*అంబేద్కర్ విగ్రహాలను అవమానపరుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి*
పెద్దేముల్ సెప్టెంబర్ 28 (జనం సాక్షి)
పెద్దేముల్ మండల పరిధిలోని ఆత్కూర్ గ్రామంలో రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవమానపరిచిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని బుధవారం ప్రజాసంఘాల నాయకులు ఆత్కూరు గ్రామంలో నిరసన వ్యక్తం చేశారు.పెంటకుప్పల దగ్గర అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టడం తీవ్రంగా ఖండిస్తున్నామని హెచ్చరించారు.ప్రతి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి రక్షణ కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు శ్రీనివాస్, గోపాల్ ,స్వామిదాస్, ఆనంద్,కృష్ణ ,హనుమంతు, భాస్కర్ ,యాదయ్య, లక్ష్మణ్, నరేష్ ,యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.