Friday, 6 November 2026

వార్తలు

కాల్‌లిస్ట్‌ వ్యవహారం పై జేడీ ఫిర్యాదు

హైదరాబాద్‌: ఫోన్‌ లిస్టు వ్యవహారంపై సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును నగర్‌ సీసీఎన్‌ విభాగానికి పంపినట్టు నగర పోలీసు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. అదే విధంగా చంద్రబాల ఫోన్‌ కాల్‌…

ప్రణబ్‌కు మద్దతు అంశం పై నిర్ణయం తీసుకోలేదు

నామా నాగేశ్వరరావు న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికలో ప్రణబ్‌ముఖర్జీకి మద్దతునిచ్చే అంశం పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుగుదేశం పార్లమెంటరీ నేత నామా నాగేశ్వరరావు తెలిపారు. ఎన్డీయే కన్వీనర్‌, జనతాదళ్‌(యు) నేత శరద్‌పవార్‌తో ఆయన సమావేశమయ్యారు. అనంతరం…

మంత్రుల కమిటీ కన్వీనర్‌గా ధర్మాన

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ విశ్లేషణ, భవిష్యత్తు కార్యచరణ నిమిత్తం 10 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటయింది. ధర్మాన ప్రసాదరావు కమిటీ కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. సభ్యులుగా ఆనం రామనారాయణరెడ్డి,కన్నా లక్ష్మీనారాయణ, రఘువీరారెడ్డి, విశ్వరూప్‌, పితాని సత్యనారాయణ, డీకేఅరుణ, తోటనర్సింహం, సారయ్య,…

రాజీనామా చేసిన ఐపీఎస్‌ అధికారి గౌతంకుమార్‌

హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి గౌతంకుమార్‌ రాజీనామా చేశారు. డీజీపీ నియామకం చెట్లదంటూ క్యాట్‌ ఇచ్చిన తీర్పు అమలు చేయకుండా ప్రభుత్వం హైకోర్టుకు వెళ్లడాన్ని నిరసిస్తు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పరిపాలన విభాగానికి ఆయన తన…

బంజారాహీల్స్‌ లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌ సిటీ సెంటర్‌లో మంగళవారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే స్పందించిన సిటీసెెంటర్‌ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది.

సరబ్‌జీత్‌సింగ్‌ మరణశిక్ష జీవిత ఖైదుగా మార్పు

ఇస్లామాబాద్‌ : పాక్‌లో మరణశిక్షను ఎదుర్కొంటున్న సరబ్‌జీత్‌సింగ్‌కు అధ్యక్షుడు జర్దారీ క్షమాభిక్షను ప్రసాదించారు. అతని మరణశిక్షను జీవితఖైదుగా మార్చారు.గత 22 ఏళ్లుగా పాక్‌ జైల్లో శిక్షను అనుభవిస్తున్న భారత్‌కు చెందిన సరబ్‌ జీత్‌ విడుదల కోసం న్యాయశాఖ అధికారులు…

యారాడ బీచ్‌లో యువకుల గల్లంతు: ఒకరి మృతి

విశాఖ: యారాడ బీచ్‌లో స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గల్లంతయ్యాడు. పెదగంట్యాడ మండలానికి చెందిన తాతారావు , రాములు మరో యువకుని తో కలిసి యారాడ బీచ్‌లో స్నానం చేస్తుండగా…

పిడుగుపాటు తో ముగ్గురి మృతి

పెబ్బేరు: మహబూబ్‌నగర్‌ జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. పెబ్బేరు మండలం పాతపల్లిలో పిడుగుపాటుతో ముగ్గురు మృతి చెందారు. గద్వాల్‌ మండలం తూరుకోనిపల్లిలో పిడుగుపడి 100 గొర్రెలు మృతి చెందాయి. పలు చోట్ల ఆస్తినష్టం సంభవించింది.

జగన్‌ను కలుసుకున్న కుటుంబసభ్యులు

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టై చంచల్‌గూడ్‌ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న వైఎస్‌ జగన్‌ను ఆయన కుటుంబసభ్యులు మరోమారు కలుసుకున్నారు. జగన్‌ తల్లి వైఎస్‌ విజయ, భార్య భారతి, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌లు జగన్‌ను ములాఖత్‌ సమయంలో కలుసుకున్నారు.…

కేంద్ర మంత్రి పదవికి వీరభద్రసింగ్‌ రాజీనామా

న్యూఢిల్లీ : అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేంద్ర చిన్న,మధ్యతరహా పరిశ్రమలశాఖ మంత్రి వీరభద్రసింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌కు సమర్పించారు. 23 సంవత్సరాల కిందట…