జాతీయం

యువత స్వయం సమృద్ధితోనే దేశాభివృద్ధి – ప్రధాని మోదీ

  దిల్లీ,జనవరి 24(జనంసాక్షి): ‘ఏక్‌ భారత్‌- శ్రేష్ఠ భారత్‌’ స్ఫూర్తితో ‘వోకల్‌ ఫర్‌ లోకల్‌’ కార్యక్రమాన్ని బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. కళాకారులు, ఎన్‌సీసీ క్యాడెట్లతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మోదీ ఈ మేరకు వెల్లడించారు. ”ప్రజలు తాము నిత్య జీవితంలో స్వదేశీ ఉత్పత్తుల ఉపయోగంపై దృష్టి సారించాలి. అదే సమయంలో తమ జీవితాల్లోకి … వివరాలు

ఎన్నికల వేళే మీకు నేతాజీ గుర్తుకొస్తాడు

– మేము ప్రతీయేటా జయంతి జరుపుకుంటాం – పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ కోల్‌కతా,జనవరి 23(జనంసాక్షి): నేతాజీ సిద్ధాంతాలను పాటిస్తున్నామని చెప్పుకుంటున్న భాజపా.. ఆయన ప్రతిపాదించిన ప్రణాళిక కమిషన్‌ను ఎందుకు రద్దు చేసిందని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ప్రశ్నించారు. కేవలం ఎన్నికల సమయంలోనే వారికి నేతాజీ గుర్తొస్తారని దుయ్యబట్టారు. సువిశాల భారతదేశాన్ని పాలించాలంటే నాలుగు రాజధానులు ఏర్పాటు … వివరాలు

రైతుల లాంగ్‌మార్చ్‌

– వందకిలోమీటర్ల ట్రాక్టర్ల ర్యాలీ – పోలీసుల అనుమతి దిల్లీ,జనవరి 23(జనంసాక్షి):వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని దిల్లీలో నిర్వహించ తలపెట్టిన ట్రాక్టర్‌ ర్యాలీకి దిల్లీ పోలీసులు అనుమతిచ్చినట్లు రైతు సంఘాల నేతలు తెలిపారు. 26న ఘాజీపూర్‌, సింఘు, టిక్రి సరిహద్దుల నుంచి ఈ ర్యాలీ ప్రారంభమై 100 కీలోమీటర్ల వరకు … వివరాలు

నల్ల చట్టాల రద్దు మినహా ప్రత్యామ్నాయం లేదు

– చర్చలే జరగలేదు:రైతుసంఘాలు – అసంపూర్తిగా ముగిసాయి:సర్కారు దిల్లీ,జనవరి 22(జనంసాక్షి): వ్యవసాయ చట్టాలపై రైతులతో కేంద్రం చర్చలు మరోసారి అసంపూర్తిగానే ముగిశాయి. రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్రమంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్‌, పీయూష్‌ గోయల్‌ శుక్రవారం జరిపిన 11వ విడత చర్చల్లోనూ ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో తదుపరి చర్చలకు సంబంధించి తేదీ ఖరారు చేయకుండానే చర్చలు అసంపూర్తిగా … వివరాలు

గొగొయ్‌కు జడ్‌ ప్లస్‌ భద్రత

దిల్లీ,జనవరి 22(జనంసాక్షి): సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు రంజన్‌ గొగొయ్‌కి కేంద్ర ప్రభుత్వం జెడ్‌ ప్లస్‌ వీఐపీ భద్రతను కల్పించింది. దీంతో ఆయనకు సీఆర్‌పీఎఫ్‌ సాయుధ కమెండోలు భద్రతగా ఉంటారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఆయనకు ఈ భద్రత ఉండనుంది. గతంలో దిల్లీ పోలీసులు ఆయనకు … వివరాలు

శశికళ సీరియస్‌

– విషమంగా ఆరోగ్యం బెంగళూరు,జనవరి 22(జనంసాక్షి): శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నునొప్పితో ఇబ్బంది పడుతూ ఆసుపత్రిలో చేరిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు తెలిపారు. బెంగళూరులోని బౌరింగ్‌ ఆసుపత్రిలో ఆమెకు తొలుత రెండుసార్లు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను నిర్వహించగా నెగెటివ్‌ వచ్చింది. ఆ ఆసుపత్రిలో సీటీ స్కాన్‌ లేకపోవడంతో అక్కడి … వివరాలు

అర్నబ్‌ తో జాతీయ భద్రతకు ముప్పు

అరెస్టుకు రంగం సిద్ధం ముంబయి జనవరి 21 (జనం సాక్షి): టీఆర్పీ కుంభకోణం కేసులో ఇటీవల లీకైన రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నబ్‌ గోస్వామి,మాజీ బార్క్‌ సీఈవో పార్థో దాస్‌ గుప్తాల వాట్సాప్‌ చాట్‌ పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్‌ జరిపిన బాలాకోట్‌ స్ట్రైక్స్‌ గురించి … వివరాలు

ఎట్టకేలకు.. టీకా వేయించుకునేందుకు మోదీ ముందుకు

దిల్లీ జనవరి 21 (జనం సాక్షి): రెండో దశ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా వేయించుకోనున్నారు. ఆయనతో పాటు ముఖ్యమంత్రులు కూడా టీకాను తీసుకోనున్నట్లు  ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలకు అనుమతులు లభించడంతో..జనవరి 16 నుంచే దేశంలో మొదటి దశ టీకా కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. … వివరాలు

సీరమ్‌ ఇనిస్టిట్యూట్లో లో అగ్నిప్రమాదం

ఐదుగురు మృతి టీకా తయారీకి డోకా లేదు పుణె  జనవరి 21 (జనం సాక్షి): ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ)కు చెందిన కొత్త ప్లాంట్‌లో చోటుచేసుకున్న భారీ అగ్నిప్రమాదం విషాదం రేపింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు మహారాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. నిర్మాణంలో ఉన్న ఎస్‌ఈజెడ్‌- 3 భవనం … వివరాలు

వెనకడుగు ముచ్చటే లేదు

సాగు చట్టాల రద్దు చేసే వరకు కదిలేది లేదు సర్కార్‌ మెట్టు దిగిన నమ్మని రైతులు ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించి తీరుతాం రైతు సంఘాలు దిల్లీ  జనవరి 21 (జనం సాక్షి):   నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాలు ఎంతమాత్రం వెనక్కి తగ్గడం లేదు. వ్యవసాయ చట్టాలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తామన్న ప్రభుత్వ … వివరాలు