భద్రాచలంలో వెలసిన మావోయిస్టు పార్టీ పోస్టర్లు
ఖమ్మం,(జనంసాక్షి): భద్రాచలం పరిసారాల్లో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో స్థానిక రాజకీయ నాయకులు భయాందోళనకు గురవుతున్నారు.
ఖమ్మం,(జనంసాక్షి): భద్రాచలం పరిసారాల్లో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. దీంతో స్థానిక రాజకీయ నాయకులు భయాందోళనకు గురవుతున్నారు.
ఖమ్మం,(జనంసాక్షి): పంట రుణాలు ఇవ్వడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. పంట రుణాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తూ ఇల్లందు ఆంధ్రాబ్యాంకు ఎదుట రైతులు ధర్నాకు దిగారు.
ఖమ్మం,(జనంసాక్షి): భద్రాద్రి రామాలయానికి అనుబంధ ఆలయం గోవిందరాజస్వామి ఆలయంలో చోరి జరిగింది. దుండగులు స్వామివారికి చెందిన కిలోన్నర వెండి ఆభరణాలను దోచుకెళ్లారు.
ఖమ్మం : బొగ్గు కొరతతో కేటీపీఎన్‌లో విద్యుదుత్పత్తి తగ్గింది. ఒక్కో యూనిట్‌లో 20 మెగావాట్ల మేర విద్యుదుత్పత్తిని తగ్గించినట్లు అధికారులు తెలిపారు.
ఖమ్మం : జిల్లా ఎస్సీ ఎదుట ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులు అరుణ్ అలియాస్ రాంబాబు, మదిని జోగి అలియాస్ ఉమ లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు.