Main

పర్యవారణ ముప్పును గమనించండి

ధరిత్రి దినోత్సవం సందర్భంగా చైతన్యర్యాలీ వరంగల్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ చెట్లను పెంచాలని, తద్వారా వాతావరణం సమతుల్యంగా ఉండేట్లు చూడాలని నగర పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ అన్నారు. చెట్ల పెంపకంపై ప్రజలు చైతన్యం కావాలన్నారు.  ప్రపంచ ధరిత్రి దినోత్సవం సందర్భంగా సోమవారం హన్మకొండలోని పబ్లిక్‌ గార్డెన్‌ నుంచి జూపార్కు వరకు నిర్వహించిన ర్యాలీని … వివరాలు

చేపల పెంపకం, మార్కెటింగ్‌ సదుపాయం

మత్స్యశాఖ తీరుతో మారుతున్న పరిస్థితి వరంగల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ద్వారా సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలవుతోంది. జిల్లాలో ప్రస్తుతం అనేక  సంఘాలున్నాయి.  ఆయా సంఘాల సభ్యులకు చేపల పెంపకం, మార్కెటింగ్‌ సదుపాయాలతోపాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం జిల్లాకు రూ.26 కోట్లు మంజూరయ్యాయి. చేపలపై ఆధారపడి ఉన్న … వివరాలు

 మంటపుట్టిస్తున్న మండుటెండలు

వరంగల్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): మండుటెండలతో జిల్లా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే  43.3డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. పట్టణంలోని వీధులు సాయంత్రం వరకు నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రజలు ఉదయం 10 దాటితే ఇండ్ల నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. పలు గ్రామాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఉపాధిహావిూ పనులు కూడా ఉదయం 11గంటలలోపే పూర్తి చేసుకొని కూలీలు ఇండ్లకు … వివరాలు

శరవవేగంగా కాళేశ్వరం పనులు

కెసిఆర్‌ ఆదేశాలతో క్షేత్రస్థాయిలో ఉరుకులు పరుగులు జయశంకర్‌ భూపాలపల్లి,మార్చి29(జ‌నంసాక్షి): కాళేశ్వరం ఎత్తిపోతలతో సహా మూడు ప్రాజెక్టులకు కేంద్ర పర్యావరణ మదింపు నిపుణుల కమిటీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో పాటు, కెసిఆర్‌ తరచూ పర్యవేక్షించడంతో  పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్దిష్ట సమయంలో పూర్తి చేసేందుకు ఇంజనీరింగ్‌ అధికారులు రాత్రింబవళ్లు కష్టపడుఉత్నారు.   కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదావరి … వివరాలు

అత్యధిక మెజార్టీతో బూరను గెలిపించాలి

ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు జనగామ,మార్చి26(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఆదేశాలకనుగుణంగా భువనగిరి  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన  అవసరం ఉందని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ బోడకుంటి వెంరకటేశ్వర్లు అన్నారు.  దానికి అనుగుణంగా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు. ఎంపీ సీటు గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా అందించాలన్నారు.  ప్రతీ కార్యకర్త పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, … వివరాలు

ఎన్నికలకు సమాయత్తం అయిన అధికారులు

నామినేషన్ల ఘట్టం మొదలయినా ముందుకు రాని అభ్యర్థులు వరంగల్‌/భువనగిరి,మార్చి19(జ‌నంసాక్షి): జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. వరంగల్‌, భువనగిరి లోక్‌సభ స్థానాలకు సంబంధించి సోమవారం ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ కావడంతో జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అభ్యర్థుల ఖరారుపై ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తుండగా, టికెట్‌పై ధీమాగా ఉన్న వారు నామినేషన్‌ … వివరాలు

జిల్లాలో జోరుగా వలసలు

గులాబీ దళంలో పెరుగుతున్న జోష్‌ జనగామ,మార్చి14(జ‌నంసాక్షి): దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో పాటు, 16 ఎంపి సీట్లు గెలవాలన్న లక్ష్యంతో టిఆర్‌ఎస్‌ ముందుకు సాగడంతో గ్రామాల్లో రాజకీయ చర్చ మొదలయ్యింది.  తన సేవలు అవసరమైతే కేంద్రానికి వెళ్తానని ప్రకటన చేయడం రాజకీయాలను వేడెక్కించింది. దీంతో గులాబీ దండులో ఎక్కడ … వివరాలు

ఎన్నికల తరవాత కెసిఆర్‌ కీలక భూమిక

జనగామ,మార్చి11(జ‌నంసాక్షి): వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం కేంద్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలకపాత్ర పోషించనున్నారని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాల్లో 16 టీఆర్‌ఎస్‌, ఒకటి ఎంఐఎం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నగరా మోగడంతో ఇక తామంతా కార్యక్షేత్రంలోకి దిగామని అన్నారు. రైతుబంధు, రైతుబీమా … వివరాలు

1లోగా పెసా గ్రామసభలు

ములుగు,మార్చి8(జ‌నంసాక్షి):  ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలో పెసా గ్రామ సభలను ఏప్రిల్‌ 1వ తేదీలోగా నిర్వహించాలని ఐటీడీఏ పీవో చక్రధర్‌రావు కోరారు.  230 షెడ్యూల్డ్‌ గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఉపాధ్యక్షుడు, కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంటుందని, ఈ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేలా అధికారులు తోడ్పడాలని సూచించారు. ప్రతీ 2 నెలలకు ఒకసారి గ్రామ సభ తప్పకుండా నిర్వర్తించే … వివరాలు

ఐటిడిఎ పరిధి స్కూళ్లలో ఇంగ్లీష్‌ విూడియం స్కూళ్లు

వచ్చే విద్యాసంవత్సరం నుంచే అమలు టీచర్లకు ఆంగ్ల ప్రావీణ్యం కోసం శిక్షణ ములుగు,మార్చి8(జ‌నంసాక్షి):ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిషు విూడియం పాఠశాలలను నిర్వహించాలని గిరిజన సంక్షేమ శాఖ భావిస్తుంది. కాగా, 2019-20 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఐటీడీఏ పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ఒకటవ తరగతి నుంచి ఇంగ్లిషు బోధన జరగనుంది. ఈ మేరకు … వివరాలు