అంగరంగ వైభవం గా

శ్రీకృష్ణాష్టమి వేడుకలు….
శ్రీకృష్ణాష్టమి సందర్భం గా కృష్ణాలయం లో ప్రత్యేక పూజలు…
భక్తులతో కిటకిటలాడిన కృష్ణాలయం
ములుగు బ్యూరో,ఆగస్ట్20(జనం సాక్షి):-
శ్రీ కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా ములుగు వెంకటాపూర్ నల్లగుంట గ్రామంలో శనివారం రోజున ఘనంగా పూజలు నిర్వహించడం జరిగిందనీ గ్రామ గుడి కమిటీ చైర్మన్ మందల మధుకర్ రెడ్డి తెలిపారు.శుక్రవారం గ్రామ సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం మాజీ ఎంపీటీసీ సునీత సతీష్ శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.శనివారం ఉదయం శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు,శ్రీకృష్ణ భజనలు కార్యక్రమం,అనంతరం ఉట్టి కొట్టు కార్యక్రమం ను ప్రారంభించడం జరిగింది.వెంటనే పోలు ఎక్కే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందనీ గ్రామ గుడి కమిటీ చైర్మన్ మందల మధుకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం లో ఫస్ట్, సెకండ్ బహుమతులను  ఇవ్వడం  జరిగిందని తెలపడం జరిగింది.గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కగ్రామాల  ప్రజలు శ్రీకృష్ణుని దర్శనం కోసం తరలివస్తున్నారని ఇంకా నిత్యం పూజలు జరుతాయని భక్తులు అధిక సంఖ్య లో దర్శనం చేసుకోవలని గ్రామ గుడి కమిటీ తెలియజేశారు.గుడి పూర్తి అయిన తర్వాత మొదటి సారి నిర్వహించిన వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అని గ్రామ సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యక్షులు సంజీవ రెడ్డి,పెంచాల దీపక్,కోశాధికారి మందల ప్రభాకర్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి రామగిరి శ్రీనివాస్,సభ్యులు ప్రేమ్ సాగర్,మందల చిన్న వెంకట రమణ రెడ్డి,మాజీ ఎంపీటీసీ చర్లపల్లి సునీత సతీష్,ఉప సర్పంచ్ భూక్యా శంకర్,పులి మధుసూదన్ రెడ్డి,రెడ్డి నరసయ్య, పోలుదాసరి రవి,సకినపెల్లి మురళి,ఇటుకాల బద్రి,కారుపోతుల యాదగిరి,గట్టు కుమారస్వామి,తడక మొగిలి,మందల ప్రభూరెడ్డి,తంగళ్ళపెల్లి శ్రీధర్,తడక రవి,పబ్బ శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు