Monday, 2 November 2026

August 2013

తెలంగాణ

స్వామిగౌడ్‌ ఇంట్లో భారీ చోరి

హైదరాబాద్‌,(జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ నేత ఎమ్మెల్సీ స్వామిగౌడ్‌ ఇంట్లో చోరి జరిగింది. రాజేంద్రనగర్‌లోని ఆయన నివాసం నుంచి దొంగలు భారీ ఎత్తున సొమ్మును దోచుకెళ్లారని తెలుస్తుంది. ఈ మేరకు ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులు రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరు :నాగం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరని భాజపా నేత నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు.

తెలంగాణ

మాజీ ఎమ్మెల్యే కారు ఢీ : ఇద్దరు మృతి

హైదరాబాద్‌,(జనంసాక్షి): విశాఖ జిల్లా కశింకోటలో మాజీ ఎమ్మెల్యే చెంగం వెంకట్రావు వాహనం ఢీకొని ఇద్దరు మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

తెలంగాణ

గ్రేటర్‌ పరిధిలో చేరనున్న మరిన్ని గ్రామాలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిని మరింత విస్తరించారు. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి, వట్టినాగులపల్లి, నెక్కనంపూర్‌, ఖానాపూర్‌, బండ్లగూడ జాగీర్‌, కిస్మత్‌పూర్‌, హిమాయత్‌సాగర్‌, పేరంచెరువు,హైదర్‌షాకోట్‌, నిజాంపేట్‌, కాల్వంచ(కుంట్లూరు మండలం), కొత్తపేట్‌, సాతంరాయి,…

తెలంగాణ

శాసనసభ కార్యదర్శి పదవీకాలం పొడిగింపు

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాసనసభ కార్యదర్శి రాజా సదారాం పదవీకాలాన్ని ఏడాదిపాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది.

తెలంగాణ

నిమ్స్‌ను ముట్టడించిన ఓయూ జేఏసీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): నిమ్స్‌ ఆసుపత్రిని ఉస్మానియా యూనివర్సీటీ విద్యార్థులు ముట్టడించారు. తెలంగాణకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న వైఎస్‌ జగన్‌ను తీహార్‌ జైలుకు తరలించాలని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి…

జాతీయం

నిర్భయ కేసులో వెలువడిన తొలితీర్పు

ఢిల్లీ,(జనంసాక్షి): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ అత్యాచార ఘటన నిర్భయ కేసులో తొలి తీర్పు వెలువడింది. మైనర్‌ నిందితుడిని దోషిగా జువైనల్‌ జస్టిస్‌ బోర్డు నిర్ధారించింది. అత్యాచారం, హత్య అభియోగాలపై నిందితుడిని దోషఙగా బోర్డు నిర్ధరణ చేసింది. మైనర్‌…

తెలంగాణ

ఏసీబీ వలలో చిక్కిన ట్రాన్స్‌కో ఏఈ

హైదరాబాద్‌,(జనంసాక్షి): అనంతపురం జిల్లా కనేకల్‌ ట్రాన్స్‌కో ఏఈ లక్ష్మీరెడ్డి ఏసీబీ వలకు చిక్కారు. ఉరవకొండలో ఏఈ తన నివాసంలో గుత్తేదారుల నుంచి రూ. 15 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

తెలంగాణ

సచివాలయంలో ఉద్రిక్తత

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర సచావాలయంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల వైఖరి నిరసనగా సీబ్లాక్‌ వైపు తెలంగాణ ఉద్యోగులు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఉద్యోగులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు సీమాంధ్ర ఉద్యోగులకు తొత్తులుగా వ్యవహరిస్తూ తెలంగాణ…

తెలంగాణ

మాకు అనుమతివ్వడం లేదు : కోదండరాం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ రాజకీయ ఐకాస సెప్టెంబర్‌ 7న హైదరాబాద్‌లో తల పెట్టిన శాంతి ర్యాలీకి అనుతివ్వడం లేదని ఛైర్మన్‌ కోదండరాం చెప్పారు. ఈ ర్యాలీకి అనుమతి ఇప్పించాల్సిన బాధ్యత మంత్రులదేనని స్పష్టం చేశారు.