అంగరంగవైభవంగా మొదలైన గణనాధుని నవరాత్రి ఉత్సవాలు

 

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్31(జనంసాక్షి)

గణనాధుని నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా బుధవారం ప్రారంభమైయ్యాయి. భక్తి శ్రద్ధలతో, పూజలు భజనలు మధ్య బొజ్జ గణపయ్య పూజలందుకుంటాడు. అందులో భాగంగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని జీవంచిపల్లి రైల్వే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గణపతి ఉత్సవాలలో గ్రామస్తులంతా పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలోని ప్రతి కుటుంభం ఆయువారోగ్యాలతో, పాడి పంటలతో, సిరిసంపదలతో చల్లగా ఉండాలని విజ్ఞేషుణ్ణి ప్రార్ధిస్తూ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పధిలోజు రోహిత్, నాయిని శ్రీకాంత్, అజ్మీరా సందీప్, నాయిని వినయ్, అలవాల తేజ, చద్రగిరి యువశంకర్, మేకల సందీప్, మరేడి రోహిత్ రాజ్, చలవాది సందీప్, రావూరి నాగేంద్రాబు, మరేడి విశాల్, బత్తుల సాయి, నెలం శ్రీనివాస్, రావూరి ప్రశాంత్, బుడిమే సందీప్, వంగల శ్రీమాన్ కాగితాల జ్ఞానఖ్యాతిక, నెలం రిషిత, మద్దేజు జాహ్నవి, భక్తులు తదితరులు పాల్గొన్నారు.