మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
నల్లబెల్లి ఆగస్టు 8 (జనం సాక్షి):
మండలంలోని నారక్కపేట గ్రామానికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు ఈర్ల చక్రపాణి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారి కుటుంబానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 7116 రూపాయల ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వైనాలా అశోక్, గ్రామ ఉపసర్పంచ్ వడ్లూరి రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ సెల్ కో కన్వీనర్ భూంపేల్లి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ సహాయ కార్యదర్శి కొలిపాక పైడి, బీసీ సెల్ మండల ఉపాధ్యక్షుడు పోగుల కుమారస్వామి, సిద్ధ స్వామి, కోడూరి రాయసాబ్, మురారి కిరణ్, దండెం రాజేష్, శ్రీపతి సుమన్, పెసరు కుమారస్వామి, సిద్ధ లింగమూర్తి , కలిమి రాకేష్ పాల్గొన్నారు.