తెలంగాణ
భార్యను చంపిన పోలీసు కానిస్టేబుల్
హైదరాబాద్,(జనంసాక్షి): కట్టుకున్న భార్యను కడతేర్చాడొక పోలీసు కానిస్టేబుల్. యూసఫ్‌గూడలోని కార్మిక నగర్‌లో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భర్యను చంపి పారిపోతున్న కానిస్టేబుల్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమని భావిస్తున్నారు.
