ఎడిట్ పేజీ

తెలుగు రాష్ట్రాల్లో విద్వేష రాజకీయాలు

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు నేలవిడిచి సాము చేస్తున్నాయి. ప్రజలను పరిగణనలోకి తీసుకోకుండా వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు పెరిగాయి. వ్యూహాత్మకంగా ప్రధాన సమస్యలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు చేయడంలో టిఆర్‌ఎస్‌,టిడిపి, వైకాపా, జనసేన పార్టీలు సాగుతున్నాయి. జాతీయ పార్టీగా అధికారంలో ఉన్న బిజెపి కూడా ఇరు తెలుగు రాష్ట్రాల సమస్యల కన్నా అధికార పార్టీలను తిట్టడమే లక్ష్యంగా … వివరాలు

రాహుల్‌ది దగుల్బాజీ పథకం 

రాజకీయ పార్టీలకు ఈ దేశంలో ప్రజలు ఏ రకంగా కష్టాల నుంచి గట్టెక్కించాలో తెలియడం లేదు. వారిని చేష్టలుడిగి ఓటు యంత్రాలుగా మార్చే ప్రక్రియను మాత్రమే చేపడతున్నారు. ఈ దేశంలో అత్యధికంగా ఉన్న రైతులకు ఏం చేస్తే మేలు జరుగుతుందన్న విషయంలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ విషయంలో కాంగ్రెస్‌ అగ్రభాగాన ఉంది. దానికి దేశ సమస్యలపై … వివరాలు

ఢిల్లీపై జెండా ఎగరాలన్నదే ఎజెండా 

ఎన్నికల హీట్‌ పెరిగింది. ఓ వైపు ఎండాకాలం..మరోవైపు లోక్‌సభ ఎన్నికల కాలం ముంచుకొస్తోంది. అభ్యర్థుల ఎంపిక, ఆయారాం..గయారాంల కాలం నడుస్తోంది. ఇటువారు అటు..అటువారు ఇటు దూకుతున్నారు. పదవులే లక్ష్యంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రజల సమస్యలకన్నా పదవుల సమస్యే ముఖ్యంగా మారింది. అందుకే హీట్‌ మరింతగా పెరుగుతోంది. రాజకీయ నాయకులకు పదవులను మించిన సిద్దాంతాలు లేవు. పార్టీ … వివరాలు

కోనాయపల్లి…కరీంనగర్‌ సెంటిమెంట్‌ 

తెలంగాణ ఉద్యమ కోసం ప్రత్యర్థులను చిత్తు చేయడానికి కెసిఆర్‌ వేయని ఎత్తు లేదు. తెలంగాణ సాధన లక్ష్యంగా ఆయన చేసిన అనేక సాహసాలకు ప్రజలు జేజేలు కొట్టారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత కూడా అదే ఎత్తులతో అనేక పథకాలతో ఆయన 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చారు. తరవాత 2018లో కూడా అధికారం సాధించారు. అనేక పథకాలను … వివరాలు

విద్యార్థులు ఒత్తిడిని జయించాలి

ఇప్పుడంతా పరీక్షల సీజన్‌. పరీక్షలంటే విద్యార్థులు ఎవరికైనా  సహజంగానే భయంఉంటుంది. ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం కాగా, టెన్త్‌ మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానున్నాయి. జీవితానికి అతిముఖ్యమైన అంశంలో విజయం సాధించడానికీ, సమాయత్తం కావడానికీ ఈ పరీక్షలు ఎదుర్కోవడం ఒత్తిడి ఉండడం సహజం. ఒత్తిడిని పూర్తిగా తీసివేయడం కుదరదు. కానీ దాన్ని నియంత్రించుకోవచ్చు. ఒత్తిడిని జయించేం దుకు పాజిటివ్‌ … వివరాలు

ఎన్నికల సంఘం కఠినంగా ఉండాలి

తంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థగా ఉన్న ఎన్నికల సంఘం  ఈ మధ్య అనేక వివాదాల్లో చిక్కుకుంటోంది. విపరీతమైన అధికారాలు కలిగి ఉన్నా సమర్థత ప్రదర్శించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు ప్రాణప్రదమైనవి. ఓటర్ల జాబితాలు ఎంత స్వచ్ఛంగా, దోషరహితంగా ఉంటే ఎన్నికలు అంత సవ్యంగా జరుగుతాయి. కానీ ఇప్పుడేదే వివాదంగా మారింది. … వివరాలు

కాంగ్రెస్‌కు ముందస్తు షాక్‌

త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు భంగపాటు తప్పేలా లేదు. ఇద్దరు టిడిపి అభ్యర్తుల మద్దతుతో 19మంది ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ సీటును దక్కించుకోవాలని చూసింది. కానీ కాంగ్రెస్‌ నుంచి ఇద్దరు, టిడిపి నుంచి ఒకరు టిఆర్‌ఎస్‌లోకి జంప్‌ కానుండడంతో ఇక కాంగ్రెస్‌ అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డిని ముందే ఓటమి పలకరించనుంది. 5 ఎమ్మెల్సీ … వివరాలు

 కాశ్మీర్‌ సమస్యను రాజేయడమే పాక్‌ లక్ష్యం

కాశ్మీర్‌ అభివృద్దికి వేలకోట్ల రూపాయను కేటాయించినా, అక్కడ యువత పాక్‌ ఉగ్రవాద ఉచ్చులో ఇరుక్కుంటూ భవిష్యత్‌ను సర్వనాశనం చేసుకుంటోంది. తొలిదశలో స్వాతంత్య్రా నంతరం నెహ్రూ అవలంబించిన విధానాల కారణంగా అక్కడ ఉగ్రమూకలు తిష్టవేసి హిందువులను ఊచకోత కోశాయి. లక్షలాది కుటుంబాలను తన్ని తరిమేశాయి. అక్కడే ఉండాలనుకున్న వారిని బలవంతంగా మతం మార్చారు. కాశ్మీర్‌ పండిట్లను ఊచకోతకోసి,మతం … వివరాలు

హాస్టళ్ల నిర్వహణా తీరు మారాలి 

రాష్ట్ర ప్రభుత్వం సర్కారు బడుల్లోని పేద విద్యార్థుల ఆకలిని తీర్చాలన్న సదాశయంతో సన్నబియ్యంతో వండి వడ్డించాలని చర్యలు తీసుకుంది. ఈ మేరకు సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో ఇప్పుడు సన్నబియ్యం సరఫరా అవుతున్నాయి. అయితే పరిశుభ్రత విషయంలో ఏజెన్సీల నిర్లక్ష్యం విద్యార్థుల ప్రాణాల విూదకు తెస్తోంది. వంటను శుచిగా శుభ్రంగా వండి పెట్టడంలో ఏజెన్సీలు విఫలం అవుతున్నాయి. … వివరాలు

అధికారమే అన్ని పార్టీల లక్ష్యం

మోడీ పుణ్యమా అని విపక్షాలు ఏకమయ్యాయి. ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించాయి. అన్ని పార్టీలు దేశరాజధాని ఢిల్లీలో భేటీ అయ్యాక భేషజాలు లేకుండా కలసి పోరాడాలన్న సంకల్పాన్ని ప్రకటించాయి. అయితే ఇప్పటికే అధికారంలో ఉన్న వివిధ ప్రాంతీయ పార్టీల నేతలు ఆయా రాష్ట్రాల్లో వీరు వెలగబెట్టిం దేవిూ లేదు. ఎపిలో సిఎం చంద్రబాబు పాలన నానాటికీ తీసికట్టుగా … వివరాలు