సిద్దిపేట

ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు వజ్రోత్సవ వేడుకలు* 563 సినిమా థియేటర్లలో పిల్లలకు గాంధీ చిత్ర ప్రదర్శన* వజ్రోత్సవ వేడుకల నిర్వహణ పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర సీఎస్ సోమేశ్ కుమార్ నల్గొండ బ్యూరో. జనం సాక్షి జాతీయ సమైక్యత పెంపొందించే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్ లను ఆదేశించారు.స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల నిర్వహణ పై శనివారం డీజిపీ మహెందర్ రెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.సి.ఎస్. మాట్లాడుతూ, భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పండగ వాతావరణం లో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు వజ్రోత్సవ వేడుకల షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 563 సినిమా థియేటర్లలో పిల్లల కోసం ప్రత్యేకంగా ఉదయం 10 గంటలకు గాంధీ చిత్ర ప్రదర్శన జరుగుతుందని, 6 నుంచి 10వ తరగతి చదివే ప్రతి విద్యార్థి(ప్రభుత్వ & ప్రైవేట్) సినిమా చూసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ సూచించారు. ఆగస్టు 8 న నిర్వహించే ప్రారంభం కార్యక్రమానికి జిల్లా నుంచి జడ్పీటీసీ, ఎంపీపీ లు, రైతు బంధు సమితి నాయకులు, మున్సిపల్ చైర్ పర్సన్ లు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి సినిమా థియేటర్ గాంధీ సినిమా సాటిలైట్ లింక్ రేపటి వరకు డౌన్ లోడ్ చేసుకోవాలని, దీనిని తహసిల్దార్, ఎస్.హెచ్.ఒ ధృవీకరించాలని మున్సిపల్ ,పట్టణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ తెలిపారు. ఆగస్టు 12 న ప్రతి సిటీ కేబుల్ ఛానల్ లో దేశ భక్తి పెంపోందించే కార్యక్రమాలు టెలికాస్ట్ చేయాలని, వీటీకి సంబంధించిన లింక్ లను డిపిఆర్వోల ద్వారా అందిస్తామని ఆయన తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వి.చంద్ర శేఖర్, సూర్యా పేట,యాదాద్రి భువన గిరి జిల్లా ల అదనపు కలెక్టర్ లు పాల్గొన్నారు

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుదాం – సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 08 : పాలు, పాల …

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

– వీరన్నపేట సర్పంచ్ కొండపాక భిక్షపతి కుమారుడిని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన సర్పంచ్ చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 08: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు అందించడంతో పాటు …

జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించడం అభినందనీయం

– కేజీకేఎస్ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ చేర్యాల (జనంసాక్షి) ఆగస్టు 08 : ఈనెల 18న సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను రాష్ట్ర …

రక్తదాన శిబిరంలో రక్త దానం చేసిన ఆటో డ్రైవర్లు

దేవరుప్పుల ,ఆగస్టు   (జనం సాక్షి) :* మండలానికి చెందిన కడవెండి,నీర్మల,ధర్మపురం, చిన్నమాడుర్ గ్రామాలకు చెందిన యువకులు మరియు దేవరుప్పుల ఆటో యూనియన్ సభ్యులు వరంగల్ సి.పి  మరియు డీసీపీ …

ప్రభుత్వ నిషేధిత గంజాయి పట్టివేత, ఇద్దరు యువకుల అరెస్ట్: ఎస్సై శ్రీధర్

హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 07(జనంసాక్షి) హుస్నాబాద్ లోని అనబేరి విగ్రహం డిపో క్రాసింగ్ వద్ద శనివారం రాత్రి ఎస్సై శ్రీధర్ అధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా, కోహెడ నుండి …

కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడు అండగాఉంటాం:

దుబ్బాక నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి. దౌల్తాబాద్ ఆగష్టు 7, జనం సాక్షి. రాయపోల్ మండల కేంద్రంలో ఇటీవల టిఆర్ఎస్ పార్టీ …

దోమల నివారణకు చర్యలు చేపట్టిన చైర్ పర్సన్ ఆకుల రజిత

హుస్నాబాద్ ఆగస్టు 07(జనంసాక్షి) హుస్నాబాద్ లోని 4వ వార్డ్ మరియు 14వ వార్డుల్లో ఆదివారం ఉదయం పది గంటల పది నిమిషాల కార్యక్రమంతో  పాటు హరితహారం కార్యక్రమాన్ని …

తండ్రి జ్ఞాపకార్థంగా మున్నూరుకాపు విద్యార్థులకు నోట్ బుక్స్ అందజేత

దుబ్బాక జనం సాక్షి..సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని రామక్కపేట గ్రామంలో ఆదివారం క్రీ.శే. కొట్టే నర్సయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారుడు కొట్టే స్వామి మున్నూరుకాపు పటేల్ సంఘంలో …

నూతన మండలంగా లక్ష్మీదేవిపేటని ఏర్పాటు చేయాలి: తెరాస మండల అధికార ప్రతినిధి ముడిగె రాజ్ కుమార్

వెంకటాపూర్(రామప్ప),ఆగస్ట్07(జనం సాక్షి):- చుట్టూ ప్రక్కల గ్రామాలను కలుపుకుని నూతన మండలంగా లక్ష్మీదేవిపేటని ఏర్పాటు చేయాలని వెంకటాపూర్ మండల అధికార ప్రతినిధి ముడిగె రాజ్ కుమార్ అన్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి …

ఎంపీకొత్త ప్రభాకర్ రెడ్డి కి గ్రామ సేవకులు తమ డిమాండ్ల నెరవేర్చాలని వినతి పత్రం అందజేయుట

దుబ్బాక జనం సాక్షి..         సిద్దిపేట్ జిల్లా దుబ్బాక మండలం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కొన్ని రోజులుగా …