ఉరుసు రోడ్ లో కర్ర లారీ బోల్తా

వరంగల్ నగరంలోని బైపాస్ రోడ్డులో శుక్రవారం ఉదయం కర్ర లారీ బోల్తా పడిన సంఘటన చోటుచేసుకుంది . మట్టేవాడ ట్రాఫిక్ ఎస్ఐ డేవిడ్ తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ నుండి  బల్లార్ష వైపు వెళ్తున్న సుబాబుల్ కర్ర ఎదురుగా ఉన్న బైపాస్ రోడ్డుపై బోల్తా పడింది దీంతో లారీ లో ఉన్న కర్ర రోడ్డుపై పడిపోయింది. డ్రైవర్ సునీల్ మద్యం మత్తులో ఉండడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు ఎస్ఐ వివరించారు .అనంతరం ట్రాఫిక్కు ఇబ్బంది కలిగించకుండా ఉండేలా రోడ్డు మీద  పడిపోయిన కర్రను జెసిబి తో పక్కకు నెట్టి వేయించినట్లు తెలిపారు .ఈ కార్యక్రమంలో  ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు