వార్తలు
బూడిదగుంట నిర్మాణానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన తెదేపా
ముత్తుకూరు: నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నేలటూరులో జెన్కో నిర్మిస్తున్న బూడిదగుంటకు వ్యతిరేకంగా తెదేపా ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ప్లాంటు వద్దకు ఎమ్మెల్యేలు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
