ఎస్సీల ఎబిసిడిల వర్గీకరణ వెంటనే చేయాలి.

సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ డిమాండ్.
హుస్నాబాద్ ఆగస్టు 08(జనంసాక్షి) ఏండ్ల తరబడి ఎస్సీల వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ చేస్తున్న పోరాటం న్యాయ బద్దమైనదని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్ అన్నారు సోమవారం నాడు హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం వద్ద రిలేనిరాహార దీక్షలు చేపట్టిన శిబిరాన్ని ఆయన సందర్శించారు అనంతరం గడిపె మల్లేశ్ మాట్లాడుతూ ఎస్సీ ఎబిసిడిల వర్గీకరణ చేసేంతవరకు సిపిఐ ఎస్సీల పక్షణ నిలబడి పోరాటంలో వారికి వెన్నుదన్నుగా నిలిచి ఉంటామని బిజెపి ప్రభుత్వం వెంటనే ఎబిసిడిల వర్గీకరణ వెంటనే చెపట్టాలని డిమాండ్ చేశారు. శిబిరాన్ని సందర్శించి వారిలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు యెడల వనేష్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి,బిసి హక్కుల సాధన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏగ్గొజు సుదర్శన్ చారి, సిపిఐ అక్కన్నపెట సహాయ కార్యదర్శి బొజ్జా పూరి రాజు,ఎఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గడిపె సుజిత్ కుమార్,జెరిపోతుల వినిష్, సిపిఐ మండల నాయకులు తొట అయిలయ్య,బైరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.