Tuesday, 3 November 2026

అధికార టిఆర్‌ఎస్‌కు, బిజెపికి చెక్‌

పాదయాత్రతో ప్రజల్లో కదలిక తేవాలి
క్షేత్రస్థాయిలో రెండు పార్టీలను ఎండగట్టే లక్ష్యం
సమాలోచనల్లో పిసిసి చీఫ్‌ రేవంత్‌
హైదరాబాద్‌,మార్చి2(జనం సాక్షి): కాంగ్రెస్‌ చేపడుతున్న కార్యక్రమాలకు మంచి స్పందన వస్తుండడంతో ఇకనేరుగా ప్రజల్లోకి వెళ్లాలని పిపిసి అధ్యక్షుడు రేవంత్‌ యోచిస్తున్నారు. ఇప్పటికే టిఆర్‌ఎస్‌ లక్ష్యంగా
అనేకాందోళనలు పిసిసి విజయవంతం చేసింది. ఈ క్రమంలో గడపగడపకూ ప్రభుత్వ వ్యతిరేకతను చేరవేయాలన్న ఆలోచనలో ఉన్నారు. దీనికి అనుగుణంగా పాదయాత్ర చేయడం ఉత్తమమని ఆయన భావిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దీంతోపాటే కాంగ్రెస్‌ నేతలందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే యత్నం కూడా చేయాలన్న సంకల్పంతో ఉన్నారు. ఈ క్రమంలోఅధికార ఆర్‌ఎస్‌, బీజేపీలకు ధీటుగా క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు వేగవంతం చేసేందుకు కాంగ్రెస్‌ నేత పావులు కదుపుతున్నారు. అధికారంలోకి రావడానికి పార్టీకి కలిసొచ్చిన పాదయాత్రనే నమ్ముకోవాలని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అభిప్రాయానికి వచ్చిందని సమాచారం. ఎన్నికలు ఏడాదిలోగా రావచ్చన్న సంకేతాలు ఉన్నాయని కాంగ్రెస నమ్ముతోంది. పాదయాత్రపై పార్టీ ముఖ్యనేతలంతా ఏకాభిప్రాయంతో ఉన్నా.. ఇది ఎవరు చేపట్టాలన్న దానిపైన మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రశాంత్‌ కిశోర్‌ను వ్యూహకర్తగా నియమించుకుని టీఆర్‌ఎస్‌ పార్టీ ఇప్పటికే తన కార్యాచరణను ప్రారంభించగా.. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో రెండు, మూడు స్థానాలకు టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లను నెట్టేసి రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా అవతరించేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఈ పరిస్థితుల్లో క్షేత్ర స్థాయిలో క్యాడర్‌ ఉన్న కాంగ్రెస్లో కదలికను తీసుకువచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి యోచిస్తున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచే ఈ పాదయాత్ర ఉంటుందనీ చెబుతున్నారు. టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) సమావేశంలోనూ రేవంత్‌ పాదయాత్ర చేపట్టాలన్న ప్రతిపాదనను మాజీ మంత్రి చిన్నారెడ్డి పెట్టారు. అయితే పార్టీ సభ్యత్వ నమోదు పక్రియపైనే చర్చించిన పీఏసీ ఆ అంశంపైన చర్చను వాయిదా వేసింది. అయితే పాదయాత్రను ఎవరు చేపట్టాలన్నది ప్రస్తుతం పార్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే కెసిఆర్‌ను ఎదుర్కోవాలంటే క్షేత్ర స్థాయిలో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడమే ఉత్తమమని పలువురు నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టే యోచనలో రేవంత్‌ ఉండగా… ముఖ్యనేతల భాగస్వామ్యం ఉండాలంటూ తెరపైకి డిమాండ్లు వస్తున్నాª`టలు సమాచారం. రేవంత్‌ కూడా అందరినీ కలుపుకుని పోవడం ద్వారా జగ్గారెడ్డి లాంటి అసమ్మతి వాదులకు చెక్‌ పెట్టాలని చూస్తున్టన్లు సమాచారం. పార్టీలో అంతా ఉమ్మడి పోరాటమనే భావన రావాలనిచూస్తున్నారు. టీపీసీసీలో ఏకాభిప్రాయం రాకుంటే కెసిఆర్‌ను ఎదుర్కోవడం కష్టమని, దీనిని అలుసుగా తీసుకుని టిఆర్‌ఎస్‌ విమర్శలు గుప్పించ గలదని బావిస్తున్నారు. పీపీసీసీ చీఫ్‌ ఈ పాదయాత్రను చేపడితేనే కార్యకర్తల్లో ఉత్సాహం, పార్టీలో కదలికా వస్తుందని నేతలు కూడా అభిప్రాయ పడుతున్నారు. కాంగ్రెస్‌ నేతలంతా కలిసి కట్టుగా ఉన్నారన్న సంకేతం జనంలోకి పంపేందుకు ముఖ్యనేతలు అందరూ ఎవరికి ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో వారు పాదయాత్ర చేపట్టాలన్న వాదననూ కొందరు నేతలు తెస్తున్నారు. పాదయాత్రకు నేతల ఎంపికలో సామాజిక సమతూ కాన్ని ప్రదర్శించవచ్చన్న అభిప్రాయాన్నీ వ్యక్తం చేస్తున్నారు. కాగా, రేవంత్‌రెడ్డి అందర్నీ కలుపుకుని పోవడంలేదని, ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై పార్టీలోని మెజార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నట్లు కూడా చెబుతున్నారు. రేవంత్‌ ఒక్కరే పాదయాత్ర చేపడితే పార్టీ ఆ క్రెడిట్‌ అంతా ఆయన ఖాతాలోకి వెళ్లే అవకాశముందన్న భావనలో అసంతృప్తులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ పాదయాత్రను వారు గుర్తుచేస్తున్నారు. ఈనేపథ్యంలో ముఖ్యనేత లందరికీ భాగస్వామ్యం ఉండేలా పాదయాత్ర రూపకల్పన జరగాలన్న వాదనను తెరపైకి తెస్తున్నారు. అయితే పాదయాత్రపై టీపీసీసీ కార్యవర్గంలో కానీ, రాజకీయ వ్యవహారాల కమిటీలోగానీ నిర్ణయం జరగాల్సి
ఉంటుంది. ఒకవేళ ఏకాభిప్రాయం రాకుంటే అధిష్ఠానం జోక్యం చేసుకోవాల్సి వస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే భట్టి తన నియోజకవర్గంలో పాదయాత్రను కొనసాగిస్తున్నారు. అలా కాకుండా పార్టీ పరంగా సాగాలన్న డిమాండ్‌ ఉంది. మొత్తంగా రెండు పార్టీలను ఢీకొనడం కోసం ముందుకు కదలాలన్న అభిప్రాయం ఉంది.