ఇసుక అక్రమార్కులపై కేసులు నమోదు చేయాలి
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని శారదానదిలో అక్రమంగా ఇసుకను తరటించిన వారిపై పీడీ యాక్టు ప్రకారం కేసులు నమోదుచేయాలని స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ఓడరేవులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అధికారులకు ఆదేశించారు. ఇసుక అక్రమార్కులపై కఠినచర్యలు తీసుకోవాలని వారు నదిలో వేసుకున్న మార్గాలను తొలగించాలని ఆదేశించారు. మండలంలోని తగరంపూడి సమీపంలో శారదానదిలో ఇసుక అక్రమంగా తరలిపోతున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఆయన వెంట తహశీల్దార్ పాండురంగారెడ్డి, ఎస్సై విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.