంజ‌లి ఘ‌టిస్తున్నాను. నీళ్ళు, నిధులు, నియామ‌కాలు నిజ‌మ‌వుతున్న ఈ సంద‌ర్భం వారికి నిజ‌మైన నివాళిగా భావిస్తున్నానని అన్నారు. తెలంగాణ ప్రజల 60 ఏండ్ల క‌ల‌… క‌ల్వకుంట్ల చంద్రశేఖ‌ర్ రావు నాయ‌క‌త్వం… స‌క‌ల జ‌నుల, 14 ఏండ్ల శాంతియుత పోరాటం ద్వారా తెలంగాణ సాధించుకున్నాం. ఉద్యమ నేతే సీఎం కావ‌డం రాష్ట్రానికి వ‌రంగా మారింది. మ‌నం ముందుచూపుతో దేశంలో ఎక్కడా లేని అద్భుత ప‌థ‌కాల‌ను రూపొందించి అమ‌లు చేస్తున్నాం. తెలంగాణ‌కు ఉజ్వల భ‌విష్యత్తు ఉండే విధంగా చేప‌ట్టిన ప్రణాళిక‌ల‌న్నీ మంచి ఫ‌లితాలిస్తున్నాయి. ఈ రోజు తెలంగాణ సాధిస్తున్న విజ‌యాల‌న్నీ తెలంగాణ బిడ్డలుగా మ‌నంద‌రికీ గ‌ర్వకార‌ణం మని తెలిపారు. 75 ఏండ్ల స్వాతంత్య్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి కేవ‌లం 8 ఏండ్లు! ఈ అన‌తి కాలంలోనే సిఎం కెసిఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ… అద్భుత విజ‌యాలు సాధించి0ద‌ని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. దేశంలో ఏ రాష్ట్రం ఊహ‌కు కూడా అంద‌ని ఆద‌ర్శవంత‌మైన ప‌థ‌కాల అమ‌లుతో, తెలంగాణ అగ్రగామిగా ఉంది. అనేక రంగాల్లో మ‌న రాష్ట్రానికి వ‌స్తున్న అవార్డులే ఇందుకు నిద‌ర్శనం. రాష్ట్రంలో స‌మ‌గ్ర అభివృద్ధి, సక‌ల జ‌నుల సంక్షేమం, సంతోషం ల‌క్ష్యంగా స‌మ‌ర్థవంతంగా ప‌రిపాల‌న సాగుతున్నది. సంప‌ద పెంచు, అంద‌రికీ పంచు అనే ప‌ద్ధతిలో మాన‌వీయ కోణంలో స‌మాన‌త్వం పాటిస్తూ, సామాజిక న్యాయం సాధిస్తూ సుప‌రిపాల‌న జ‌రుగుతున్నదని ఇన్చార్జ్ మంత్రి ప్రకటించారు. ఈ సువిశాల‌, సుప‌రిపాల‌న‌లో భాగ‌మైన‌ వ‌రంగ‌ల్ జిల్లా సమగ్ర అభ్యున్నతికి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పురోగ‌తిని ఈ సందర్బంగా మీ ముందుంచ‌డాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. విద్య ప్రైవేట్ కు దీటుగా, ప్రభుత్వ పాఠ‌శాల‌ల‌ను తీర్చి దిద్దడం ప్రభుత్వ ధ్యేయం. నిరుపేద విద్యార్దులకు నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం ‘‘మన ఊరు – మన బడి ’’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 3 ఏళ్ళల్లో 3 విడ‌త‌ల్లో జిల్లాలోని 645 ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో మౌలిక సదుపాయాల అభివృద్ది జ‌రుగుతున్నది. మొదటి విడతలో అత్యధిక నమోదు ఆదారంగా 223 పాఠశాలలను అభివృద్ధి ప‌రుస్తున్నాం. బాలికా విద్యను బలోపేతం చేసేందుకు జిల్లాలో 10 కె.జి.బి.వి లను నిర్వహిస్తున్నాం. జిల్లాలో 3 కె.జి.బి.వి లలో ఇంటర్‌ విద్యను ప్రవేశపెట్టాం. వ‌చ్చే విద్యా సంవత్సరంలో ఖానాపూర్‌, సంగెం కె.జి.బి.వి లలో ఇంటర్‌ విద్యను ప్రవేశ పెడుతున్నాం. వైద్య, ఆరోగ్యం వైద్య, ఆరోగ్యం పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. కోవిడ్‌ నియంత్రణ కొరకు డాక్టర్లు, సిబ్బంది రాత్రింబ‌వ‌ళ్ళు క‌ష్ట ప‌డ్డారు. గౌరవ సిఎం గారి ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే చేసి, హోమ్‌ ఐసోలేషన్‌ కిట్స్‌ అందించాం. కోవిడ్‌ వాక్సినేషన్ లో జిల్లాలో మొదటి డోసు 100 శాతం, 02వ డోసు 96 శాతం, 15 నుండి 18 సంవత్సరాల పిల్లలకు 88 శాతం పూర్తి చేశాం. 302 గ్రామాలు, ఆవాసాల‌లో 100 శాతం వాక్సినేషన్‌ పూర్తి అయింది. ఇక 53 పల్లె దవాఖానాలలో డాక్టర్లను నియమించాం. టెలీ, వీడియో క‌న్సల్టెన్సీ ద్వారా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తూ, ఇప్పటి వ‌ర‌కు 4 వేల 215 మంది పేషెంట్లకు చికిత్సలు, ఆరోగ్య సలహాలు, సూచనలు అందించడం జరిగింది. జిల్లాలో 52 ఆరోగ్య ఉపకేంద్రాల భవన నిర్మాణం కోసం ఒక్కో ఉపకేంద్రానికి 16 లక్షల చొప్పున నిధులు మంజూరీ అయి పనులు ప్రారంభమైనవి. 6వేల 698 ప్రసవాలు ప్రభుత్వ ద‌వాఖానాలలో 5వేల 105 ప్రైవేటు ద‌వాఖానాలలో మొత్తం 11వేల 803 ప్రస‌వాలు జరిగినవి. ఇందులో 7వేల 345 మందికి కేసిఆర్‌ కిట్లు పంపిణీ చేశాం. ఎం.జి.ఎం. హాస్పిట‌ల్‌ చ‌రిత్రలో ఎన్నడూ లేని విధంగా వ‌రంగ‌ల్ ఎంజిఎంకి బ‌డ్జెట్ లోనే 100 కోట్లు కేటాయించిన ఘ‌నత‌ తెలంగాణ ప్రభుత్వానిది. కేవ‌లం గ‌త రెండేండ్లలోనే ఎంజిఎం కు 150 కోట్లు ఖ‌ర్చు చేశాం. 15వంద‌లకు ప‌డ‌క‌ల‌ను పెంచినం. ప్రపంచ స్థాయి సూప‌ర్ స్పెషాలిటీ వైద్య సేవ‌ల‌ను అందించడానికి 11 వంద‌ల కోట్లతో 24 అంత‌స్తులు, 2వేల పడకలతో కొత్త సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ నిర్మాణంలో ఉంది. ఇప్పటి వరకు ఎం.జి.ఎం.లో 300 యాంజియో టెస్ట్ లు నిర్వహించి, స్టంట్లు వేశారు. 65 మోకాళ్ళ కీళ్ళ మార్పిడి ఆప‌రేష‌న్లు చేశారు. 10 కోట్లతో ఎం. ఆర్.ఐ., 2 కోట్లతో కొత్త సిటీస్కాన్‌ మిషన్ ఏర్పాటైంది. కొత్త ఎక్స్ రే, ఆల్ట్రాసౌండ్‌ మిషన్ ను ఏర్పాటు చేశాం. మిష‌న్ హాస్పిట‌ల్ లో 67 ల‌క్షల‌తో మిల్క్ బ్యాంక్‌, 33 ల‌క్షల‌తో బ్లడ్ బ్యాంక్ ప్రారంభ‌మ‌య్యాయి. వరంగల్ ఎంజిఎంకి అనుబంధంగా పి.ఎం.ఎస్.ఎస్‌.వై సూపర్‌ స్పెషాలిటీ హాస్పిట‌ల్ లో 24 గంట‌ల సూపర్‌ స్సెషాలిటీ సేవలు అందుబాటులోకి తెచ్చినాం. వ్యవసాయం సిఎం కేసిఆర్ స్వయంగా రైతు. తెలంగాణ ఏర్పడిన నాటి నుండే రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేప‌ట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుల‌కు రుణ‌మాఫీ, సకాలంలో అందుబాటులో ఎరువులు, విత్తనాలు, క‌ల్తీ నివార‌ణ‌, స‌మృద్ధిగా సాగునీరు, 24 గంట‌ల నాణ్యమైన క‌రెంటు ఇచ్చారు. రైతు బంధు ద్వారా ఎక‌రాకు ఏడాదికి 10వేల పంట‌ల పెట్టుబ‌డి ప్రభుత్వమే ఇస్తున్నది. రైతుబంధు ద్వారా జిల్లాలో 2021-22 ఏడాది వానాకాలానికి 1 ల‌క్షా 38వేల 306 మంది రైతులకు 133 కోట్ల 8 ల‌క్షల రూపాయలను మరియు 2021-22 యాసంగికి 1 ల‌క్షా 42 వేల 15 మంది రైతులకు 133 కోట్ల 71 ల‌క్షల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లో జమచేశాం. రైతు బీమా రైతు ఏ కార‌ణం చేత‌ మ‌ర‌ణించినా, వారం రోజుల్లోనే ఇంటికి 5ల‌క్షల బీమా చెక్కును అంద‌చేస్తున్నం. ఈ విధంగా 2021-22 ఏడాదికి 306 మంది రైతు కుటుంబాలకు మొత్తం 15 కోట్ల 30 ల‌క్షల రూపాయలను అంద చేశాం. రైతు వేదిక‌లు రైతులు సంఘటితంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి నూతన వ్యవసాయ పద్ధతులు, పంట‌ల మార్పిడి, మార్కెటింగ్‌ వంటి అంశాలు చర్చించుకోవ‌డానికి వీలుగా జిల్లాలో 12 కోట్ల 98 ల‌క్షల‌తో 59 రైతు వేదిక‌లు నిర్మించాం. ఉద్యానవనం జిల్లాలో 2022-23 ఏడాదిలో 9వేల 231 ఎకరాలలో పామాయిల్‌ తోటలు పెంచాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నాం. సంగెం మండలం రామచంద్రాపురంలో నర్సరీ ద్వారా మొక్కలు పెంచుతున్నారు. ఇప్పటి వరకు 12వేల 6 ఎకరాలకు లబ్ధిదారుల ఎంపిక జరిగింది. బిందు సేద్యం పరికరాల కొరకు క్షేత్ర పరిశీలన జరగుతున్నది. ఇప్పటి వరకు 1 వెయ్యి 100 మంది రైతులకు ఖమ్మం జిల్లాలో శిక్షణ ఇవ్వడం జరిగింది. పామాయిల్ ప‌రిశ్రమ‌లు కూడా జిల్లాకు వ‌స్తున్నాయి.చ నీటి పారుద‌ల‌ ప్రపంచ మాన‌వ నిర్మిత అద్భుతం కాళేశ్వరం ప్రాజెక్టు. కేసిఆర్ గారిని అప్పటి గ‌వ‌ర్నర్, కాళేశ్వరం చంద్రశేఖ‌ర్ రావు అని పిలిచేవారు. కాళేశ్వరం నీరు తెలంగాణ ప్రజ‌ల కాళ్ళు క‌డుగుతున్నాయి. వరంగల్‌ జిల్లా పరిధిలో చిన్ననీటి పారుదలశాఖ ద్వారా 1 వెయ్యి 106 చెరువుల క్రింద 85వేల 208 ఎకరాలకు సాగునీరు అందుతున్నది. శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్ట్‌ మొదటి, రెండవ దశ ద్వారా 1ల‌క్షా 42 వేల 543 ఎకరాలకు వానాకాలంలో సాగు నీరు అందుతున్నది. పాకాల చెరువు కింద ఈ వానా కాలంలో 18వేల 193 ఎకరాలు, యాసంగిలో 3వేల 515 ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నాం. దేవాదుల ప్రాజెక్ట్ కింద‌ 55వేల 706 ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వడ‌మేగాక‌, చెరువులు నింపుతున్నాం. నర్సంపేట నియోజక వర్గంలోని 4 లిఫ్ట్ ఇరిగేషన్‌ స్కీమ్‌ల కింద 1 వెయ్యి 418 ఎకరాల ఆయకట్టు ఉంది. మిష‌న్ కాక‌తీయ‌ జిల్లాలో 4 ద‌శ‌ల్లో 250 కోట్లతో 745 చెరువుల‌ను మ‌ర‌మ్మతులు చేశాం. కాళేశ్వరం నీటితో ఆ చెరువుల‌ను నింపుతున్నం. వీటి ద్వారా భూగ‌ర్భ జ‌లాలు పెరిగి, వ్యవ‌సాయానికి తోడ్పడుతున్నాయి. ధరణి రెవెన్యూ వ్యవస్థలో స‌మూల మార్పులు తెస్తూ, ప‌క్కా, పారదర్శకతతో ధరణి పోర్టల్‌ను ప్రారంభించింది. దళారుల దందాకు చెక్ పెడుతూ, నేరుగా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేస్తున్నది. వరంగల్‌ జిల్లాలో ఇప్పటి వరకు 12 వేల 984 రిజిస్ట్రేషన్లు మరియు 7 వేల 66 ఇతర సమస్యలను పరిష్కరిండం జరిగింది. మిష‌న్ భ‌గీర‌థ‌ సిఎం కేసిఆర్ గారి విజ‌య‌వంత‌మైన అప‌ర భ‌గీర‌థ ప్రయ‌త్నమే మిష‌న్ భ‌గీర‌థ‌. జిల్లాలో 173 కోట్ల 69ల‌క్షల 37 వేల ఖ‌ర్చుతో 11 మండ‌లాల్లో, 708 ఆవాసాలకు ఇంటింటికీ న‌ల్లాల ద్వారా శుద్ధి చేసిన‌ గోదావ‌రి మంచినీటిని అందిస్తున్నాం. విద్యుత్‌ రాష్ట్రంలో విద్యుత్ వెలుగులు విర‌జిమ్ముతున్నాయి. తెలంగాణ‌ వ‌స్తే అంధ‌కారం అవుతుంద‌న్న వాళ్ళే చీక‌ట్లోకి పోయారు. కానీ సీఎం కేసిఆర్ గారి నిరంత‌ర కృషి ఫ‌లితంగా దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా 24 గంట‌లపాటు కోత‌లు లేని నాణ్యమైన క‌రెంటుని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ‌. జిల్లాలో 64 వేల 524 వ్యవసాయ బావులకు, ప‌రిశ్రమ‌ల‌కు, ఇండ్లకు క‌రెంటు అందిస్తున్నం. ఇప్పటి వరకు 413 ఉచిత విద్యుత్‌ వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చాం. మొత్తం 19వేల 730 సర్వీసులు ఇచ్చాం. కొత్తగా 23 ట్రాన్స్‌ ఫార్మర్లు ఏర్పాటు చేశాం. టి.ఎస్‌. ఐ పాస్ ద్వారా 25 పరిశ్రమలకు, 291 ఎల్‌.టి. పరిశ్రమలకు క‌నెక్షన్లు ఇచ్చాం. జిల్లాలోని మొత్తం దోభీ ఘాట్లకు, సెలూన్లకు 250 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందుతున్నది. ఎస్‌.సి., ఎస్‌.టి వినియోగదారుల విద్యుత్‌ చార్జీలు ప్రభుత్వమే భరిస్తున్నది. వరంగల్‌ జిల్లాలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 19 కోట్ల 9 లక్షల వ్యయంతో 2 వేల 150 తుప్పు పట్టిన ఇనుప స్తంభాల స్థానంలో కొత్తవి వేశాం. పల్లె ప్రగతి గ్రామాల స‌మ‌గ్ర అభివృద్ధితోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి సాధ్యమవుతుందని దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లె ప్రగతి అనే వినూత్న గ్రామీణ వికాస‌ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ప్రారంభించారు. ప‌ల్లె ప్రగ‌తిలో భాగంగా, మొత్తం 323 గ్రామ పంచాయితీలలో 923 కి.మీ మేర రోడ్లను, 351 కి.మీ మేర మురుగు నీటి కాలువ‌లను నిర్మించాం. జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు, ద‌వాఖానాలు, మార్కెట్‌ వంటి ప్రభుత్వ భవనాలను శుభ్రపరచడంతో పాటు శానిటేషన్‌ కార్యక్రమం కూడా చేపట్టాం. ప్రతీ శుక్రవారం అన్ని గ్రామాలలో ‘‘డ్రై డే’’ ను నిర్వహిస్తున్నాం. అలాగే, జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయ‌తీకి ట్రాక్టర్‌, ట్రాలీ, ట్యాంకర్లను కొనుగోలు చేశాం. వీటి ద్వారా గ్రామాల్లో ఇండ్లల్లో సేకరించిన చెత్తను డంపింగ్‌ యార్డుకు తరలిస్తున్నాం. త‌డి పొడి చెత్తను వేరు చేసి, కంపోస్టు ఎరువు త‌యారు చేసి పంచాయ‌తీలు ఆదాయాన్ని పొందుతున్నాయి. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు ట్యాంకర్‌ ద్వారా నీరుపోసి, గ్రామ పంచాయ‌తీలు ఆదాయం పొందుతున్నాయి. అన్ని గ్రామాలలో వైకుంఠ ధామాల‌ను నిర్మించి వాడుక‌లోకి తెచ్చాం. జిల్లాలో అన్ని గ్రామాల్లో నర్సరీలు ఏర్పాటు చేసి 41 ల‌క్షల 3 వేల‌ మొక్కలను పెంచాం. జిల్లాలో 323 గ్రామ పంచాయితీలలోని, ఆవాసాలలో 576 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి 5ల‌క్షల 36వేల 35 మొక్కలను పెంచుతున్నం. 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రతీ మండలంలో బృహాత్‌ పల్లెప్రకృతి వనం ఏర్పాటుకు సంక‌ల్పించి, 9 మండలాలలో భూమి గుర్తింపు పూర్తి చేశాం. అదేవిధంగా 5 ఎకరాల విస్తీర్ణంలో ప్రతీ మండలంలో 4 బృహాత్‌ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయదలచి మొత్తం 44 వనాలలో 33 వనాలకు భూమి గుర్తింపు పూర్తి అయింది. 2021-22 సంవత్సరానికి విడుదలైన 59 కోట్ల 78 ల‌క్షల రూపాయ‌ల‌ నిధులతో 10శాతం అనగా 4 కోట్ల 9ల‌క్షల రూపాయ‌ల‌ను గ్రీన్‌ బడ్జెట్ గా కేటాయించాం. గీసుకొండ మండలంలో మరియాపురం గ్రామ పంచాయితీకి జాతీయ అవార్డు వ‌చ్చింది. పట్టణ ప్రగతి భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఎదిగేందుకు వీలుగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇందులో భాగంగా వ‌రంగ‌ల్ మహానగర వ్యాప్తంగా పట్టణ ప్రగతిలో మొదటి విడతలో 22 క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసినాం. తెలంగాణకు హరితహారంలో భాగంగా ప్రతీ వార్డులో నర్సరీ ఉండాలని బల్దియా పరిధిలో ప్రస్తుతమున్న 6 నర్సరీలకు తోడుగా మరో 23 చోట్ల నర్సరీలు ఏర్పాటు చేయనైనది. ప్రస్తుతం ఉన్న 12 పట్టణ ప్రగతి వనాలకు తోడుగా మరో 36 చోట్ల పట్టణ ప్రగతి వనాలు ఏర్పాటు చేయనైనది. జిల్లాలో నర్సంపేట మరియు వర్దన్నపేట మున్సిపాలిటీలలో 36 వార్డులకు గాను, 13 ట్రీ పార్కులు ఏర్పాటు చేయ‌డానికి భూమిని గుర్తించనైనది. 11 నర్సరీలు ఏర్పాటు చేసి 2 ల‌క్షల 63 వేల‌ మొక్కలు పెంచడమైనది. 12 వైకుంఠ ధామాలకు గాను, నర్సంపేటలో ఒకటి పూర్తి చేశాం. 7 పురోగతిలో ఉన్నాయి. వర్దన్నపేటలో 04 పురోగతిలో ఉన్నాయి. హరిత హారం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరిత హారం కార్యక్రమాన్ని ప్రారంభించి 7వ విడతలో వరంగల్‌ జిల్లాలో 27ల‌క్షల 83వేల మొక్కలను నాటడం జరిగింది. అందులో 98శాతం మొక్కలను బ‌తికిస్తున్నాం. 7.7 శాతం పచ్చదనం పెరిగినట్టు ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా వెల్లడించింది. హరితహారం ద్వారా 9 లక్షల 65 వేల ఎకరాల విస్తీర్ణంలో అడవుల పునరుద్ధరణ జరిగింది. జిల్లా గ్రామీణ అభివృద్ధి ఉపాధి హామీ ద్వారా 2022-23 ఏడాదిలో ఇప్పటి వరకు 1 ల‌క్షా 23 వేల 545 మంది కూలీలకు, 8 లక్షల పనిదినాలు కల్పించాం. 9 కోట్ల 77 లక్షల రూపాయలను వేతనంగా ఇచ్చాం. 5 కోట్ల 40 ల‌క్షల‌ రూపాయలను ఇంకుడు గుంతలు, పశువుల కొట్టాలు, కూరగాయ పందిర్లు, గ్రామపంచాయితీ సి. సి రోడ్ల నిర్మాణం, డంపింగ్‌ యార్డులు, వైకుంఠ ధామాలు, ఇతర పనుల కొరకు ఖర్చు చేయనైనది. జిల్లాలో ఇజిఎంఎం ఉన్నతి కింద‌ ఇప్పటివరకు 487 మంది యువతకు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించాం. పంచాయ‌తీరాజ్‌ సిఆర్ఆర్ గ్రాంటు కింద 37 కోట్ల 17 ల‌క్షల‌తో 42 రోడ్లు చేప‌ట్టాం. ఎం.ఆర్‌.ఆర్ కింద 39 కోట్ల 22 ల‌క్షల‌తో 57 రోడ్లు చేప‌ట్టాం. 3 కోట్ల 20 ల‌క్షల‌తో 16 గ్రామ పంచాయ‌తీ భ‌వ‌నాలు నిర్మిస్తున్నం. 10 కోట్ల 54 ల‌క్షల‌తో 75 మెట‌ల్ రోడ్లు, 2 కోట్లతో 39 డ్రైన్లు చేప‌ట్టినం. పిఎంజిఎస్‌వై లో 69కోట్లతో 15 రోడ్లు, 10 కోట్లతో 3 కొత్త బ్రిడ్జీలు చేప‌ట్టాం. క్రీడా ప్రాంగ‌ణాలు అంత‌రించి పోతున్న గ్రామీణ క్రీడల‌ను ప్రోత్సహించ‌డానికి ప్రభుత్వం, క్రీడా ప్రాంగ‌ణాల‌ను నిర్మిస్తున్నది. వరంగల్‌ జిల్లాలోని గ్రామాల్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించ‌నైన‌ది. ఇందులో ఇప్పటికే 20 గ్రామీణ క్రీడాప్రాంగణాలు ప‌నులు పూర్తై, ప్రారంభానికి సిద్దంగా ఉన్నాయి. రోడ్లు భవనాలు అద్దంలా రోడ్లు, ప‌క్కాగా ప్రభుత్వ భ‌వ‌నాలు ప్రభుత్వ ల‌క్ష్యం. డి.ఎం.ఎఫ్‌.టి పధకం క్రింద 21 రహాదారుల నిర్మాణం, నిర్వహణ కోసం 31 కోట్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు 18 రోడ్లు పూర్తి అయినవి. మిగతావి పురోగతిలో ఉన్నాయి. ఆకేరు వాగు పై వర్దన్నపేట మండలం కట్య్రాల నుండి కొత్తపల్లి వరకు 15 కోట్ల రూపాయలతో, జగన్‌తాండా నుండి ల్యాబ‌ర్తి వరకు 18 కోట్ల రూపాయలుతో చేపట్టిన వంతెన నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఎక్సైజ్ 2021-22 ఏడాదికి 5 వంద‌ల 99 కోట్ల రూపాయలు మద్యం అమ్మకాలు మరియు లైసెన్స్‌ ఫీజుల ద్వారా ప్రభుత్వానికి రెవిన్యూగా సమకూరింది. 59 మంది కల్లు గీత కార్మికుల కుటుంబాలకు 89 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చినాం. చేప‌ల పంపిణీ 2021-22 ఏడాదికి ప్రభుత్వం 404 చెరువులు, 2 రిజర్వాయర్లలో 1 కోటి 16 లక్షల చేప పిల్లలను వేసింది. ప్రస్తుత ఏడాది 9వేల 223 టన్నుల చేపలు, 487 టన్నుల రొయ్యల టార్గెట్‌ కాగా, ఇప్పటి వ‌ర‌కు 9వేల 215 టన్నుల చేపలు, 341 టన్నుల రొయ్యల ఉత్పత్తి సాదించాం. దీని ద్వారా జిల్లాలో గల 11వేల 73 మంది మత్స్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులు ఒక్కొక్కరికి సగటున 40వేల‌ రూపాయల వార్షిక ఆదాయం సమకూరింది. మత్స్య కారుల సామూహిక బీమా పథ‌కం కింద ప్రమాద వశాత్తు చనిపోయిన 3 కుటుంబాలకు 5 లక్షల చొప్పున చెక్కులు అంద‌చేశాం. పశు సంవర్దకం కుల వృత్తులను కాపాడుకొనే క్రమంలో గొల్ల, కురుమ, యాదవ కుటుంబాల వారికి 75 శాతం సబ్సిడీపై వరంగల్‌ జిల్లా పరిధిలో ఇప్పటి వరకు 10వేల 207 మంది లబ్దిదారులకు 95 కోట్ల 69 ల‌క్షల రూపాయల సబ్సిడీపై గొర్రెల యూనిట్లు ఇవ్వడమైంది. పాడిపశువుల పంపిణీ పథ‌కం ద్వారా ఇప్పటివరకు 1వెయ్యి 59 మంది లబ్దిదారులకు 5 కోట్ల 14 ల‌క్షల రూపాయలు సబ్సిడీపై పాడిపశువుల యూనిట్లు ఇవ్వడమైనది. పౌర సరఫరాలు 2ల‌క్షల 67వేల 168 నిరుపేద కుటుంబాలకు రూపాయికి కిలో బియ్యం సరఫరా చేస్తున్నాం. జిల్లాలోని 31 సంక్షేమ హాస్టళ్ళకు 388 క్వింటాళ్ళు, 70 ప్రభుత్వ పాఠశాలలకు ప్రతీ నెల మధ్యాహ్న భోజన పధకం క్రింద 531 మెట్రిక్‌ టన్నులు 919 టన్నుల నాణ్యమైన సన్న బియ్యం అందించ‌డం ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. ధాన్యం సేక‌ర‌ణ‌ ధాన్యం సేకరణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 2021-22 యాసంగిలో జిల్లాలో ఇప్పటి వరకు 11వేల 920 మంది రైతుల నుండి 51వేల 954 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. 2వేల 442 మంది రైతులకు ఆన్‌లైన్‌ ద్వారా 20 కోట్ల 72 ల‌క్షల‌ రూపాయలను చెల్లించాం. స్త్రీ శిశు సంక్షేమం జిల్లాలోని 3 ఐ.సి.డి.ఎస్‌ ప్రాజెక్ట్‌లలోని 919 అంగన్‌ వాడీ కేంద్రాల ద్వారా 5వేల 812 మంది గర్బిణీలు, 5వేల 708 మంది బాలింతలు, 25 వేల 696 మంది 7 నెలల నుండి 3 ఏండ్ల పిల్లలు, 11వేల 675 మంది 3 ఏండ్ల నుండి 6 ఏండ్ల పిల్లలు లబ్ధి పొందుతున్నారు. ఆసరా పెన్షన్లు ఏ ఆస‌రా లేని నిరుపేద‌ల‌కు ప్రభుత్వమే ఆస‌రా అవుతున్నది. గ్రామీణ పేదరిక నిర్మూలణా పథ‌కం ద్వారా జిల్లాలో ప్రతి నెలా 1 ల‌క్షా 2 వేల 441 మందికి పెన్షన్‌లు ఇస్తున్నాం. ఇందులో 33వేల 497 వృద్ధుల‌కు, 2 వేల 76 చేనేత, 14 వేల 111 దివ్యాంగుల, 41వేల 769 వితంతు, 2వేల 586 కల్లు గీత, 5వేల 595 బీడి కార్మికుల, 2వేల 807 ఒంటరి మహిళల‌ పెన్షన్‌లు ఉన్నాయి. పెన్షన్లలో 69శాతం మ‌హిళ‌ల‌కే ఇస్తున్నాం. ఇక దేశంలో మ‌రే రాష్ట్రంలో లేని విధంగా దివ్యాంగుల‌కు 3వేల 16, మిగ‌తా వాళ్ళకి 2వేల 16 అందిస్తున్న రాష్ట్రం కూడా మ‌న‌దే. మ‌హిళా స్వయం స‌హాయ‌క సంఘాలు 2021-22 ఏడాదిలో బ్యాంకు లింకేజీ ద్వారా 6 వేల 910 డ్వాక్రా సంఘాలకు 381 కోట్ల 87 ల‌క్షల రూపాయలు అంద‌చేశాం. స్త్రీ నిధి బ్యాంకు ద్వారా 84 కోట్ల 24 ల‌క్షల రూపాయ‌ల ఋణాలను 11వేల 746 సంఘాలలోని సభ్యులకి అందించడం జరిగింది. డబుల్ బెడ్ రూం ఇండ్లు జిల్లాలో ఇప్పటి వరకు 5వేల 191 ఇండ్లు మంజూరీ చేయగా, 2వేల 782 ఇండ్లు వివిధ దశలలో పురోగతిలో ఉన్నాయి. 726 ఇండ్లు పూర్తి అయ్యాయి. కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ నిరుపేద తల్లిదండ్రులు తమ బిడ్డల పెళ్ళిల్లు చేయడానికి అప్పుల పాలు కాకూడదన్న ఆలోచనతో మన సిఎం గారు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ పథకం ప్రవేశ పెట్టారు. కళ్యాణ లక్ష్మి ద్వారా ఇప్పటి వరకు జిల్లాలో 23వేల 702 కుటుంబాలకు, షాదీముబారక్‌ ద్వారా 2వేల 891 కుటుంబాలకు ఒక్కొక్కరికి 1ల‌క్షా 116వేల రూపాయల చొప్పున‌ అందించినం. బీసీ సంక్షేమం జిల్లాలో 11వేల 255 మంది బీసీ విద్యార్థుల‌కు 30కోట్ల 50 ల‌క్షల ఫీజు రియంబ‌ర్స్ మెంట్ అందిస్తున్నం. వివిధ హాస్టళ్ళ ద్వారా కాస్మొటిక్స్‌, బెడ్ షీట్స్‌, ప్రీ మెట్రిక్ స్కాల‌ర్ షిప్పులు అందిస్తున్నాం. ఎస్సీ సంక్షేమం ఎకనామిక్‌ సపోర్ట్‌ స్కీం లో భాగంగా అన్‌స్కిల్డ్‌ క్యాటగిరి క్రింద నిర్దేశించిన 137 యూనిట్లు, 3కోట్ల 77ల‌క్షల 93 వేల లక్ష్యానికి, మరియు స్కిల్డ్‌ క్యాటగిరి క్రింద నిర్దేశించిన 130 యూనిట్లు, 6 కోట్ల 58 ల‌క్షల 35 వేల ఆర్దిక ల‌క్ష్యానికి లబ్ధిదారుల ఎంపిక తుదిదశకు చేరింది. మినీ డెయిరీ పైలెట్‌ ప్రాజెక్ట్‌ క్రింద ఈ ఏడాదికి నల్లబెల్లి మండలంలో 74 యూనిట్లకు 20 కోట్ల 96 ల‌క్షలు మరియు నెక్కొండ మండలంలో 40 యూనిట్లకు 1కోటి 60 ల‌క్షలు మంజూరీ చేయబడినవి. ఎస్సీ అసెంబ్లీ నియోజకవర్గానికి స్పెషల్‌ ఎంపవర్‌మెంట్ పథ‌కం క్రింద జిల్లాలోని వర్దన్నపేట నియోజక వర్గానికి సంబంధించి పర్వతగిరి, వర్దన్నపేట మండలాలకు 100 యూనిట్ల చొప్పున కేటాయించడం జరిగింది. ఈ పథ‌కం ద్వారా ఒక్కో లబ్ధిదారుకి 2 పాడిగేదెలు పంపిణీకి 2 లక్షలు ఇవ్వబడును. ఇందులో ప్రభుత్వం 1 లక్షా 40 వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వనుంది. దళిత బంధు దళితులలో ఆర్థిక‌ సాధికారత కేసిఆర్ ల‌క్ష్యం. శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణచివేతకు గురి అవుతున్న దళితుల ఉద్ధరణ కోసం దేశ చ‌రిత్రలో ఏనాడూ ఎవ‌రూ చేయ‌ని విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారు ద‌ళిత బంధు ప్రవేశ పెట్టినారు. ల‌బ్ధిదారు త‌మకు ఇష్టమైన వ్యాపారాన్ని ఎంచుకునే అవ‌కాశం ఇచ్చాం. అప్పుగా కాకుండా, మిత్తీ లేకుండా పూర్తిగా ఉచితంగా 10ల‌క్షల రూపాయ‌ల‌ను ప్రభుత్వం ప్రతి ద‌ళిత కుటుంబానికి ఇస్తున్నది. చేసే వ్యాపారాల్లో న‌ష్టం వ‌స్తే కుంగిపోకుండా ఉండేందుకు 10వేల రూపాయ‌ల‌ను ర‌క్షణ నిధిగా ఏర్పాటు చేయ‌నైన‌ది. ఈ పధకం ద్వారా జిల్లాలో ఇప్పటి వ‌ర‌కు 301 దళిత కుటుంబాలు లబ్ది పొందాయి. కాగా వ‌చ్చే ఏడాది నియోజ‌క‌వ‌ర్గానికి 150 కోట్ల విలువైన 15 వందల యూనిట్లు ఇవ్వనున్నాం. మైనార్టి సంక్షేమం ప్రభుత్వమే ప్రజ‌ల పండుగ‌ల‌ను నిర్వహించే గొప్ప సంస్కృతిని సిఎం కేసిఆర్ ప్రవేశ పెట్టారు. క్రిష్టమస్‌ పండుగ సందర్బంగా జిల్లాలో 3,500 మంది పేద క్రిష్టియన్లకు బ‌ట్టలు పంపిణీ చేశాం. రంజాన్‌ పండుగ సందర్బంగా 6వేల‌ మంది పేద ముస్లింలకు బ‌ట్టలు పంపిణీ చేశాం. దివ్యాంగుల సంక్షేమం దివ్యాంగులను సకలాంగులు వివాహం చేసుకొన్న 14 జంటలకు ఒక్కొక్క జంట‌కు లక్ష రూపాయలు చొప్పున ప్రోత్సాహాక బహుమతుల‌ను ఇచ్చాం. అర్హులైన 32 మంది దివ్యాంగుల‌కి బ్యాటరీ స్కూటీ, వీల్‌చైర్స్‌, 4జి స్మార్ట్ ఫోన్‌, ల్యాప్‌టాప్‌లను అందించాం. గృహా హింస, లైంగిక వేధింపులు, వరకట్నపు వేధింపులు, అక్రమ రవాణ, అత్యాచారాలు, బాల్య వివాహాలు వంటి స‌మ‌స్యలను ఎదుర్కొంటున్న 510 మంది మహిళలను, బాలికలను ర‌క్షించి, సఖీ కేంద్రంలో సంర‌క్షిస్తున్నాం. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ వ‌రంగల్‌ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం కాక‌తీయ టెక్స్ టైల్ పార్క్ ని ప్రతిష్టాత్మకంగా స్థాపించింది. ఈ పార్క్ లో గణేష్‌ ఎకోటెక్‌, గణేష్‌ ఎకోపెట్‌, కైటెక్స్‌ ఇండియా మరియు యంగ్‌వన్‌ పరిశ్రమలను 2022 మే, 07వ తేదీన పురపాలక, ఐ.టి. శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. దాదాపు 4వేల 600 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15వేల మంది ఉపాధి పొందనున్నారు. రూర్బన్ శ్యాంప్రసాద్‌ ముఖర్జీ జాతీయ అర్బన్‌ మిషన్ పథ‌కంలో భాగంగా జిల్లాలోని పర్వతగిరి మండలాన్ని ఎంపిక చేశాం. 30 కోట్ల రూపాయ‌ల‌కు సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పటికే 29 కోట్ల 97లక్షల రూపాయలు విలువ గల 191 పనులను చేపట్టగా అవి పురోగ‌తిలో ఉన్నాయి. ప‌ర్యాట‌కం వ‌రంగ‌ల్ తెలంగాణ సాంస్కృతిక రాజ‌ధాని. ఇక్కడి క‌ట్టడాలు, గుళ్ళు, గోపురాలు, చెరువులు, అడ‌వులు అన్నీ విదేశీయుల‌ను సైతం ఆక‌ట్టుకునే ప‌ర్యాట‌క ప్రాంతాలే. ల‌క్నేప‌ల్లి గ్రామంలో పీవీ న‌ర్సింహారావు పేరుతో గ్రామీణ విజ్ఞాన ప‌ర్యాట‌క కేంద్రంగా తీర్చిదిద్దుతున్నం. కొమ్మాల శ్రీ ల‌క్ష్మీన‌ర్సింహ‌స్వామి గుడిని ప‌ర్యాట‌క కేంద్రంగా చేయడానికి పలు మౌలిక వసతులు అభివృద్ధి చేసినం. పాకాల, మాద‌న్నపేట చెరువులను ప‌ర్యాట‌క ప్రదేశాలుగా మారుస్తున్నం. వ‌రంగ‌ల్ లోని కాక‌తీయుల కోట‌, వేయి స్తంభాల గుడి వంటి ప్రాంతాల‌ను అభివృద్ధి ప‌రుస్తున్నం. వ‌రంగ‌ల్ పోచమ్మ మైదాన్ సెంట‌ర్ లో మ‌ల్టీ ప‌ర్పస్ కాంప్లెక్స్ ని హ‌రిత హాట‌ల్ గా నిర్మిస్తున్నాం. క్రీడ‌లు రాష్ట్రంలో ప్రభుత్వం క్రీడ‌ల‌ను, క్రీడాకారుల‌ను గ‌తంలో ఎన్నడూ లేని విధంగా ప్రోత్సహిస్తున్నది. నెల రోజుల క్రిత‌మే జిల్లాలోని వ‌రంగ‌ల్ ఓ సిటీ లో స్టేడియం, 10 మండలాలలో పలు క్రీడలపై సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌ నిర్వహించాం. నియోజకవర్గ అభివృద్ది నిధులు తెలంగాణ ప్రభుత్వం నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి నిధిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఇప్పటి వ‌ర‌కు ప్రతి ఏటా 3 కోట్లు ఇచ్చే నిధిని 5 కోట్లకు పెంచింది. జిల్లాలో ఇప్పటి వరకు ఈ పథ‌కం ద్వారా 8 కోట్ల 63 ల‌క్షల 99 వేల‌ రూపాయలు అంచనా వ్యయంతో 171 పనులు మంజూరయ్యాయి. ఈ ఏడాది ప్రత్యేకంగా 4 కోట్ల 50 లక్షల రూపాయలను మన ఊరు-మన బడి, మన‌ బస్తీ – మన బడి కార్యక్రమంలో భాగంగా ఎంపికైన ప్రభుత్వ బడులలో మౌలిక సదుపాయాల కల్పన కొరకు కేటాయించినం. ప‌రిపాల‌నా సౌల‌భ్యం కోసం మ‌న ప్రియ‌త‌మ సీఎం కెసిఆర్ గారు జిల్లాల‌ను చిన్నవిగా విభ‌జించారు. అందులో భాగంగా కొత్తగా ఏర్పడిన వ‌రంగ‌ల్ జిల్లా పూర్వ వైభ‌వాన్ని పొందుతున్నది. జిల్లా చ‌రిత్రను మ‌రింత గొప్పగా తీర్చిదిద్దేందుకు సిఎం కెసిఆర్ గారు, మంత్రి కెటిఆర్ గారు అండ‌గా నిలిచారు. త‌మ‌ అమూల్యమైన సలహాలు, సూచనలు అందిస్తూ జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న గౌర‌వ మేయరు, జ‌డ్పీ చైర్ ప‌ర్సన్‌, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, జిల్లా క‌లెక్టర్‌, న్యాయాధికారులకు, పాల‌నా యంత్రాంగానికి, స్వాతంత్య్ర స‌మ‌ర యోధులకు, తెలంగాణ పోరాట యోధుల‌కు, కవులకు, కళాకారులకు, స్వచ్ఛంద సంస్థల‌కు, జ‌ర్నలిస్టుల‌కు, జిల్లా ప్రజ‌ల‌కు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా… ఈ పర్వదినాన హృద‌య పూర్వక ధ‌న్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గోపి జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. Attachments area

కోదాడ జూన్ 2(జనం సాక్షి) నాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుచూపు ధోరణితో చేసిన అభివృద్ధి ఫలాలతోనే నేడు రాష్ట్రంలో టిఆర్ఎస్ …

ఖిలా వరంగల్లులో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు…. మంత్రి ఎర్రబెల్లి…

వరంగల్ బ్యూరో: జూన్ 2 (జనం సాక్షి) రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరులకు నివాళులర్పించి, వరంగల్ కోట లో జాతీయ జెండాను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి …