Wednesday, 4 November 2026

అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర లీగల్ సెల్ అడ్వైజర్ గా టీ.వీ.ఎస్ లక్ష్మి

ఎల్బీ నగర్ (జనం సాక్షి  )అఖిల భారత విశ్వకర్మ మహాసభ రాష్ట్ర   లీగల్ సెల్ అడ్వైజర్ గా  హైకోర్టు అడ్వకేట్   టీ.వీ.ఎస్ లక్ష్మి  ని నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షులు  బ్రహ్మశ్రీ కౌలే జగన్నాథ చారి  ఉత్తర్వులు జారీ చేశారు . ఈ సందర్భంగా లక్ష్మి  మాట్లాడుతూ నా నీయమ్మకానికి సహకరించిన రాష్ట్ర నాయకులకి నా యొక్క కృతజ్ఞతలు, జాతి అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతానని తెలియజేస్తున్నానని తెలిపారు .  ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు జగన్నాథ చారి మాట్లాడుతూ విశ్వకర్మల అభివృద్ధి కోసం అఖిల భారత విశ్వకర్మ మహాసభ వేదికగా తెలంగాణలో ఉన్న విశ్వకర్మలు అందరూ ఏకమై జాతి అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో జాతీయ అధ్యక్షులు అశ్విన్ చారి , జాతీయ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ , రాష్ట్ర గౌరవ అధ్యక్షులు చెన్నయ్య చారి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకోజు లింగాచారి  రాష్ట్ర కోశాధికారి ఆవంచి మురళి  తదితరులు పాల్గొన్నారు