Monday, 2 November 2026

June 2013

తెలంగాణ

తెలంగాణకు సమయం ఆసన్నమైంది: డీకే అరుణ

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ వచ్చే సమయం ఆసన్నమైంని మంత్రి డీకే అరుణ అన్నారు. ఇవాళ ఆమె నిజాం కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన సభలో మాట్లాడారు. ఎన్నికలలోపై తెలంగాణ రావాలని ఆమె ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ,…

తెలంగాణ

బషీర్‌బాగ్‌లో స్తంభించిన ట్రాఫిక్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణలోని పది జిల్లాల నుంచి తెలంగాణ సాధన సభకు భారీగా ప్రజలు తరలివస్తున్నారు. దీంతో బషీర్‌బాగ్‌, హైదర్‌నగర్‌, హిమాయత్‌నగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

తెలంగాణ

తెలంగాణ సాధన సభకు ప్రారంభమైన ద్విచక్రవాహన ర్యాలీ

హైదరాబాద్‌,(జనంసాక్షి): కాసేపట్లో నిజాం కళాశాల మైదానంలో కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ రాష్ట్ర సాధన సభ ప్రారంభం కానుంది. నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానం నుంచి నిజాం కళాశాలకు కాంగ్రెస్‌ కార్యకర్తలతో పాటు ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ద్విచక్రవాహన ర్యాలీగా బయల్దేరారు.…

తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్రభాగాన ఉంటాం: జానారెడ్డి

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ కోసం ముందుండి పోరాడుతామని, నిరంతరంగా శ్రమిస్తున్నామని మంత్రి జానారెడ్డి తెలిపారు. తెలంగాణ సాధన సభలో ఆయన ప్రసంగించారు. ప్రత్యేక రాష్ట్రం కాంగ్రెస్‌తోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాదనలో అగ్రభాగాన ఉంటామని చెప్పడానికే…

తెలంగాణ

నిజాం కళాశాల ప్రాంగణంలో ప్రారంభమైన తెలంగాణ సాధన సభ

హైదరాబాద్‌,(జనంసాక్షి):నిజాం కళాశాల ప్రాంగణంలో తెలంగాణ సాధన సభ ప్రారంభమైంది. తెలంగాణ అమరవీరులకు తెలంగాణ సాధన సభ శ్రద్ధాంజలి ఘటించింది. సభకు భారీగా తెలంగాణ ప్రజలు హాజరయ్యారు.

తెలంగాణ

పాతకక్షలతో మహిళపై ప్రత్యర్థుల దాడి

మహబూబ్‌నగర్‌,(జనంసాక్షి): దేవరకద్ర మండలం గూరకొండలో దారుణం చోటు చేసుకుంది. పాతకక్షలతో ప్రత్యర్థులు మహిళపై కత్తులతో దాడి చేశారు. మహిళ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఆదిలాబాద్

సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ధ్వజమెత్తిన వివేక్‌

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై పెద్దపల్లి ఎంపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రామకృష్ణాపూర్‌లో మెడికల్‌ కళాశాలను సీఎం అడ్డుకున్నారని ఆరోపించారు. రామగుండం ఎఫ్‌సీఐ పునరుద్ధరణ కోసం సీఎం ఎలాంటి కృషి చేయలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఇవ్వకపోతే పదవి వదులుకోవడానికైనా సిద్దమని గతంలోనే…

జాతీయం

ఆచూకీ లభించని వారు 3వేల మంది

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ వరదల్లో భాగంగా ఇంకా 3 వేల మంది ఆచూకీ లభించలేదని ఆ రాష్ట్ర సీఎం విజయ్‌ బహుగుణ తెలిపారు. 30 రోజుల్లో వారి ఆచూకీ తెలియకుంటే చనిపోయినట్లు ప్రకటిస్తామని పేర్కొన్నారు. వరదల కారణంగా సంబంధాలు తెగిపోయిన…

తెలంగాణ

పోలీసు వాహనం ఢీకొని యువకుడి మృతి

హైదరాబాద్‌,(జనంసాక్షి): బషీర్‌బాగ్‌ నిజాం కళాశాల హాస్టల్‌ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసు వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

తెలంగాణ

పీఎస్‌లో యువకుడు అనుమానస్పద మృతి

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో ఓ యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులే కొట్టి చంపారంటూ మృతుడి బందువులు పీఎష్‌ ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.