వార్తలు

టీడీపీతోనే మైనార్టీల సంక్షేమం

– 28న గుంటూరులో బహిరంగ సభ – మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రోషన్‌ అలీ అనంతపురం, ఆగస్టు18(జ‌నం సాక్షి) : రాష్ట్రవ్యాప్తంగా మైనార్టీల సంక్షేమం టిడిపితోనే సాధ్యమవుతుందని అనంతపురం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రోషన్‌ ఆలీ, చంద్రదండు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్సార్‌ హమద్‌ పేర్కొన్నారు. శనివారం పట్టుగూళ్ల మార్కెట్‌ వద్ద బహిరంగ సభకు సంబంధించిన గోడపత్రికలను, … వివరాలు

ట్రంప్‌పై ఇంటలిజెన్స్‌ మాజీ చీఫ్‌ల తిరుగుబాటు

– బ్రెన్నాన్‌ సెక్యురిటీ క్లియరెన్స్‌ రద్దుచేస్తూ ఉత్తర్వులపై ఆగ్రహం వాసింగ్టన్‌, ఆగస్టు18(జ‌నం సాక్షి) : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై మాజీ ఇంటలిజెన్స్‌ అధికారులు ధ్వజమెత్తారు. ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు సీఐఏ మాజీ చీఫ్‌ జాన్‌ బ్రెన్నాన్‌ సెక్యూరిటీ క్లియరెన్స్‌ రద్దు చేస్తూ ట్రంప్‌ జారీచేసిన ఉత్తర్వులపై వారు మండిపడుతున్నారు. సెక్యూరిటీ క్లియరెన్స్‌ రద్దు … వివరాలు

కేటీఆర్‌ చిల్లర మాటలు మానుకోవాలి

– విూ హయాంలో చేసిన అభివృద్ధేంటో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది – కేటీఆర్‌కు సలహా ఇవ్వాలని పవన్‌ను కోరతా – కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వీహెచ్‌ హైదరాబాద్‌, ఆగస్టు18(జ‌నం సాక్షి) : మంత్రి కేటీఆర్‌కు పెద్దలంటే గౌరవం లేదని, చిల్లర మాటలు మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. శనివారం గాంధీభవన్‌లో … వివరాలు

సెప్టెంబరు 15 నుంచి.. 

ఆధార్‌ ‘ముఖ గుర్తింపు’ – టెలికాం సంస్థలతో ప్రారంభించనున్న ఉడాయ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు18(జ‌నం సాక్షి) : గత కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తోన్న ఆధార్‌ ముఖ గుర్తింపు(ఫేస్‌ రికగ్నిషన్‌) సదుపాయాన్ని ఎట్టకేలకు వచ్చే నెల నుంచి అమలు చేయాలని భారత విశిష్ఠ ప్రాధికార గుర్తింపు సంస్థ ఉడాయ్‌ నిర్ణయించింది. సెప్టెంబరు 15 నుంచి దశలవారీగా అందుబాటులోకి … వివరాలు

జూరాల వద్ద పర్యాటకుల సందడి

గద్వాల,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): కృష్ణా పరివాహక ప్రాంతం మొదలయ్యే మహబలేశ్వరం నుంచి జూరాల వరకు కుండపోత వర్షాలతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. తెలంగాణలో కృష్ణా నదిపై మొదటి ప్రాజెక్టుగా ఉన్న జూరాల ఉమ్మడి జిల్లాలలోని ప్రధాన ఎత్తిపోతల పథకాలకు, దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు జీవనాడి. జూరాలకు వరద మొదలైన జులై నుంచి ఆగస్టు 17 … వివరాలు

ఆటో ఫైనాన్షియర్ల ఆగడాలపై ఆందోళన

ఈనెల 27న జంటనగరాల్లో ఆటోల బంద్‌ హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): ఆటో ఫైనాన్స్‌ మార్గదర్శకాలను ప్రభుత్వం వెంటనే రూపొందించాలని తెలంగాణ ఆటో డ్రైవర్స్‌ ఐకాస ఈ నెల 27న ఒక్కరోజు జంట నగరాల బంద్‌కు పిలుపునిచ్చింది. ఫైనాన్స్‌ వాయిదాలు చెల్లించలేదని ఆటో డ్రైవర్‌ ఇంటికి తాళం వేసిన ఫైనాన్సర్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలని ఐకాస నాయకులు డిమాండ్‌ … వివరాలు

ఆక్రమణల తొలగింపు

హైదరాబాద్‌,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): పంజాగుట్ట మోడల్‌ హౌస్‌ వద్ద అక్రమ నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ సిబ్బంది జేసీబీల సాయంతో తొలగించారు. మోడల్‌ హౌస్‌ నుంచి ప్రారంభం అయిన ఈ కూల్చివేతలు పంజాగుట్ట రహదారులకు ఇరువైపులా కొనసాగాయి. పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది, ట్రాఫిక్‌ పోలీసులు, జీహెచ్‌ఎంసీ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో రహదారి ఇరుకు కావడంతో … వివరాలు

సోషల్‌ విూడియాలో విపరీతం

ముల్ల పెరియార్‌ కూలిందంటూ ప్రచారం అప్రమత్తం అయిన పోలీసులు తిరువనంతపురం,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): భారీ వర్షాలు, వరదలతో కేరళ రాష్ట్రం అల్లాడుతున్నది. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని జీవిస్తున్నారు. ఇలాంటి సమయంలో బాధితులకు సాయం చేయాల్సింది పోయి భయభ్రాంతులకు గురయ్యేలా కొంతమంది సోషల్‌ విూడియాలో పోస్ట్‌లు చేస్తూ అలజడి సృష్టిస్తున్నారు. తాజాగా భారీ వర్షాలకు ముల్ల పెరియార్‌ … వివరాలు

కర్నాటకనూ వదలని వరదలు

కొడగులో వరదలకు ఆరుగురు మృతి: సిఎం కుమారస్వామి బెంగళూరు,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): కర్నాటకలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా కొడగులో ఆరుగురు చనిపోయారని ఆ రాష్ట్ర సిఎం కుమారస్వామి తెలిపారు. 11 వేలకు పైగా ఇళ్లు కూలిపోయినట్టు ఆయన వెల్లడించారు. రోడ్లు దెబ్బతిన్నాయని, దెబ్బతిన్న రోడ్ల జాబిఆను తయారు చేసి … వివరాలు

అటవీ సిబ్బందిపై స్థానికుల దాడి

– ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌కు గాయాలు – పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫారెస్ట్‌ అధికారులు మహబూబ్‌నగర్‌, ఆగస్టు18(జ‌నం సాక్షి) : పోడు వ్యవసాయం పేరుతో అటవీ భూముల ఆక్రమణలు, నియంత్రించేందుకు వెళ్లిన అటవీ అధికారులు, సిబ్బందిపై దాడులు పెరిగిపోతున్నాయి. తాజాగా శనివారం మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం కొత్తగూడ అటవీ ప్రాంతంలో స్థానికులు అటవీ సిబ్బందిపై … వివరాలు