Monday, 2 November 2026

September 2012

వార్తలు

తెలంగాణ మార్చ్‌ కొనసాగుతున్న దృష్ట్య ఎంఎంటీఎస్‌ రైళ్లు రద్దు

హైదరాబాద్‌: ఈ రోజు అన్ని ఎంఎంటీఎప్‌ రైళ్లను రద్దు చేసిన దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. రేపు కూడా కొనసాగుతుందని ప్రకటించింది. తెలంగాణ మార్చ్‌ కొనసాగుతున్న దృష్ట ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

వార్తలు

సీఎంతో హోంమంత్రి డీజీపీ భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి డీజీపీ దినేశ్‌రెడ్డి భేటీ అయ్యారు. ఉదయం నుంచి జరిగిన ఘటనలు, కవాతు కొనసాగించడం తదితర అంశాలపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

వార్తలు

పాకిస్థాన్‌పై భారత్‌ ఘన విజయం

కొలంబొ: పాకిస్థాన్‌, భారత్‌ జట్ల మధ్య కొలంబోలో జరిగిన టీ20 ప్రపంచకప్‌ కీలక మ్యాచ్‌లో భారత్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 17 ఓవర్లలోనే రెండు వికెట్ల నష్టానికి 129 పరుగులు లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభంలోనే గంభీర్‌…

వార్తలు

అనుమతిచ్చి అరెస్టు చేసిన ప్రభుత్వం: కేకే

హైదరాబాద్‌: తెలంగాణ కవాతుకు అనుమతి ఇచ్చి అరెస్టులు చేయడం ప్రభుత్వ వైఫల్యమేనని తెలంగాణ కాంగ్రెస్‌ నేత కేకే అన్నారు. ఆయన నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశం ముగిసింది. ఎవరినీ అరెస్టు చేయం అని చెప్పి అరెస్టులు చేశారన్నారు.…

వార్తలు

జీవ వైవిధ్య సదస్సుకు వచ్చే ప్రతినిధులకు పూర్తి భద్రత కల్పిస్తాం: అనురాగ్‌శర్మ

హైదరాబాద్‌: తెలంగాణ కవాతు సందర్భంగా పోలీసులు సంయమనం పాటించారనీ, తమ తరపునుంచీ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని నగర కమిషనర్‌ అనురాగ్‌శర్మ తెలిపారు. రబ్బర్‌ బుల్లెట్లు కూడా వాడకుండా సంయమనం పాటించినట్లు కమిషనర్‌ తెలిపారు. అనుమతి సమయం దాటిపోయిందని వాళ్లే…

వార్తలు

కవాతుపై ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతల చర్చ

ఢిల్లీ: హైదరాబాద్‌లో తెలంగాణ కవాతు, ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితిపై కాంగ్రెస్‌పార్టీ ముఖ్యనేతలు వయలార్‌ రవి, గులాంనబీ ఆజాద్‌లు ఫోన్‌లో చర్చించుకున్నట్లు సమాచారం.

వార్తలు

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ మార్చ్‌ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతనికి చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. సీనియర్‌ నేత కేశవరావు నివాసంలో ఈ భేటీ జరుగుతోంది. రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు.

వార్తలు

ఆజాద్‌, వయలార్‌ను కలిసిన పాల్వాయి

హైదరాబాద్‌: రాష్ట్రవ్వవహారాల ఇన్‌చార్జ్‌ గులాంనబీఆజాద్‌, వయలర్‌ రవిలను రాష్ట్ర రాజ్యసభ సభ్యులు పాల్వయి గోవర్ధన్‌రెడ్డి కలిశారు. మార్చ్‌ పరిణామాలపై కేంద్ర నేతలకు పాల్వాయి వివరించినట్లు సమాచారం. అరెస్టుల విషయంలో ఇద్దరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తం వ్వవహారంపై…

వార్తలు

ఓయూలో మళ్లీ ఉద్రిక్తత

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్శిటీలో ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. బిసి. హాస్లల్‌ నుంచి పోలీస్‌స్టేషన్‌పైకి విద్యార్థులు రాళ్లు రువ్వుతున్నారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగిస్తున్నారు.

వార్తలు

రాత్రంతా ఇక్కడే ఉంటాం ఎవరూ ఇంటికి పోవద్దు: కోదండరాం

హైదరాబాద్‌: కవాతుకు వచ్చిన వారు రాత్రంతా ఇక్కడే ఉండాలి, ఎవరూ ఇంటికి పోవద్దని రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం తెలంగాణ వాదులకు సూచించారు. తాము ఇక్కడే కూర్చుంటామిని, ఎవరికీ ఇబ్బంది కలిగించమని ప్రకటించారు. అవకాశం మేరకు ఆహారం, నీరు…