Main

ఆస్పత్రిలో ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీ

గోదావరిఖని,జూలై23(జ‌నంసాక్షి): స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిలో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. వైద్యులతోపాటు సిబ్బంది సమయపాలన, ఆస్పత్రిలోని సమస్యలను ఆయన పరిశీలించారు. ఆయా విభాగాలతోపాటు వార్డుల్లో తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నీటి కొరత తీవ్రంగా ఉందని, ఏసీలు, పంకాలు పనిచేయడం లేదని పలువురు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రి … వివరాలు

కేసీఆర్‌.. జగన్‌నుచూసి నేర్చుకో

– ఎన్నికలొస్తేనే కేసీఆర్‌కు హావిూలు గుర్తుకొస్తాయి – కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి జగిత్యాల, జులై22(జ‌నంసాక్షి) : సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హావిూలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి చెప్పుకొచ్చారు. సోమవారం జగిత్యాలలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. … వివరాలు

సిరిసిల్ల,వేములవాడలపై బిజెపి నజర్‌

గెలుపు గుర్రాల కోసం నేతల కసరత్తు మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటేలా యత్నాలు సిరిసిల్ల,జూలై22(జ‌నంసాక్షి): మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టు సాధించాలని బిజెపి భావిస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో అధికార టీఆర్‌ఎస్‌ కంటే.. బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంతో ఆ పార్టీ నేతల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. యువకులు, మహిళల ఓట్లు వస్తాయనే ఆశతో బీజేపీ … వివరాలు

ప్రాసిక్యూషన్‌ వైఫల్యం

– ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి కేసు కొట్టివేత కరీంనగర్‌,జులై 15(జనంసాక్షి): కరీంనగర్‌లోని జ్యోతినగర్‌కు చెందిన కెన్‌క్రెస్ట్‌ పాఠశాల యజమాని ప్రసాద్‌రావు ఆత్మహత్య కేసు విషయంలో ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డితో పాటు ఆయన 9 మంది అనుచరులను నిర్దోషులుగా పేర్కొంటూ కరీంనగర్‌ కోర్టు న్యాయమూర్తి సతీశ్‌కుమార్‌ తీర్పునిచ్చారు. ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి అక్రమ వడ్డీ వ్యాపారాలు ప్రసాదరావు ఆత్మహత్యతో వెలుగుచూసిన విషయం … వివరాలు

ఆ ముగ్గురిలో విజేత ఎవరో వీడనున్న సస్పెన్స్‌

గెలుపుపై వందశాతం ధీమాలో టిఆర్‌ఎస్‌ కరీంనగర్‌,మే22(జ‌నంసాక్షి): తెరాస పార్టీ తరపున రంగంలోకి దిగిన బోయినపల్లి వినోద్‌కుమార్‌ను భారీ ఆధిక్యతతో గెలుస్తారనే భావనలో గులాబీ శ్రేణులు ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు సహా సంప్రదాయ ఓటింగ్‌తో తెరాస అభ్యర్థి గెలుపు ఖాయమనేలా పార్టీ గంపెడాశలతో ఉంది.  ఇక ఏ మాత్రం గెలుపు అంచనాలు లేకుండా బరిలోకి దిగిన కమలం … వివరాలు

27న ప్రాదేశిక ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు

నేడు మరో విడత అధికారులకు శిక్షణ కరీంనగర్‌,మే20(జ‌నంసాక్షి): జిల్లాలో ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి బ్యాలెట్‌ బాక్స్‌లను  స్ట్రాంగ్‌రూముల్లో భద్రపర్చారు. వీటిదగ్గర సిసి కెమెరాలు ఏర్పాటు చేశారు. 27న ఓట్ల లెక్కింపు జరుగనుంది. 23న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ ముగిస్తే  జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు సిద్ధం … వివరాలు

ఉపాధి కూలీలకు ఎండల దెబ్బ

పనిప్రదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వైనం జాబ్‌కార్డున్న వారిలో 60శాతం మాత్రమే హాజరు పెద్దపల్లి,మే18(జ‌నంసాక్షి): ప్రస్తుతం వేసవి ఎండలు మండుతుండగా,దీనికి తోడు వడగాల్పులు ఉధృతమయ్యాయి. ఉదయం రెండు మూడు గంటలు మినహా మిగితా సమయమంతా ఉష్ణోగ్రతలు విజృంభిస్తుండటంతో పని ప్రదేశాల్లో ఉపాది కూలీలు పని చేయడం ఇబ్బందిగా మారింది. ఈ ఏడాది పిబ్రవరి చివరి వారం నుంచి … వివరాలు

ఎండల్లో జోరుగా ఉపాధి పనులు 

అదనపు భత్యంతో హాజరవుతున్న కూలీలు పెద్దపల్లి,మే15(జ‌నంసాక్షి): వేసవిలో ఉపాధి హావిూ పథకంలో పనులు శర వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం వేసవి భత్యాన్ని అదనంగా 60 ప్రకటించింది. దీంతో కూలీలు ఉత్సాహంగా హాజరవు తున్నారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం 2019-20లో రెండు కోట్ల విలువైన పనులు చేయాలని ఉపాధి హావిూ శాఖ వారు అంచనా వేశారు. … వివరాలు

కౌంటింగ్‌ సిబ్బందికి పక్కాగా శిక్షణ

కౌంటింగ్‌ సిబ్బందికి నేడు మొదటి దశ శిక్షణ పెద్దపల్లి,మే15(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీదేవసేన సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే కౌంటింగ్‌ సిబ్బందికి పక్కాగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ నెల 16న కౌంటింగ్‌ సిబ్బందికి మొదటి దశ శిక్షణ అందించాలనీ, 21న రెండోసారి ప్రాక్టికల్‌ శిక్షణను … వివరాలు

టిఆర్‌ఎస్‌కు ఓటేస్తేనే గ్రామాల అభివృద్ది

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కరీంనగర్‌,మే4 (జ‌నంసాక్షి): పరిషత్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. టిఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ది జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. టిఆర్‌ఎస్‌ ఆభ్యర్థులకే ఓటు వేయాలని,కాంగ్రెస్‌,బిజెపి ఓటు వేస్తే గ్రామాల్లో అభివృద్ది కుంటుపడుతుందని అన్నారు.  కరీంనగర్‌ రూరల్‌ మండలంలోని చెర్లభూత్కూర్‌,తాహెర్‌ కొండాపూర్‌ గ్రామాల్లో టిఆర్‌ఎస్‌ జడ్పీటిసి అభ్యర్థి … వివరాలు