జాతీయం

జవాన్లపై దాడిలో పాక్‌ పాత్ర ఉంది: ఆంటోనీ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): భారత సరిహద్దుల్లో భారత జవాన్లపై జరిపిన కాల్పుల ఘటనపై రక్షణ మంత్రి ఆంటోని తీవ్రంగా స్పందించారు. ఇవాళ ఆయన రాజ్యసభలో మాట్లాడారు. సరిహద్దు నియంత్రణ రేక …

సాంకేతిక లోపం వల్లే సింధూరక్షక్‌ ప్రమాదం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ముంబై తీరంలో అగ్ని ప్రమాదం కారణంగా సముద్రంలో మునిగిపోయిన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్‌ సిందూ రక్షక్‌ ప్రమాద ఘటనపై రక్షణ మంత్రి ఆంటోని రాజ్యసభలో ప్రకటన …

కనిష్ఠస్థాయికి పడిపోయిన రూపాయి మారకం విలువ

ముంబయి,(జనంసాక్షి): డాలర్‌తో రూపాయి మారకం విలువ మరోసారి కనిష్ఠ స్థాయికి పడిపోయింది. సోమవారం మధ్యాహ్నానికి ఇది రూ. 62.45 గా నమోదైంది. స్టాక్‌ మార్కెట్లు కూడా పెద్ద …

లోక్‌సభ స్పీకర్‌ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం

ఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ స్పీకర్‌ మీరాకుమార్‌ అధ్యక్షతన అఖిల పక్ష సమావేశం జరుగుతుంది. సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్న వారి పేర్లను సభలో ప్రస్తావించాలని కాంగ్రెస్‌ ఈ సమావేశంలో కోరింది. …

చెప్పులతో దాడి చేయడం హేయమైన చర్య : దిగ్విజయ్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తిరుమలలో తెలంగాణ కాంగ్రెస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు వీ. హనుమంతరావును సీమాంధ్ర ఉద్యమకారులు అడ్డుకోవడాన్ని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్‌ తీవ్రంగా ఖండించారు. హనుమంతరావుపై …

రేపటికి వాయిదా పడిన లోక్‌సభ

న్యూఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. భాజపా సభ్యుడు దిలీప్‌సింగ్‌ జుదేవ్‌ మృతికి సంతాపం తెలిపిన స్పీకర్‌ సభను రేపటికి వాయిదా వేశారు.

బెంగళూరులో కూలిన నిర్మాణంలో ఉన్న భవనం

బెంగళూరు,(జనంసాక్షి): బెంగళూరు నగరంలోని హోసూరు రోడ్డులోని నిమ్హాన్స్‌ వద్ద నిర్మాణంలో ఉన్న ఐదంతస్తుల భవనం కూలింది. భవనం శిథిలాల్లో ఆరుగురు కూలీలు చిక్కుకున్నట్లు సమాచారం. అధికారులు పోలీసులు …

బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం: 25 మంది మృతి

లక్నో,(జనంసాక్షి): బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బద్లషూట్‌ దగ్గర రైలు ఆపేందుకు స్థానికులు ఆపేందుకు ప్రయత్నించారు. స్థానికులపై నుంచి రాజ్‌రాణి ఎక్స్‌ప్రెస్‌ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో …

జమ్మూకాశ్మీర్‌లో స్వల్ప భూకంపం

జమ్మూ,(జనంసాక్షి:) జమ్మూ కాశ్మీర్‌లో స్వల్ప భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 4.9 గా నమోదైంది. జమ్మూ కాశ్మీర్‌లోని క్విష్టార్‌లోని భూకంప కేంద్రకాన్ని అధికారులు గుర్తించారు.

ఐబీఎల్‌లో నేటి మ్యాచ్‌లు

ముంబయి,(జనంసాక్షి): ఐబీఎల్‌లో భాగంగా నేడు హైదరాబాద్‌ హాట్‌షాట్స్‌ జట్టు పుణె పిస్టర్స్‌తో తలపడనుంది. రాత్రి ఎనిమిది గంటల నుంచి ఈఎస్‌పీఎన్‌, స్టార్‌స్పోర్ట్స్‌లో మ్యాచ్‌ ప్రసారం కానుంది.