రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
విజయవాడ : నగరంలోని వినాయక్ సినిమాహాలు వద్ద ఈ ఉదయం రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృఇ చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విజయవాడ : నగరంలోని వినాయక్ సినిమాహాలు వద్ద ఈ ఉదయం రెండు కార్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృఇ చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కడప : ఖాజీపేట మండలం ఏటూరు సమీపంలో రూ. కోటి విలువైన ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు.
విశాఖ : సింహాద్రి ఎన్టీపీసీ మూడో యూనిట్‌లో ఈ ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి కన్వేయర్ బెల్ట్‌కు వ్యాపించాయి. దీంతో ఈ యూనిట్‌లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు…
విశాఖ : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ ఆర్కే బీచ్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిపాలన యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని సైకిల్ యాత్ర చేపట్టారు. ఓటు హక్కు వినియోగం వల్ల…
పుల్లలచెరువు : ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని ఎం. ఎర్రబాలెం గ్రామంలో నాటు సరా తయారీ కోసం తీసుకువస్తున్న నల్ల బెల్లాన్ని ఎక్స్తెజ్ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. కురిచేడు నుంచి ఎర్రబాలెం గ్రామానికి ఆటోలో 550…
తిరుపతి: రాష్ట్ర విభజన చిన్న పని కాదని కేంద్రమంత్రి పల్లంరాజు అన్నారు. తెలంగాణ ప్రజల ఆంకాంక్ష కేంద్రానికి బాగా తెలుసన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక కూడా కేంద్రం పరిశీలనలో ఉందన్నారు.
అద్దంకి : ప్రకాశం జిల్లా అద్దంకి – సింగరాయకొండ ప్రధాన రహదారిలో ఈ రోజు తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రహదారి పక్కన ఆగివున్న లారీని స్కార్పియో వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
విశాఖ : ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో ‘ప్రేమా గీమా జాంతానై’ సినిమా చిత్రీకరణను విద్యార్థులు అడ్దుకున్నారు. చిత్రీకరణకు అనుమతి ఇవ్వడం వల్ల తమ చదువులు పాడవుతున్నాయని విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో చిత్ర యూనిట్ అక్కడి నుంచి వెనుదిరిగింది.
గుంటూరు : చుండూరు కేసు పబ్లిక్ ప్రాసిక్యూటర్, పౌరహక్కుల నేత బి. చంద్రశేఖర్ ఈ ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించారు. ఆయన మృతికి మంత్రి డొక్కా మాణాక్యవరప్రసాద్ సంతాపం తెలిపారు.
కృష్ణా : సమైక్యవాదానికి చంద్రబాబు మద్దతు తెలపాలని కనువిప్పు యాత్రకు సిద్దమైన విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఉదయం అనుమంచిపల్లిలో లగడపాటి బస చేసిన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు.…