వార్తలు
జొన్నగుడ్డిలో ఇరువర్గాల ఘర్షణ
జొన్నగుడ్డి: విజయనగరం జిల్లా జొన్నగుడ్డి ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది, ఈ ఘర్షణలో ఒకరికి గాయాలు కాగా.. 4 ఆటోలు, 6 ద్విచక్ర వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
