పెద్ద శంకరంపేటలో పండుగ వేల విద్యుత్ కోతలు

అల్లాడిపోతున్న ప్రజలు వ్యాపారస్తులు
పెద్ద శంకరంపేట, అక్టోబర్ 16 (జనంసాక్షి) పెద్ద శంకరంపేట మండలంలో సందడి పూర్తంగా జరగాల్సిన పండుగ వేళ మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో అకస్మాత్తుగా తలెత్తిన తీవ్ర విద్యుత్ కోతలు ప్రజలను వ్యాపారస్తులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పండుగ వేళ కరెంట్ సరఫరా లో ఏర్పడిన అంతరాయంతో నాన్న తండాలు పడాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు బంద్. తీవ్ర నష్టం. బతుకమ్మ, దసరా పండుగ సీజన్ కావడంతో పెద్ద శంకరంపేట ప్రధాన వీధుల్లోని బట్టల దుకాణాలు కిరణా షాపులు ఇతర వాణిజ్య సముదాయాలు కొనుగోలుదారులతో ఆడాలి కళకళలాడాలి. అయితే ఈ కవర్స్ లోనూ పిక్ అవర్స్ లోను పదే పదే విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వ్యాపారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇన్వైటర్లు జనరేటర్ల సౌకర్యం లేని చిన్న వ్యాపారస్తులు చీకట్లోనే గడపాల్సిన పరిస్థితి వస్తుంది. మరోవైపు శీతల పానీయాలు డైరీ ఉత్పత్తులు పాడైపోయే పదార్థాల విక్రతలు విద్యుత్ లేక భారీగా నష్టపోవాల్సి వస్తుందని ప్రజలు వాపోతున్నారు.
అంధకారంలో పండగ సంబరాలు.
ఇలలో పండుగ పిండి వంటలు చేసుకుని సమయానికి, కుటుంబ సభ్యులంతా కలిసి పండుగను ఆనందంగా గడపాల్సిన వేల కరెంటు కోతలు తీవ్ర నిరాశను మిమ మిగులుస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు. సాయంత్రం , రాత్రి వేళలో ఉక్కపోతలతో వృద్ధులు చిన్నారులు సైతం అల్లాడిపోతున్నారు. సాయంత్రం వేళలో కరెంటు కోతలతో వీధులన్నీ అంతగా అంధకారంలోకి వెళ్ళిపోతున్నాయని కనీసం రాకపోకలు సాగించడానికి కూడా ఇబ్బందికరంగా మారుతుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణం అంటూ ప్రజల ఆరోపిస్తున్నారు. పండగ సమయాల్లో ఎటువంటి అంతరయాలు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన ట్రాన్స్కో అధికారులు నిర్లక్ష్యంగా వివరించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి పెద్ద శంకరంపేటలో నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని, లోడును మొండి కైతున్న లైన్లు, ట్రాన్స్ఫార్మర్లను సరిచేయాలని ప్రజలు, వ్యాపార వర్గాలు కోరుతున్నాయి.



